7 ఏళ్ళ ఈ చిన్నారి పార్క్ క‌బ్జా కాకుండా కోర్టు లో కేసు వేసి గెలిచింది.!

పెద్ద పెద్ద న‌గ‌రాలు, ప‌ట్ట‌ణాల్లో పార్కులు మ‌న‌కు ఏ విధంగా ఉల్లాసాన్ని, ఉత్సాహాన్ని ఇస్తాయో అంద‌రికీ తెలిసిందే. వాటి వ‌ల్ల స్వ‌చ్ఛ‌మైన గాలి మ‌న‌కు ల‌భిస్తుంది. వ్యాయామం చేసుకోవ‌చ్చు. పిల్ల‌లు పార్కుల్లో ఆడుకోవ‌చ్చు. అల‌సిపోయిన వారు ప‌చ్చ‌ని వాతావ‌ర‌ణంలో కొంత సేపు సేద దీర వ‌చ్చు. అయితే అలాంటి పార్కులు నేడు క‌నుమ‌రుగ‌వుతున్నాయి. ఏ నగ‌రంలో తీసుకున్నా క‌బ్జాదారులు పార్కుల‌ను విడిచిపెట్ట‌డం లేదు. వారికి ప్ర‌భుత్వ అధికారులు కూడా అండ‌గా ఉంటుండ‌డంతో అవి న‌గ‌ర‌వాసుల‌కు మిగ‌ల‌డం లేదు. ఢిల్లీలో ఓ పార్కుకు కూడా ఇదే స్థితి ప‌ట్ట‌నుండ‌డంతో అక్క‌డే ఉండే ఓ ఏడేళ్ల చిన్నారి కోర్టులో కేసు వేసింది. దీంతో అధికారులు ఆ పార్కును కూల్చే పనికి బ్రేక్ ప‌డింది.

అది ఢిల్లీలోని రోహిణి అనే ప్రాంతంలో ఉన్న సెక్టార్ 8. అక్క‌డే ఓ ఇంట్లో నివాసం ఉంటోంది న‌వ్యాసింగ్ అనే 7 ఏళ్ల చిన్నారి. అయితే వారి కాల‌నీలో 30 సంవ‌త్స‌రాలుగా ఓ చిల్డ్ర‌న్స్ పార్కు ఉంటోంది. అందులో స్థానికులు రోజూ వ్యాయామం చేస్తారు. పిల్లలు ఆట‌లాడుకుంటారు. న‌వ్యాసింగ్ కూడా అక్క‌డికి వెళ్తుంది. ఈ క్ర‌మంలో ఢిల్లీ డెవ‌ల‌ప్‌మెంట్ అథారిటీ (డీడీఏ) ఆ పార్కును తీసేసి అక్క‌డ కమ్యూనిటీ సెంట‌ర్‌, క‌మ‌ర్షియ‌ల్ కాంప్లెక్స్‌లు క‌ట్టేందుకు సిద్ధ‌మైంది. ఇదే విష‌యం ఆ పార్కు స‌మీపంలో ఉండే కాల‌నీ వాసుల‌కు తెలిసింది. తండ్రి ధీర‌జ్ కుమార్ ద్వారా న‌వ్యాసింగ్ కు కూడా ఆ విష‌యం తెలిసింది. దీంతో ఆ చిన్నారి పార్కును కాపాడుకోవాల‌ని అడిగింది. ఈ క్ర‌మంలోనే ధీర‌జ్ కూతురి కోరిక మేర‌కు ఢిల్లీ హై కోర్టులో పిటిష‌న్ వేశాడు.

కాగా పిటిష‌న్‌ను విచారించిన కోర్టు డీడీఏకు ఆదేశాలు జారీ చేసింది. పార్కును తీసేయాల‌న్న ఆలోచ‌నన విర‌మించుకోవాల‌ని చెప్పింది. పార్కు ప్ర‌దేశాన్ని కూల్చివేసే చ‌ర్య‌పై కోర్టు స్టే ఆర్డ‌ర్ ఇచ్చింది. దీంతో డీడీఏ అధికారులు పార్కును తీసేయాల‌న్న ఆలోచ‌న‌ను విడిచిపెట్టారు. అయితే కోర్టు డీడీఏకు మ‌రిన్ని ఆదేశాలు కూడా ఇచ్చింది. అన్నేళ్లుగా ఉంటున్న పార్కు డెవ‌ల‌ప్‌మెంట్ కోసం రూ.కోట్లు ఖర్చు పెట్టారు, మ‌ళ్లీ అదే పార్కును తీసేయాల‌నుకుంటున్నారు, అలాంట‌ప్పుడు ఎంత ప్ర‌జాధ‌నం వృథా అయిన‌ట్టు అవుతుందో గ‌మ‌నించారా..?, అలాగే పార్కును తీసేసి అందులో ఏం పెడ‌తారు.? జ‌నాలు ఎంత‌మంది వ‌స్తారు..? క‌మ‌ర్షియ‌ల్ కాంప్లెక్స్ లు క‌డ‌తారా..? క‌డితే పార్కింగ్ ఎలా ఇస్తారు.? వెహికిల్స్ ఎన్ని పార్క్ చేయ‌వ‌చ్చు ? వ‌ంటి ప్ర‌శ్న‌ల‌కు జ‌వాబుల‌తో కూడిన లేఖ‌ను సెప్టెంబ‌ర్ 18 లోపు కోర్టు లో అంద‌జేయాల‌ని ఆర్డ‌ర్ ఇచ్చింది. దీంతో పార్కు పోకుండా అడ్డుకున్నందుకు గాను ఆ చిన్నారికి ఇప్పుడంద‌రూ అభినంద‌న‌లు తెలుపుతున్నారు. అవును మ‌రి, స‌మాజం కోసం మంచి చేయాల‌నే త‌లంపు మ‌దిలో ఉంటే చాలు, ఎంత పెద్ద కార్య‌మైనా నెర‌వేరుతుంది, ఎవ‌రైనా స‌రే ఏదైనా సాధించ‌వ‌చ్చు..!

Comments

comments

Share this post

scroll to top