ఆ చిన్నారి ఏజ్ 2 ఏళ్లు… ఆర్చ‌రీలో ఎవరూ సాధించ‌ని రికార్డ్ నెల‌కొల్పింది..!

మ‌హాభారతంలో ఉండే అభిమ‌న్యుడి గురించి మీకు తెలుసు క‌దా..! త‌ల్లి క‌డుపులో ఉండ‌గానే అత‌ను ప‌ద్మ‌వ్యూహం ఛేదించ‌డం ఎలాగో తెలుసుకున్నాడు. అయితే… ఇప్పుడు మేం చెప్ప‌బోయే ఓ చిన్నారి కూడా స‌రిగ్గా ఇదే కోవ‌కు చెందుతుంది. ఎందుకంటే… ఆ చిన్నారి చేస్తున్న అద్భుత ప్ర‌దర్శ‌న అలాంటి మ‌రి. అదీ విలువిద్య (ఆర్చ‌రీ)లో..! అవును, మీరు విన్న‌ది నిజ‌మే. వ‌య‌స్సు కేవ‌లం 2 సంవ‌త్స‌రాలు. అయినా ఆర్చ‌రీలో ఆ చిన్నారి ప్ర‌ద‌ర్శిస్తున్న ప్ర‌తిభ అమోఘం..!

Shivani-Cherukuri-1

ఆ చిన్నారి పేరు శివాని చెరుకూరి. వ‌యస్సు 2 ఏళ్లు. మ‌రికొద్ది రోజులు అయితే 3 సంవ‌త్స‌రాలు నిండుతాయి. అయితే ఆ చిన్నారిని ఆమె త‌ల్లిదండ్రులు ముద్దుగా డాలీ అని పిలుచుకుంటారు. వీరిది విజ‌య‌వాడ‌. కాగా శివానికి ఓ అక్క‌, ఓ అన్న ఉండేవారు. వారిద్ద‌రూ ఆర్చ‌రీ చాంపియ‌న్లు. అన్న ఆర్చ‌రీ కోచ్. ఈ క్ర‌మంలో వారు అనుకోకుండా జ‌రిగిన వేర్వురు ప్ర‌మాదాల్లో మృతి చెందారు. దీంతో శివానిని ఆమె త‌ల్లిదండ్రులు స‌రోగ‌సీ ద్వారా క‌న్నారు. అయితే ఆమె అక్క‌, అన్న‌ల్లాగే శివానిని ఆర్చ‌రీలో చాంపియ‌న్ చేయాల‌నేది వారి ప్లాన్‌.

అందులో భాగంగానే శివానికి చిన్న‌ప్ప‌టి నుంచి ఆర్చరీ ట్రెయినింగ్ ఇవ్వ‌సాగారు. ఈ క్ర‌మంలో శివాని కూడా ఆ విద్య‌లో ఎంతో ప్ర‌తిభ‌ను క‌న‌బ‌రుస్తూ వ‌చ్చింది. అయితే తాజాగా విజ‌య‌వాడ‌లోని వోల్గా ఆర్చ‌రీ అకాడ‌మీలో జ‌రిగిన ఓ టోర్న‌మెంట్‌లో రెండేళ్ల శివాని ఓ స‌రికొత్త రికార్డును సృష్టించింది. 5, 7 మీట‌ర్ల దూరంలో 200 పాయింట్లు సాధించిన అత్యంత త‌క్కువ వ‌య‌స్సు గల భారతీయ చిన్నారిగా శివానీ రికార్డు నెల‌కొల్పింది. దీంతో ఆ రికార్డు ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లోకి కూడా ఎక్కింది. దీన్ని ఆ సంస్థ ప్ర‌తినిధులు వెల్ల‌డించారు కూడా. ఇప్పుడు చెప్పండి..! నిజంగా శివాని మ‌రో అభిమ‌న్యుడిలా క‌నిపించడం లేదూ..! దీన్ని బ‌ట్టి మ‌న‌కు ఓ విష‌యం స్ప‌ష్టంగా తెలుస్తోంది… అదేనండీ… ఆర్చ‌రీలో మ‌న భ‌విష్య‌త్ ఒలంపిక్‌ ఆశా కిర‌ణం… శివాని అని..! ఆ రోజు వ‌చ్చే వ‌ర‌కు వేచి చూద్దాం..!

Comments

comments

Share this post

scroll to top