ఆ జిల్లా క‌లెక్ట‌ర్ ప్ర‌తి శుక్ర‌వారం పిల్ల‌ల‌తో గ‌డుపుతారు. ఎందుకో తెలుసా..?

ఐఏఎస్‌. ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ స‌ర్వీస్‌. చాలా మంది ఐఏఎస్ కావాల‌ని క‌ల‌లు కంటారు. కానీ కేవ‌లం కొంద‌రు మాత్ర‌మే ఆ క‌ల‌ల‌ను సాకారం చేసుకుంటారు. అయితే నిజానికి ఓ ఐఏఎస్ అధికారి ఏం చేస్తారు..? ఆ పోస్టులో ఉన్న‌వారి విధులు ఏమై ఉంటాయి..? అనే సమాధానం మాత్రం చాలా మందికి తెలియ‌దు. వారికి ఇచ్చిన పోస్టింగ్‌, సంబంధిత శాఖ‌ను బ‌ట్టి వారి ప‌ని ఉంటుంది. ఈ క్ర‌మంలో ఎవ‌రైనా ఓ ఐఏఎస్ ఆఫీస‌ర్‌తో ద‌గ్గ‌ర‌గా ఉండి ఆ ఆఫీస‌ర్ ఏం చేస్తున్నారో తెలుసుకునేందుకు ఎవ‌రికైనా వీలుంటుందా..? అంటే.. ఉంటుంద‌నే చెప్ప‌వ‌చ్చు. అవును, మీరు విన్న‌ది క‌రెక్టే. అయితే అది అంద‌రు ఐఏఎస్ ఆఫీస‌ర్ల‌తో కాదు సుమా..! ఆ ఒక్క ఆఫీస‌ర్‌తోనే ఆ చాన్స్ ఉంది. అది కూడా శుక్ర‌వారమే. కేవ‌లం పిల్లలకే ఈ ఆఫ‌ర్ ఉంది. ఇంత‌కీ ఆ ఆఫీస‌ర్ ఎవ‌రు..? ఈ ఆఫ‌ర్‌ను పిల్ల‌ల‌కే ఆయ‌న ఎందుకు అందిస్తున్నారో తెలుసా..?

ఆయ‌న పేరు ఆర్మ్‌స్ట్రాంగ్ పేమ్‌. మ‌ణిపూర్‌లోని త‌మెంగ్‌లాంగ్ జిల్లా క‌లెక్ట‌ర్ ఆయ‌న‌. ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రిస్తూ వారికి ద‌గ్గ‌ర‌గా గ‌డ‌ప‌డంలో ఆయ‌న పేరు తెచ్చుకున్నారు. అయితే ఈయ‌నే ఈ మ‌ధ్య ఓ వింత ఆలోచ‌న చేశారు. ప్ర‌తి శుక్ర‌వారం 10 మంది పిల్ల‌ల‌ను త‌న‌తో ఉంచుకుంటాడు. ఉద‌యం నుంచి రాత్రి వ‌ర‌కు భోజ‌నం, ఇత‌ర స‌దుపాయాల‌ను వారికి ఆయ‌న క‌ల్పిస్తాడు. త‌న ఆఫీస్‌కు, ఇంకా ఆయ‌న‌ ఎక్క‌డికి వెళితే అక్క‌డికి ఆ పిల్ల‌ల‌ను తీసుకెళ్తాడు. రాత్రి భోజ‌నం అయ్యాక వారి వారి ఇండ్ల‌లో దిగ‌బెడ‌తారు. ఇలా ఆయన కొద్ది నెల‌ల నుంచి ప్ర‌తి శుక్ర‌వారం చేస్తున్నారు.

అయితే ఆర్మ్‌స్ట్రాంగ్ పేమ్ ఈ ప‌ని ఎందుకు చేస్తున్నారో తెలుసా..? పిల్ల‌ల‌కు ఓ ఐఏఎస్ అధికారి ఏం చేస్తాడో ప్ర‌త్య‌క్షంగా చూపించ‌డానికి. నిత్యం ఆయ‌న ఎక్క‌డికెళ్తారు, ఏం చేస్తారు, స‌మ‌స్య‌ల‌ను ఎలా ప‌రిష్క‌రిస్తారు వంటి విష‌యాలు పిల్ల‌ల‌కు తెలియ‌ప‌రుస్తారు. అంతేకాదు, చివ‌ర్లో వారిని పంపే ముందు అంద‌రినీ పేరు పేరునా ప‌ల‌క‌రించి జిల్లా బాగు కోసం ఏం చేస్తే బాగుంటుందో చెప్పాల‌ని వారిని అడుగుతాడు. అవునూ… పిల్ల‌ల‌కు ఐఏఎస్ ఆఫీస‌ర్ ఏం చేస్తాడో చూపించ‌డం, చెప్ప‌డం ఓకే. కానీ జిల్లా బాగు కోసం వారిని అభిప్రాయం అగ‌డం ఏంటి..? వారికేం తెలుస్తుంది..? అని చాలా మందికి సందేహాలు వ‌చ్చాయి. అయితే వాటికి ఒకే స‌మాధానం చెప్పారు. పిల్లలు భావి భార‌త పౌరుల‌ని, వారి మెద‌డులో ఎన్నో ఆలోచ‌న‌లు ఉంటాయ‌ని, అందులో స‌మాజానికి ప‌నికొచ్చేవి కూడా ఉంటాయ‌ని, అందుకే వారిని ఆ ప్ర‌శ్న అడుగుతాన‌ని ఆయ‌న చెప్పారు. నిజంగా ఆర్మ్‌స్ట్రాంగ్ పేమ్ చేస్తున్న ప‌నికి ఆయ‌న్ను మ‌నం అభినందించాల్సిందే..!

Comments

comments

Share this post

scroll to top