ఆయ‌న ఓ డాక్ట‌ర్‌. అయినా త‌న పిల్ల‌ల‌ను ప్రైవేటు స్కూల్‌కు కాకుండా ప్ర‌భుత్వ పాఠ‌శాల‌కు పంపుతున్నాడు, ఎందుకో తెలుసా..?

మ‌న దేశంలో ఉన్న ప్ర‌భుత్వ పాఠ‌శాలలు ఎలాంటి దుస్థితిలో ఉంటాయో ప్ర‌తి ఒక్క‌రికీ తెలుసు. ఉపాధ్యాయుల సంఖ్య త‌క్కువ‌గా ఉండ‌డం, కొంద‌రు వ‌స్తే కొంద‌రు స‌రిగ్గా రాక‌పోవ‌డం, సౌక‌ర్యాల లేమి… వెర‌సి త‌ల్లిదండ్రులెవ‌రైనా ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ల‌కు త‌మ పిల్ల‌ల‌ను పంపాలంటే వెనుకా ముందు ఆలోచిస్తారు. అంతే కానీ, ఆ స్కూళ్ల‌కు పంప‌ను గాక పంప‌రు. ప్రైవేటు పాఠ‌శాల‌ల‌కే పంపుతారు. అయితే ఆ డాక్ట‌ర్ మాత్రం అలా కాదు. చేతిలో డ‌బ్బుంది. త‌ల‌చుకుంటే పిల్ల‌ల్ని మంచి ఇంట‌ర్నేష‌న‌ల్ స్కూల్‌లో చేర్పించ‌గ‌ల‌డు. అయిన‌ప్ప‌టికీ త‌న పిల్ల‌ల‌ను ప్ర‌భుత్వ పాఠ‌శాల‌లోనే చ‌దివిస్తున్నాడు. అవును, మీరు విన్న‌ది నిజ‌మే. షాకింగ్ ఉన్నా, మేం చెబుతున్న‌ది క‌రెక్టే. ఇంత‌కీ ఆయన ఎవ‌రు, ఎందుకు అలా చేస్తున్నాడంటే…

ఆయ‌న పేరు అబ్ర‌హాం థామ‌స్‌. డెంటిస్టు విద్య‌ను అభ్య‌సించాడు. మంచి డాక్టర్‌గా ఎదిగాడు. తండ్రి డాక్ట‌ర్ కావ‌డంతో ఆయ‌న వ‌ద్దే థామ‌స్ ప‌నిచేస్తుండేవాడు. ఈ క్రమంలో పెళ్లి జ‌ర‌గ‌డం, సంతానం క‌ల‌గ‌డం అయిపోయాయి. అయితే థామ‌స్ స్థితిమంతుడే అయిన‌ప్ప‌టికీ పిల్ల‌లను ప్రైవేటు స్కూల్‌లో చేర్పించ‌లేదు. ప్ర‌భుత్వ పాఠ‌శాల‌లోనే చేర్పించాడు. ఆ స్కూల్ ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలోని బ‌య్య‌న‌ప‌ల్లి అనే ప్రాంతంలో ఉంది. అక్క‌డి మండ‌ల పరిష‌త్ స్కూల్‌లో థామ‌స్ త‌న పిల్ల‌ల‌ను చేర్పించాడు. అయితే ప్ర‌భుత్వ పాఠ‌శాల‌లోనే ఎందుకు, మంచి ప్రైవేటు స్కూల్‌లో చేర్పించ‌వ‌చ్చు క‌దా, అని ఎవ‌రైనా అడిగితే, ఆయ‌న ఏం చెబుతాడంటే… మ‌న‌కంటే దేవుడు అన్నీ ఇచ్చాడు, కానీ కొంద‌రికి మాత్రం అలా కాదుగా. మ‌రి వారిని ఎవ‌రు ఆదుకుంటారు చెప్పండి. అయినా అంద‌రూ క‌ల‌సి ఒక్క చోట చేరి చ‌దువుకుంటేనే అక్క‌డ జ్ఞానం అంద‌రికీ షేర్ అవుతుంది. దాంతో ప్ర‌భుత్వ పాఠ‌శాల‌లు స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించే వేదిక‌లుగా మారుతాయి… అంటారాయ‌న‌.

