మ‌నిషి రూపంలో ఉండే భార్య వ‌ద్ద‌ని… ఆడ రోబోను భార్య‌గా చేసుకున్నాడు అత‌ను..! ఎందుకో తెలుసా..?

అవునా, నిజ‌మా..? పెళ్ల‌యితే మ‌గాళ్ల‌కు ఉండే స్వాతంత్ర్యం పోతుందా..? అంటే దీనికి కొంద‌రు అవున‌ని, కొంద‌రు కాద‌ని స‌మాధానం చెబుతారు. ఎందుకంటే వారు అనుభ‌వించే ప‌రిస్థితులు అలాంటివి. అయినా… వివాహం అయితే ఆడ‌వారికి కూడా కొంత స్వాతంత్ర్యం పోతుంది క‌దా. భ‌ర్తతో కొన్ని విష‌యాల్లో క‌చ్చితంగా ఏకీభ‌వించాల్సి వ‌స్తుంది. అది అవ‌సరం ఉన్నా, లేక‌పోయినా..! స‌రిగ్గా ఇలాగే ఆలోచించాడో, లేదంటే పెళ్ల‌య్యాక భార్య‌తో గొడ‌వ ప‌డాల్సి వ‌స్తుంద‌నుకున్నాడో, లేదంటే మ‌రో విష‌య‌మో ఏమో గానీ… చైనాకు చెందిన ఆ వ్య‌క్తి మాత్రం ఏకంగా లేడీ రోబోనే పెళ్లి చేసుకున్నాడు. ఇంత‌కీ ఆ రోబోను ఎవ‌రు త‌యారు చేశారో తెలుసా..? సొంతంగా అత‌నే ఆడ రోబోను త‌యారు చేసుకుని దాన్ని పెళ్లి చేసుకున్నాడు. అదీ త‌మ విశ్వాసాల‌కు అనుగుణంగా, సాంప్ర‌దాయ బ‌ద్దంగా కార్యం ముగించాడు.

అత‌ని పేరు జెంగ్ జియాజియా. వ‌యస్సు 31 సంవ‌త్స‌రాలు. ఉంటోంది చైనాలో. ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్‌, రోబోటిక్స్, సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ గా ప‌నిచేస్తున్నాడు. అయితే అత‌నికి ఇంకా పెళ్లి కాలేదు. దీంతో అత‌న్ని ఇంట్లో కుటుంబ స‌భ్యులు పోరు పెట్టే వారు. పెళ్లి చేసుకోమ‌ని చెప్పేవారు. కానీ పెళ్లి అంటే జెంగ్‌కు ఇష్టం ఉండేది కాదు. అందుకు కార‌ణాలు తెలియ‌వు. అయితే ఓ ద‌శలో ఇంట్లో పోరు ఎక్కువ కావ‌డంతో జెంగ్‌కు పెళ్లి చేసుకోవ‌డం త‌ప్పింది కాదు. కాగా జెంగ్ అప్పుడే ఓ ఉపాయం ఆలోచించాడు. వెంట‌నే దాన్ని అమ‌లులో పెట్టేశాడు.

స్వ‌త‌హాగా రోబోల‌ను త‌యారు చేసే ఇంజినీర్ కావ‌డంతో ఏకంగా ఓ ఆడ రోబోనే అత‌ను క్రియేట్ చేశాడు. దానికి యింగ్‌యింగ్‌గా నామ‌క‌ర‌ణం చేశాడు. ఇంకేముందీ, తాను మ‌నిషి రూపంలో ఉన్న లేడీని పెళ్లి చేసుకోనని, ఆ ఆడ రోబోనే పెళ్లి చేసుకుంటాన‌ని చెప్పాడు. దీనికి కుటుంబ స‌భ్యులు కూడా స‌రే అన్నారు. ఇంకేముంది. వెంట‌నే త‌మ సాంప్ర‌దాయాల‌కు అనుగుణంగా ఆ ఆడ రోబోను జెంగ్ పెళ్లి చేసుకున్నాడు. ఇటీవ‌లే అత‌ని వివాహం అయింది. దీంతో ఒక్క‌సారిగా అత‌ని గురించిన వార్త చైనాలో వైర‌ల్ అయింది. అయితే అత‌ను క్రియేట్ చేసిన రోబో ఏకంగా కొన్ని చైనా భాష మాట‌లు మాట్లాడ‌గ‌ల‌ద‌ట‌. జెంగ్ వాయిస్‌ను గుర్తు ప‌ట్టి భార్య‌కు మ‌ళ్లే అత‌నికి సేవ‌లు కూడా చేసి పెట్ట‌గ‌ల‌ద‌ట‌. కానీ ఆ రోబోను ఇంకా డెవ‌ల‌ప్ చేసి మ‌రింత స‌మ‌ర్థ‌వంతంగా ప‌నిచేసేలా త‌యారు చేస్తాన‌ని అంటున్నాడు జెంగ్‌. చూద్దాం. అత‌ను ఏం చేస్తాడో..! కొంప‌దీసి రోబో సినిమాలోలాగా కాపురం చేయ‌గ‌లిగేలా ఆ ఆడ‌రోబోను తీర్చిదిద్ద‌డు క‌దా..! అయినా అలా త‌యారు చేసినా ఆశ్చ‌ర్య‌పోవాల్సిందేమీ లేదు క‌దా..!

Comments

comments

Share this post

scroll to top