వాళ్లిద్ద‌రూ ఇష్ట‌ప‌డ్డారు…. వాళ్ళ మ‌తాలు వేరు…అయినా…పెద్ద‌ల‌ను ఒప్పించ‌డానికి 4 సార్లు, 4 విధాలుగా పెళ్ళి చేసుకున్నారు.!

ఓ యువ‌తి.. ఓ యువ‌కుడు.. ఇద్ద‌రూ ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకుందాం అనుకున్నారు. పెద్ద‌ల‌కు అదే విష‌యాన్ని చెప్పారు. కానీ పెద్ద‌లు య‌థావిధిగా అందుకు ఒప్పుకోలేదు. ఇంకేముందీ… ధైర్యం ఉన్న‌వారు, త‌మ కాళ్ల‌పై తాము నిల‌బ‌డ్డ వారు గ‌నుక పెద్ద‌ల అనుమ‌తి లేకుండానే పెళ్లికి సిద్ధ‌మయ్యారు. పెళ్లి చేసుకున్నారు. అంగ‌రంగ వైభ‌వంగా వారు వివాహ‌మాడారు. అదీ.. ఒక్క‌సారి కాదు, ఏకంగా నాలుగు సార్లు పెళ్లి చేసుకున్నారు. అవును, మీరు విన్న‌ది నిజ‌మే. ఆ జంట ఒక‌టి, రెండు సార్లు కాదు, ఏకంగా 4 సార్లు వివాహం చేసుకున్నారు. ఎందుకు..? అస‌లు విష‌యం ఏమిటంటే..?

అత‌ని పేరు ఫ‌యాజ్‌. ఆమె పేరు అంకిత‌. ఇద్ద‌రూ ఇండోర్‌లో ఉన్న ఐఐఎంలో విద్య‌ను అభ్యిసించారు. మంచి కంపెనీల్లో ఉద్యోగం సాధించారు. అయితే అలా వారు చ‌దువు అభ్య‌సించేటప్పుడే ప్రేమ‌లో ప‌డ్డారు. కానీ కెరీర్ ప‌రంగా సెటిల్ అయ్యాకే పెళ్లి చేసుకోవాల‌ని నిర్ణ‌యించుకున్నారు. ఈ క్రమంలోనే వారికి మంచి జాబ్‌లు కూడా వ‌చ్చాయి. అయితే ప్రేమించుకున్నారు కనుక‌, పెద్ద‌ల అంగీకారం అయితే పెళ్లి చేసుకోవాల‌ని భావించారు. కానీ అందుకు వారు ఒప్పుకోలేదు. దీంతో స్నేహితుల స‌హ‌కారంతో వారు పెళ్లి చేసుకున్నారు. అదీ… ఒక్క‌సారి కాదు, 4 సార్లు పెళ్లి చేసుకున్నారు.

ఫిబ్ర‌వ‌రి 18వ తేదీన పెళ్లి చేసుకునేందుకు అంకిత‌, ఫ‌యాజ్‌లు ఇద్ద‌రూ తేదీని నిర్ణ‌యించుకున్నారు. కానీ ఆ రోజున వారి జాత‌కం ప్ర‌కారం బాగా లేద‌ట‌. ఆ విష‌యాన్ని అంకిత త‌ల్లి ఆమెకు చెప్పింది. దీంతో వారు ఫిబ్ర‌వ‌రి 17 న‌ మ‌హాశివ‌రాత్రి రోజున ఆల‌యంలో దండ‌లు మార్చుకుని పెళ్లి చేసుకున్నారు. ఆ త‌రువాత రిజిస్ట‌ర్ మ్యారేజ్ చేసుకున్నారు. దానికైనా వారి త‌ల్లిదండ్రులు అటెండ్ అవుతార‌ని వారు భావించారు. కానీ వారు రాలేదు. ఆ త‌రవాత మ‌రో మారు స్నేహితులు, తెలిసిన వారి స‌మ‌క్షంలో హిందూ సాంప్ర‌దాయ పద్ధ‌తిలో పెళ్లి చేసుకున్నారు. అయిన‌ప్ప‌టికీ ఆ ప్రేమికుల త‌ల్లిదండ్రులు వారి ముఖం చూడ‌లేదు. ఆ త‌రువాత వారు ముస్లిం పద్ధ‌తిలో నిఖా ప‌క్కా చేసుకున్నారు. కానీ… అందుకు కూడా త‌ల్లిదండ్రులు రాలేదు. దీంతో చేసేది లేక అంకిత‌, ఫ‌యాజ్‌లు ఇద్ద‌రూ ఎట్ట‌కేల‌కు కొత్త జీవితం ప్రారంభించారు. ఈ క్ర‌మంలో 2 సంవ‌త్స‌రాలు పూర్తి అయ్యాయి. అయితే ఇప్పుడు అంకిత‌, ఫ‌యాజ్‌ల త‌ల్లిదండ్రులు వారి పెళ్లిని యాక్సెప్ట్ చేశారు. దీంతో వారి ఆనందానికి అవ‌ధులు లేకుండా పోయాయి. నిజంగా ఇలాంటి అదృష్టం ఎవ‌రికి ద‌క్కుతుంది చెప్పండి..!

Comments

comments

Share this post

scroll to top