ఆ రెస్టారెంట్‌లో అంద‌మైన ముద్దు గుమ్మ‌లు బికీనీల‌తో వ‌డ్డిస్తారు..!

హోట‌ల్స్‌, రెస్టారెంట్స్ అన్నాక ఒక దానికి, మ‌రొక‌దానికి ఆ మాత్రం పోటీ ఉంటుంది లెండి. అలా పోటీ ప‌డితేనే క‌దా, లాభాలు సంపాదించ‌డంలో, వ్యాపారంలో ముందుకు దూసుకువెళ్లేది. అయితే అందుకోసం రెస్టారెంట్ నిర్వాహ‌కులైనా ర‌క ర‌కాల ఆక‌ట్టుకునే వంట‌కాలు పెడ‌తారు, అదీ స‌రిపోక‌పోతే క‌స్ట‌మ‌ర్ల‌ను ఆక‌ట్టుకునేందుకు ఆఫ‌ర్లు పెడ‌తారు. కానీ… చైనాలోని ఆ రెస్టారెంట్ నిర్వాహ‌కులు ఏం చేశారో తెలుసా..?  హాట్ హాట్ ముద్దు గుమ్మ‌ల‌చే క‌స్ట‌మ‌ర్ల‌కు ఆయా వంట‌కాల‌ను వడ్డించ‌డం మొద‌లు పెట్టారు. అంతేనా..? అంటారా..! కాదండీ… ఇంకా ఉంది..!

bikini-serving-2

bikini-serving-1
అది చైనాలోని షెన్‌యాంగ్ ప‌ట్ట‌ణంలో ఉన్న దావోషియాంజీ రెస్టారెంట్‌. అప్ప‌టికే ఆ రెస్టారెంట్ అక్క‌డ ప‌లు విశిష్ట వంట‌కాల‌కు ఫేమ‌స్. ప్ర‌త్యేక‌మైన ఫుడ్ దొరుకుతుంద‌ని చాలా మంది భోజ‌న ప్రియులు ఆ రెస్టారెంట్ కు వెళ్తారు. అయితే… ఇటీవ‌లే ఆ రెస్టారెంట్ నిర్వాహ‌కులు ఓ విచిత్ర‌మైన ఆలోచ‌న చేశారు. పెద్ద‌గా లాభం రావ‌డం లేద‌నో లేదంటే బిజినెస్ న‌డ‌వ‌డం లేద‌నో తెలియ‌దు కానీ… వారు ఓ నూత‌న ఐడియా ఆలోచించి దాన్ని ఫాలో అవ‌డం మొద‌లు పెట్టారు. వెంట‌నే త‌మ రెస్టారెంట్‌లో హాట్ హాట్ ముద్దు గుమ్మ‌ల‌తో క‌స్ట‌మ‌ర్ల‌కు వంట‌కాల‌ను వడ్డించ‌డం మొద‌లు పెట్టారు. అంతేనా..? అంటే కాదు… వారు బికినీల‌తో స‌ర్వ్ చేస్తారు మ‌రి..! బికినీలు వేసుకుని వ‌చ్చి క‌స్ట‌మ‌ర్ల వ‌ద్ద ఆర్డ‌ర్ తీసుకుని వారికి కావ‌ల్సిన వంట‌కాలను తీరిగ్గా వ‌డ్డిస్తారు.

bikini-serving-3

bikini-serving-4
అయితే ఆ రెస్టారెంట్‌కు వెళ్లిన క‌స్ట‌మ‌ర్ల‌కు కూడా ఓ ఆప్ష‌న్ ఉందండోయ్‌. అదేమిటంటే… క‌స్ట‌మ‌ర్లు ఎవ‌రైనా త‌మ‌కు ఎలాంటి ముద్దు గుమ్మ కావాలో ముందుగానే సెలెక్ట్ చేసుకుంటే ఆమే వారికి వంట‌ల‌ను వ‌డ్డిస్తుంది. వింత‌గా ఉంది క‌దూ..! అయితే అక్క‌డ మగ వెయిట‌ర్లు కూడా స‌ర్వీస్ చేస్తున్నారు తెలుసా..?  కానీ వారు బికినీతో రారు లెండి, కేవ‌లం పైన టాప్ తీసేసి టాప్‌లెస్‌గా కండ‌లు ప్ర‌ద‌ర్శిస్తూ వ‌డ్డిస్తారు. ఈ క్ర‌మంలో ఆడ‌, మ‌గ వెయిట‌ర్లు అంద‌రూ డ్యూటీలోకి వ‌చ్చేముందు త‌మ త‌మ బాడీల‌పై ఎక్క‌డో ఒక చోట ఆ రెస్టారెంట్ పేరును పెయింట్‌లా వేసుకుని తీరాలి. అయితే… అలా ఆ రెస్టారెంట్ వారు ఫాలో అవుతున్న ఈ బికినీ స‌ర్వింగ్ ఐడియా వ‌ల్ల వారి గిరాకీ కూడా బాగానే పెరిగింద‌ట‌. గతంలో క‌న్నా ఇప్పుడు లాభాలు బాగా వ‌స్తున్నాయ‌ని, తమ రెస్టారెంట్ కు ఇంకా మంచి పేరు వ‌చ్చింద‌ని నిర్వాహ‌కులు అంటున్నారు. అవును మ‌రి… అంత‌టి హాట్ హాట్ భామ‌లు ఉంటే… ఇక పేరు రాకుండా ఉంటుందా..! ఏది ఏమైనా ఆ రెస్టారెంట్ నిర్వాహ‌కుల ఐడియా భ‌లేగా ఉంది క‌దా..!

Comments

comments

Share this post

scroll to top