అయితే పిల్ల‌లను అయితే థామ‌స్ చేర్పించారు కానీ, అందులో స‌దుపాయాలు లేవు. దీంతో అదే స్కూల్‌లో వాలంటీర్ ఉపాధ్యాయురాలిగా ప‌నిచేస్తున్న త‌న భార్య షీబాతో క‌లిసి స్కూల్‌లో స‌దుపాయాల కోసం ఎంత ఖ‌ర్చ‌వుతుందో లెక్క వేశారు. అందుకు గాను రూ.3 ల‌క్ష‌ల వ‌ర‌కు అవుతుంద‌ని గుర్తించారు. దీంతో సొంత ఖ‌ర్చుల‌తో ఆ స్కూల్‌లో స‌దుపాయాల‌ను క‌ల్పించ‌డం మొద‌లు పెట్టారు. అందులో భాగంగా మొద‌ట సోలార్ ప‌వ‌ర్‌ను ఏర్పాటు చేశారు. దాంతో స్కూల్‌కు అవ‌స‌రం అయ్యే విద్యుత్ స‌మ‌స్య తీరిపోయింది. ఇక మ‌రుగుదొడ్లు. బాలురు, బాలిక‌లకు, చిన్న‌పిల్ల‌ల‌కు, కొంచెం పెద్ద‌వారికి ప్ర‌త్యేకంగా విడి విడిగా మ‌రుగుదొడ్ల‌ను కట్టించారు. దీంతోపాటు స్కూల్ కాంపౌండ్ వాల్‌, ప్రాంగ‌ణంలో మొక్క‌లు వంటి వాటిని ఏర్పాటు చేశారు. ఈ క్ర‌మంలో స్కూల్ చ‌క్క‌గా మారింది. దీంతో ప్ర‌భుత్వం అక్క‌డ అద‌న‌పు ఉపాధ్యాయుల‌ను కూడా ఏర్పాటు చేసింది. అలా వారు వ‌చ్చాక ఇప్పుడిప్ప‌డే నెమ్మ‌దిగా అందులో చేరుతున్న విద్యార్థుల సంఖ్య కూడా పెరిగింది. దీనికంత‌టికీ థామ‌స్‌, ఆయ‌న భార్యే కార‌ణం అంటే న‌మ్మ‌గ‌ల‌రా..!

థామ‌స్ ఆ స్కూల్‌లో స‌దుపాయాల‌ను మాత్రమే కాదు, అంత‌కు ముందు మ‌రో అద్భుత‌మైన, వినూత్నమైన ఆలోచ‌న‌కు శ్రీ‌కారం చుట్టారు. దానికి కార్య‌రూపం ఇచ్చారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలోని కోడూరులో ధీర‌జ్ అనే ఓ వ్య‌క్తి స‌హ‌కారంతో రూ.15 ల‌క్ష‌ల వ‌ర‌కు ఖ‌ర్చు పెట్టి HutK అనే యాంపీ థియేట‌ర్‌ను క‌ట్టించాడు. లీలా లైబ్ర‌రీ అండ్ లెర్నింగ్ సెంట‌ర్‌ను కూడా ఏర్పాటు చేశాడు. అయితే వీటిని సాంప్ర‌దాయ గ‌డ్డి, వెదురు బొంగులు, మ‌ట్టి, రాళ్లు, కంక‌ర‌, టార్ప‌లిన్ వంటి వాటితో గుడిసెలా నిర్మించాడు. అయితే వీటిని ఎందుకు ఏర్పాటు చేశారంటే… పేద పిల్లల కోసం. వారికి ఉచితంగా లైబ్ర‌రీ స‌దుపాయాన్ని క‌ల్పించ‌డంతోపాటు హ‌ట్‌కె యాంపీ థియేట‌ర్ ద్వారా వారిలో ఉన్న సృజ‌న‌ను బ‌య‌ట‌కు తీయ‌డం కోసం దాన్ని ఏర్పాటు చేశాడు. అందులో పిల్ల‌ల‌కు పాట‌లు పాడ‌డం, సంగీతం, ఫైన్ ఆర్ట్స్ వంటి అనేక అంశాల‌ల్లో శిక్ష‌ణ‌ను ఇస్తారు. నిజంగా థామ‌స్ లాంటి వారు మ‌న‌కు ఎక్క‌డో గానీ క‌నిపించ‌రు. పేద ప్ర‌జ‌లు, వారి పిల్ల‌ల కోసం ఇంత చేస్తున్న ఆయ‌న‌కు నిజంగా అభినంద‌న‌లు తెల‌పాల్సిందే..!

Comments

comments

Share this post

scroll to top