రోడ్డుపక్కన పాత పుస్తకాలమ్మే ఆ అమ్మ…తన బిడ్డ ఉన్నత చదువుకోసం చేస్తున్న పోరాటమిది.

మ‌నిషి తాను అనుకున్న ల‌క్ష్యం ఎంత పెద్ద‌దైనా మ‌న‌స్సులో సంకల్ప బ‌లం, ఆత్మ‌విశ్వాసం కావ‌ల్సినంత ఉంటే చాలు. ఎలాంటి ల‌క్ష్యాన్నైనా అవ‌లీల‌గా సాధించ‌గ‌లుగుతారు. అందుకు ఏవీ అడ్డు కూడా రావు. అయితే అలాంటి సంక‌ల్ప బలం ఉన్నా కొంద‌రు దుర‌దృష్ట‌వ‌శాత్తూ ల‌క్ష్యాన్ని సాధించ‌లేక‌పోతారు. అప్పుడు వారు దిగులు చెంద‌రు. త‌మ ల‌క్ష్యాన్ని త‌మ పిల్ల‌ల‌తో సాధింప‌జేసి వారి ఆనందంతోనే సంతృప్తి చెందుతారు. అహ్మ‌దాబాద్‌కు చెందిన రేఖాబెన్ దంప‌తులు కూడా స‌రిగ్గా ఈ కోవ‌కే చెందుతారు. ఇంత‌కీ వారు సాధించిన ఆ గొప్ప ల‌క్ష్య‌మేంటో తెలుసా..?

rekhaben

అహ్మ‌దాబాద్‌లో నివాసం ఉండే రేఖాబెన్ అనే మ‌హిళ‌కు, ఆమె భ‌ర్త‌కు స‌రైన చ‌దువు లేదు. దీనికి తోడు పేద‌రికం కార‌ణంగా వారు ఎల్ల‌ప్పుడూ అనేక ఇబ్బందుల‌ను ఎదుర్కొనే వారు. తింటానికి స‌రైన తిండి కూడా దొర‌కని ప‌రిస్థితుల్లో ఎలాగో కొంత అప్పు చేసి వారిరువురు రోడ్డు ప‌క్క‌న పాత పుస్త‌కాలు అమ్ముకునే వ్యాపారం ప్రారంభించారు. వారు ఇంజినీరింగ్‌, మెడిక‌ల్‌, ఐఐఎం, డిగ్రీ, లా వంటి కోర్సుల‌కు చెందిన ఆయా యూనివ‌ర్సిటీలు, కాలేజీల పాఠ్య‌పుస్త‌కాల‌ను సెకండ్ హ్యాండ్ లో కొనుగోలు చేసి ర‌హ‌దారి ప‌క్క‌న చాలా త‌క్కువ ధ‌ర‌కే విద్యార్థుల‌కు అమ్మ‌డం ప్రారంభించారు. దీంతో కొద్ది రోజుల్లోనే వారి వ్యాపారం జోరందుకుంది.

అయితే రేఖాబెన్‌కు, ఆమె భ‌ర్త‌కు చిన్న‌ప్ప‌టి నుంచి చ‌దువుకోవాల‌ని బాగా ఆశ‌గా ఉండేది. కానీ వారు 10వ త‌ర‌గ‌తితోనే చ‌దువును ఆపేయాల్సి వ‌చ్చింది. కానీ పుస్త‌కాల వ్యాపారం మ‌హిమో, ఏమో గానీ రేఖా బెన్ క్రమ క్ర‌మంగా ఆంగ్ల పుస్త‌కాలు బాగా చ‌దువుతూ ఆంగ్లంలో అన‌ర్గళంగా మాట్లాడే స్థాయికి చేరుకుంది. అయినా తాను ఇప్పుడు చ‌దువుకోవ‌డం వీలుకాక‌పోవ‌డంతో ఎలాగైనా త‌న పిల్ల‌ల‌ను బాగా చదివించాల‌ని నిర్ణ‌యించుకుంది. అందుకు భ‌ర్త స‌హ‌కారం కూడా అందింది. అయితే చాలా మంది రేఖాబెన్‌ను అవ‌హేళ‌న చేసేవారు. రోడ్డు ప‌క్క‌న పుస్త‌కాలు అమ్ముకునే వారు పిల్ల‌ల‌ను ఎలా చ‌దివిస్తారు..? అస‌లు వారు విద్యార్థుల‌కు ప‌నికొచ్చే పుస్త‌కాల‌ను ఎలా అమ్మ‌గ‌లుగుతున్నార‌ని ఎగ‌తాళి చేసే వారు. అయినా వాటిని రేఖాబెన్ దంప‌తులు ప‌ట్టించుకోలేదు. క‌ష్ట‌ప‌డి పైసా పైసా కూడ‌బెట్టి త‌మ పిల్లల్ని చ‌దివించారు. అయితే వారి క‌ష్టం వృథా కాలేదు. వారి పిల్ల‌లు 99 శాతం ఉత్తీర్ణ‌త‌తో ప్ల‌స్ 2 విద్య‌ను విజ‌య‌వంతంగా పూర్తి చేశారు. సీఏ (చార్ట‌ర్డ్ అకౌంటెంట్‌) కోర్సు చ‌దివేందుకు ప్రిపేర్ అవుతున్నారు. త్వ‌ర‌లో అది కూడా వారు సాధిస్తార‌ని రేఖా బెన్ గ‌ర్వంగా చెబుతోంది. తాను సాధించ‌లేక‌పోయిన ల‌క్ష్యాన్ని త‌న పిల్ల‌ల‌తో సాధింప‌జేస్తున్న ఆ మ‌హిళ‌కు నిజంగా మ‌నం హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే..!

( ఇలాంటి  సందేశాత్మక వార్తలు   మీ వాట్సాప్ లో డైరెక్ట్ గా చదవాలనుకుంటే .. మా వాట్సాప్ నెంబర్ 7997192411 కు START అని మెసేజ్ చేయండి.)

Comments

comments

Share this post

scroll to top