జ‌న‌వ‌రి 26… స్వాతంత్ర్య దినోత్స‌వ‌మ‌ట‌… ఆ పోలీస్ అధికారి నాలెడ్జ్ అది..!

జ‌న‌వ‌రి 26. దేశ రాజ్యాంగం అమ‌లులోకి వ‌చ్చిన తేదీ. అందుకే ఆ రోజును మ‌నం గ‌ణ‌తంత్ర దినోత్స‌వంగా జ‌రుపుకుంటున్నాం. ఈ విష‌యం ఒక‌ట‌వ త‌ర‌గ‌తి పిల్ల‌వాడికి కూడా తెలుస్తుంది. కానీ పాపం… ఆ అధికారికే తెలియ‌లేదు. అవును, మీరు చ‌దువుతోంది క‌రెక్టే. ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర డీజీపీ సాంబ‌శివ రావు తెలుసు క‌దా. ఆయ‌న‌కు గ‌ణ‌తంత్ర దినోత్స‌వం, స్వాతంత్ర్య దినోత్స‌వం అంటే తెలియ‌దు. కావాలంటే దాన్ని రుజువు చేసే ఓ వీడియో ఉంది. దాన్ని మీరూ చూడ‌వ‌చ్చు.

చూశారు క‌దా..! ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌త్యేక హోదా కోరుతూ జ‌న‌వ‌రి 26వ తేదీన వైజాగ్ ఆర్‌కే బీచ్‌లో నిర్వ‌హించ త‌ల‌పెట్టిన ఆందోళ‌నకు అనుమ‌తి లేద‌ని డీజీపీ సాంబ‌శివ‌రావు చెబుతూనే ఆ ఆందోళ‌నలో సంఘ విద్రోహ శ‌క్తులు పాల్గొనే అవ‌కాశం ఉంద‌ని, అందుకే అనుమ‌తి ఇవ్వ‌డం లేద‌ని, జ‌న‌వ‌రి 26వ తేదీ స్వాతంత్ర్య దినోత్స‌వం కాబ‌ట్టి, ప‌క‌డ్బందీ ఏర్పాట్లు చేయాల్సిన బాధ్య‌త త‌మపై ఉంద‌ని, ఎలాంటి అసాంఘిక శ‌క్తులు చొర‌బ‌డ‌కుండా, అవాంఛ‌నీయ సంఘ‌ట‌న‌లు జ‌ర‌గ‌కుండా చూసేందుకే అనుమ‌తి నిరాక‌రించామ‌ని ఆయ‌న చెప్పుకొచ్చారు.

ap-dgp

కానీ… జ‌న‌వ‌రి 26వ తేదీ స్వాతంత్ర్య దినోత్స‌వం కాద‌ని, గ‌ణ‌తంత్ర దినోత్స‌వం (రిపబ్లిక్ డే) అని ఆయ‌న‌కు తెలియ‌దు కాబోలు. అందుకే అలా వ్యాఖ్యానించారు. ప్ర‌స్తుతం ఆ వీడియో యూట్యూబ్‌లో హ‌ల్‌చ‌ల్ చేస్తోంది. నిజంగా ఇలా జ‌న‌వ‌రి 26కు, ఆగ‌స్టు 15కు తేడా తెలియ‌ని వారు ఇంకా ఎంద‌రు ఉన్నారో క‌దా..! ముందు వీటి గురించి చెప్పే బాధ్య‌త‌ల‌ను ప్ర‌భుత్వాలే తీసుకోవాలి..!

Comments

comments

Share this post

scroll to top