విదేశీ జంట భారత్‌లో తయారు చేసే మసాలా చాయ్‌కు ఫిదా అయ్యారు. తరువాత వారు ఏం చేశారో తెలుసా..?

అల్లం, మిరియాలు, శొంఠి, లవంగాలు… బాగా దంచి పేస్ట్‌లా చేసి దాన్ని డికాషన్‌లో వేసి టీ తయారుచేసుకుని తాగితే… అహా.. నా రాజా.. ఏం మజా వస్తుందో దాన్ని మాటల్లో చెప్పలేం. అయితే ముందు చెప్పిన వాటిని కొందరు చేంజ్‌ చేస్తారు. కొందరు దాల్చిన చెక్కను వాటికి కలుపుతారు. ఇంకా కొందరు కొన్ని రకాల మసాలాలను వేసి టీ పెట్టుకుని తాగుతారు. అయితే ఏ మసాలా వేసినా మసాలా చాయ్‌ అద్భుతంగానే ఉంటుంది. ఇదంతా సరే.. ఇప్పుడు మసాలా చాయ్‌ గురించి ఎందుకు చెబుతున్నారు..? అనేగా మీ డౌట్‌. ఏమీ లేదండీ… మన దగ్గరంటే మసాలా చాయ్‌ ఎక్కడ పడితే అక్కడ దొరుకుతుంది. వీలుంటే ఇంట్లో కూడా చేసుకోవచ్చు. కానీ మన మసాలా చాయ్‌ ఫారినర్లకు దొరకదు కదా. అలాగే ఓ విదేశీ జంట మొదటి సారిగా మసాలా చాయ్‌ను టేస్ట్‌ చేసింది. అంతే.. వారు మసాలా చాయ్‌ టేస్ట్‌ కు ఫిదా అయిపోయారు. తరువాత వారు ఏం చేశారంటే…

కెనడాకు చెందిన ఈమన్‌, రెబెక్కా దంపతులు ఓసారి ఆస్ట్రేలియా వెళ్లారు. అక్కడ వారు జార్జ్‌ మనౌసాకిస్‌ అనే వ్యక్తి తయారు చేసిన భారత్‌కు చెందిన మసాలా చాయ్‌ను తాగారు. దీంతో మసాలా చాయ్‌ టేస్ట్‌ వారికి అద్భుతంగా అనిపించింది. అంతే.. వారు ఆ చాయ్‌ తాగాక అది తయారు చేసే భారత్‌ కు వచ్చారు. వారు ఇక్కడ అనేక ప్రాంతాల్లో పర్యటించారు. రక రకాల మసాలా చాయ్‌ల గురించి, వాటిల్లో కలిపే మసాలాల గురించి తెలుసుకున్నారు. ఇంకే ముందీ సొంత ప్రదేశమైన టొరంటో వెళ్లి అక్కడే మసాలా చాయ్‌ దుకాణం పెట్టేశారు.

అలా ఈమన్‌, రెబెక్కా దంపతులు తమ సొంత పట్టణంలోనే చాయ్ వాలా చాయ్‌ పేరిట టీ షాప్‌ను తెరిచారు. అందులో రక రకాల మసాలా చాయ్‌లను పెట్టి అమ్మేవారు. దీంతో అనతి కాలంలోనే వారి టీ దుకాణం పాపులర్‌ అవగా వారు ప్రస్తుతం ఆన్‌లైన్‌లో కూడా మసాలా చాయ్‌ను విక్రయిస్తున్నారు. అయితే అలా వారు చాయ్‌ షాప్‌ పెట్టడం ఏమో గానీ ఇప్పుడక్కడ మసాలా చాయ్‌ అంటే చాలా మందికి తెలుస్తోంది. అవును మరి, మన మసాలా చాయ్‌లో ఉన్న మహత్మ్యమే అది కదా..!

Comments

comments

Share this post

scroll to top