కూలీ ఖాతాలోకి రూ.9,900 కోట్లు..! అన్ని డ‌బ్బులు ఎలా వ‌చ్చాయంటే..?

రాత్రికి రాత్రే జాక్‌పాట్ త‌గిలి మీరు కోటీశ్వ‌రులు…. కాదు కాదు… బిలియ‌నీర్లు అయిపోతే ఎలా ఉంటుంది..? ఊరుకోండి గానీ… నిజంగా అలాంటి జాక్‌పాట్ ఎవ‌రికైనా త‌గులుతుందా..? లాట‌రీలో ఎంత గెలిచినా కోటి, 10 కోట్లు అంత వ‌ర‌కే చాన్స్ ఉంటుంది. కానీ వందలు, వేల‌ కోట్లు ఎలా వ‌స్తాయి. రావు క‌దా..? అని అడ‌గ‌బోతున్నారా..? అయితే మీరు చెబుతోంది క‌రెక్టే. కానీ… మ‌ధ్య‌ప్రదేశ్‌కు చెందిన ఆ వ్య‌క్తికి మాత్రం నిజంగా జాక్‌పాటే త‌గిలింది. కానీ అత‌ను ఏ లాట‌రీ టిక్కెట్ కొన‌లేదు. ఏమీ చేయ‌లేదు. రాత్రికి రాత్రే అత‌ని బ్యాంక్ అకౌంట్‌లో సుమారు 99 బిలియ‌న్ (9,900 కోట్లు) రూపాయ‌లు జ‌మ అయిపోయాయి. అవును, మీరు ఎంత‌టి షాక్ తిన్నా మేం చెబుతోంది నిజ‌మే.

ambaram-bank-account

మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లోని ఉజ్జ‌యిని ప్రాంతానికి చెందిన అంబ‌రం అనే వ్య‌క్తి దిన‌స‌రి కూలీ. నిత్యం కూలి ప‌నులు చేసుకుని పొట్ట పోసుకుంటాడు. అందులో భాగంగానే త‌న వ‌ద్ద ఉన్న డ‌బ్బుల‌ను దాచుకోగా అవి బ్యాంకులో రూ.1500 దాకా జ‌మ‌య్యాయి. అయితే వాటిలోంచి రూ.500 విత్‌డ్రా చేసి త‌న కూతురి కాలేజీ ఫీజు క‌ట్టాల‌ని అనుకున్నాడు. ఆ క్ర‌మంలోనే స్థానికంగా ఉన్న బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్‌కు వెళ్లాడు. అక్క‌డ రూ.500 విత్ డ్రా చేసిన అంబ‌రం త‌న అకౌంట్‌లో రూ.9,900 కోట్లు ఉండ‌డాన్ని చూసి షాక్ తిన్నాడు. ఒక్క‌సారిగా అత‌నికి ఏం చేయాలో అర్థం కాలేదు.

దీంతో వెంట‌నే అత‌ను ఆ విష‌యాన్ని సంబంధిత బ్యాంక్ అధికారులు తెలియ‌జేశాడు. కాగా విష‌యం తెలుసుకున్న బ్యాంక్ సిబ్బంది అంబ‌రం అకౌంట్‌ను సీజ్ చేశారు. పాపం, ఇప్పుడ‌త‌ని వ‌ద్ద మిగిలి ఉన్న రూ.1000 తీసుకోలేని ప‌రిస్థితి. అయితే ఇదిలా ఉంచితే అస‌లు అంత‌టి భారీ మొత్తంలో డ‌బ్బు అత‌ని అకౌంట్‌లోకి ఎలా వ‌చ్చింద‌నే ఇప్పుడు బ్యాంక్ అధికారులు విచార‌ణ చేస్తున్నారు. అస‌లే న‌గ‌దు మార్పిడి, డిపాజిట్, విత్ డ్రా వంటి కార్య‌క‌లాపాలు పెద్ద ఎత్తున కొన‌సాగుతున్నందున ఎవ‌రైనా అత‌ని అకౌంట్‌లో జ‌మ చేశారా అన్న కోణంలో అధికారులు అంబ‌రం బ్యాంక్ ఖాతా లావాదేవీల‌ను క్షుణ్ణంగా చెక్ చేశారు. దీంతో తెలిసిన అస‌లు విష‌యం ఏమిటంటే అత‌ని ఖాతాలో ఎవ‌రూ డ‌బ్బు వేయ‌లేద‌ట. బ్యాంక్‌కు చెందిన సాఫ్ట్‌వేర్‌లో సాంకేతిక లోపం ఉన్నందునే అత‌ని అకౌంట్‌లోకి అంత పెద్ద మొత్తం బ‌దిలీ అయిన‌ట్టు గుర్తించారు. నిజ‌మే మ‌రి, ఇటీవ‌లి కాలంలో నోట్ల ర‌ద్దు నేప‌థ్యంలో పెద్ద ఎత్తున బ్యాంక్ లావాదేవీలు జ‌రుగుతున్నాయి క‌దా. మ‌రి ఆ లావాదేవీల‌కు త‌గిన‌ట్టుగా బ్యాంకుల సాఫ్ట్‌వేర్లు, స‌ర్వ‌ర్లు స‌రిగ్గా ప‌నిచేయ‌డం లేదేమో. అందుకే అంబ‌రం విష‌యంలో అలా జ‌రిగింది. ఏది ఏమైనా ఇలాంటి సాఫ్ట్‌వేర్ లోపాలు రాకుండా చూడాల్సిన బాధ్య‌త బ్యాంక్ అధికారులపైనే ఉంది. లేదంటే అంబ‌రం కాబ‌ట్టి నిజాయితీగా బ్యాంక్ అధికారుల‌కు చెప్పాడు. అదే మ‌రో వ్య‌క్తి అయితే అలా చెబుతాడా…? జ‌వాబు మీకే వదిలేస్తున్నాం..!

Comments

comments

Share this post

scroll to top