ఎన్ని సంవ‌త్స‌రాలు గ‌డిచినా ప్రేమ అలాగే ఉంటుంద‌న‌డానికి నిర్వ‌చ‌నం ఈ జంటే..!

యువ‌తీ యువ‌కులు ఒక‌రినొక‌రు చూడ‌డం, ఇష్ట‌ప‌డ‌డం, స్నేహం చేయ‌డం అది ప్రేమ‌గా మార‌డం… కొద్ది రోజుల‌కో, నెల‌ల‌కో విడి పోవ‌డం… మ‌ళ్లీ వేరే ఎవ‌రైనా క‌నిపిస్తే… ఇక అది అలా కొన‌సాగుతూనే ఉంటుంది. నేటి త‌రుణంలో జ‌రుగుతుందదే. స్వ‌చ్ఛ‌మైన ప్రేమ ఎలా ఉంటుంద‌నేదే నేటి త‌రం ప్రేమికులు మరిచిపోయారు. ఎక్క‌డో ఒక చోట త‌ప్ప‌, మ‌న‌కు దాదాపు అలాంటి ప్రేమికులు అస్స‌లు క‌నిపించ‌రు. ఇప్పుడు మేం చెప్ప‌బోయేది కూడా అలాంటి ల‌వ్ బ‌ర్డ్స్ గురించే. కానీ వారు యువ‌తీ యువ‌కులు కారు. ఒక‌ప్పుడు ఆ వ‌య‌స్సులో ప్రేమించుకుని, ఇంట్లో వారు ఒప్పుకోక‌పోవ‌డంతో, ఇత‌రుల‌ను పెళ్లి చేసుకుని, జీవితంలో మ‌ళ్లీ ఎప్పుడో క‌లుసుకున్న త‌రువాత మ‌ళ్లీ ఒక్క‌టైన జంటే ఇది. వారికి ఒక‌రి గ‌తంతో ఒక‌రికి సంబంధం లేదు. వారికి కావల్సింది ప్రేమే. ఒక‌రికొక‌రు తోడుగా క‌ల‌సి ఉండ‌డమే వారికి కావ‌ల్సింది.

love-couple

వారి పేర్లు మ‌హ‌జ‌బీన్ పటేల్‌, ష‌మీమ్ షిఫా. 1975లో మోడ‌లింగ్ రంగంలో కెరీర్ ప్రారంభించారు. ఒకానొక సంద‌ర్భంలో ఇద్ద‌రూ ఒక‌రినొక‌రు చూసుకోవ‌డం, ఆ చూపులు క‌ల‌సి మాట్లాడే వ‌ర‌కు, అది అక్క‌డి నుంచి స్నేహం, ప్రేమ వ‌రకు వెళ్లాయి. అయితే మ‌హ‌జ‌బీన్ ప‌టేల్ హిందూ యువ‌కుడు, ష‌మీమ్ షిఫా ముస్లిం యువ‌తి కావ‌డంతో స‌హ‌జంగానే వారి వారి ఇండ్ల‌లో వారిద్ద‌రి వివాహానికి పెద్ద‌లు ఒప్పుకోలేదు. దీంతో వారు చేసేది లేక పెద్దలు కుదిర్చిన సంబంధాల‌ను చేసుకుని దూరంగా విడిపోయారు. ష‌మీమ్ షిఫాకు ఇద్ద‌రు పిల్ల‌లు కూడా పుట్టారు.

అది 1991వ సంవ‌త్స‌రం. ఒకానొక ఫ్రెండ్ బ‌ర్త్ డే పార్టీలో మ‌హ‌జ‌బీన్ పటేల్‌, ష‌మీమ్ షిఫాలు ఇద్ద‌రూ ఒకరికొక‌రు ఎదురు ప‌డ్డారు. 16 ఏళ్ల త‌రువాత మ‌ళ్లీ క‌లుసుకోవ‌డంతో వారిద్ద‌రి ఆనందానికి అవ‌ధులు లేకుండా పోయాయి. ఈ క్ర‌మంలో ఇద్ద‌రూ ఒక‌ర్నొక‌రు ఆప్యాయంగా ప‌ల‌క‌రించుకున్నారు. అయితే అలా వారు క‌ల‌వ‌డ‌మే వారి మ‌రో నూత‌న జీవితానికి ఆరంభం అయింది. అనంత‌రం ఇద్ద‌రూ ఒకేసారి కోర్టులో కలిశారు. అయితే అప్ప‌టికే వారు త‌మ త‌మ భాగ‌స్వాముల నుంచి విడాకుల కోసం కోర్టులో ద‌ర‌ఖాస్తు చేసుకున్నారు. అలా ఆ రోజు వారు త‌మ పార్ట్‌న‌ర్స్‌తో విడిపోయి, కొన్ని రోజుల‌కు పెళ్లి చేసుకున్నారు. కాగా ష‌మీమ్ షిఫా పిల్ల‌ల‌ను కూడా మ‌హ‌జ‌బీన్ పటేల్ త‌న పిల్ల‌లుగా స్వీక‌రించాడు. వారి జీవిత ప‌య‌నంలో త‌మ అనుబంధానికి గుర్తుగా ఓ బిడ్డ కూడా జ‌న్మించాడు. ఇప్పుడు వారు ఐదుగురు. వారికి త‌మ గ‌తంతో ప‌నిలేదు. ప్రేమ‌, ఆప్యాయ‌త‌లు, ఎన్నో ఆశ‌ల‌తో కూడిన భ‌విష్య‌త్తే వారికి కావ‌ల్సింది. ట్రూ ల‌వ్ అంటే, నిజంగా ఇదే క‌దా..!

Comments

comments

Share this post

scroll to top