ఆ చర్చిలో 70వేల మ‌నుషుల ఎముక‌లు ఉంటాయి. ఎందుకో తెలుసా..?

మ‌నిషి పుట్టిన‌ప్పుడు 270 ఎముక‌లు ఉంటాయని తెలిసిందే. అయితే పెరిగేకొద్దీ అవి కాస్తా 206 అవుతాయి. మ‌రి అలా అయితే 70వేల మంది మ‌నుషుల శ‌రీరాల్లో ఎన్ని ఎముక‌లు ఉంటాయి.? ఏముందీ.. 206 x 70,000 = 1,44,20,000 అవును. స‌రిగ్గా ఇన్నే ఎముక‌లు అవుతాయి. అయితే అన్ని ఎముక‌ల‌ను మీరు అక్క‌డ చూడ‌వ‌చ్చు. అవును, మీరు విన్న‌ది క‌రెక్టే. 1 కోటి 44 ల‌క్ష‌ల 20వేల ఎముక‌ల‌ను మీరు ఆ ప్రాంతంలో చూడ‌వ‌చ్చు. ఇంత‌కీ అదేమైనా శ్మ‌శాన‌మా, మ్యూజియ‌మా.. అంటే కాదు, అదొక చ‌ర్చి.

చెక్ రిప‌బ్లిక్‌లో ఉన్న సెడ్‌లెక్ ఆషువ‌రీ అనే చ‌ర్చి అది. అందులో 70వేల మంది మ‌నుషుల‌కు చెందిన ఎముక‌లు ఉంటాయి. అయితే అవ‌న్నీ గుట్ట‌లుగా పేర్చ‌బ‌డి ఉండ‌వు. చక్క‌ని అలంకారంలో అమ‌ర్చ‌బ‌డి ఉంటాయి. ఆ చ‌ర్చికి వెళితే ఆ చ‌ర్చి అందాల‌ను ఎముక‌ల్లో వీక్షించ‌వ‌చ్చు. 1318వ సంవ‌త్స‌రంలో 70వేల మంది వ‌ర‌కు ప్లేగ్ వ్యాధితో చ‌నిపోయారు. దీంతో వారి ఎముక‌ల‌ను ఇలా పేర్చారు. ఈ చ‌ర్చినే స్క‌ల్ చ‌ర్చి అని పిలుస్తారు. పేరుకు త‌గిన‌ట్టుగానే ఈ చర్చిలో అన్నీ పుర్రెలు, ఎముక‌లే ఉంటాయి.

ఇక చ‌ర్చి మ‌ధ్య భాగంలో అనేక ఎముక‌లను క‌లిపి ఆకారం వ‌చ్చేలా త‌యారు చేశారు. అందుకు గాను చేతులు, పుర్రె ఎముక‌ల‌ను వాడారు. ఈ ఆకారం ఎలా ఉంటుందంటే బైబిల్‌లో వ‌ర్ణించిన‌ట్టుగా ఏడు త‌ల‌ల రాక్ష‌సుడిలా ఉంటుంది. 1870 వ‌ర‌కు ఈ చ‌ర్చిలో కొన్ని ప్రాంతాల్లో పుర్రెల‌ను గుట్ట‌లుగా పోసి పెట్టారు. అయితే ఆ సంవ‌త్స‌రంలో ఓ క‌ళాకారుడు వాటిని అంద‌మైన అలంకారాలుగా పేర్చాడు. అయితే నిజానికి చ‌ర్చే అయినా అక్క‌డికి వెళ్లాలంటే చాలా ధైర్యం ఉండాలి. మ‌రి అన్ని పుర్రెలు, ఎముక‌ల‌ను చూడ‌డ‌మంటే మాట‌లు కాదు క‌దా. ఇక ఈ నిర్మాణం ప్యారిస్ కాటాకోంబ్స్ తరువాత అతి పెద్ద సంఖ్య‌లో మాన‌వ ఎముక‌లు క‌లిగిన నిర్మాణంగా పేరుగాంచింది. వీలుంటే చూసి రండి మ‌రి..!

Comments

comments

Share this post

scroll to top