పాక్ లో క్రికెట్ చూస్తూ…ఈ పిల్లాడు ఇండియా గెలవాలని ఈలలు వేస్తాడట.!ఎందుకో తెలుసా?

క‌క్ష‌లు, కార్ప‌ణ్యాలు, కుట్ర‌లు, కుతంత్రాలు, మోసాలు, ఈర్ష్య‌, అసూయ‌, ద్వేషాలు… ఇవ‌న్నీ పెద్ద‌ల్లోనే ఉంటాయి. చిన్నారుల్లో ఉండ‌వు. క‌ల్లా కప‌టం లేని మ‌న‌స్సులు వారివి. అమాయ‌క‌త్వం క‌ల‌బోసిన మోములు వారివి. అందుకేనేమే వారిని దైవంతో స‌మాన‌మ‌ని కూడా అంటారు. అవును నిజ‌మే మ‌రి. ఎందుకంటే ఇరుగు పొరుగున ఉండే పెద్ద‌ల మ‌ధ్య పొర‌ప‌చ్చాలు ఉంటాయేమో గానీ, పిల్లల మ‌ధ్య ఉండ‌వు. వారు క‌లిసే ఉంటారు. క‌లిసే ఆడుకుంటారు. క‌లిసే తిరుగుతారు. ఆ పిల్ల‌లు ఏ ప్రాంతం వారైనా స‌రే అలాగే ఉంటారు. అది వేరే రాష్ట్రం, వేరే దేశం ఏదైనా కావ‌చ్చు. అందుకు ఉదాహ‌ర‌ణే ఈ బాలుడు.

boy-from-pak
చిత్రంలో చూశారుగా. ఆ బాలుడిది పాకిస్థాన్‌. అయినా చాలా ఏళ్ల కింద‌ట అత‌ని త‌ల్లిదండ్రులు ఇండియాకు వ‌చ్చి పూణెలో సెటిల్ అయ్యారు. అయితే మ‌న ద‌గ్గ‌ర హైద‌రాబాద్ ఉన్న‌ట్టే పాకిస్థాన్‌లోనూ హైద‌రాబాద్ పేరిట ఓ సిటీ ఉంది. మీకు తెలుసో లేదో..! అదే సిటీలో ఆ బాలుడి కుటుంబీకులు కూడా ఉంటారు. అయితే అత‌ని త‌ల్లిదండ్రులు ఇండియాకు వ‌చ్చిన‌ప్ప‌టి నుంచి ప్ర‌తి ఏడాది వేస‌విలో వారంతా క‌లిసి పాకిస్థాన్‌లో ఉన్న హైద‌రాబాద్‌కు వెళ్తారు. అక్క‌డ ఆ బాలుడి త‌ల్లి త‌ర‌ఫు బంధువులు ఉంటారు. వారి పిల్ల‌లంతా ఆ బాలుడికి సోద‌రులు, సోద‌రీమ‌ణులు అవుతారు.

అలా వారంద‌రూ వేస‌వికి అక్క‌డికి వెళ్లి స‌ర‌దాగా ఎంజాయ్ చేస్తారు కూడా. అలా వెళ్లిన‌ప్పుడు కొన్ని సంద‌ర్భాల్లో ఇండియా, పాకిస్తాన్ జ‌ట్ల మ‌ధ్య అనుకోకుండా క్రికెట్ మ్యాచ్‌లు అవుతుంటాయి. వాటిని వారు ఎంజాయ్ చేస్తారు. ఎలా అంటే ఆ బాలుడి తల్లి త‌ర‌ఫు వారు ఒక జ‌ట్టు వైపు, మిగిలిన వారు ఓ జ‌ట్టు వైపు ఉంటారు. టీవీ చూసేట‌ప్పుడు కూడా జ‌ట్లు జ‌ట్లుగా కూర్చుంటారు. చెరొక టీంను పంచుకుని వారికి మ‌ద్ద‌తుగా ఈల‌లు వేయ‌డం, వికెట్ తీసిన‌ప్పుడు, సిక్స్‌, ఫోర్ కొట్టిన‌ప్పుడు అర‌వ‌డం వంటి ప‌నులు చేస్తారు. అలా వారంద‌రూ త‌మ ప్రాంతాల‌ను మ‌రిచి స‌ర‌దాగా ఉంటారు. ఇదే విష‌యాన్ని ఆ బాలుడు సోష‌ల్ మీడియా ద్వారా ఇప్పుడు అంద‌రితోనూ షేర్ చేసుకున్నాడు. దీంతో ఆ బాలుడి టాపిక్ ఫేస్‌బుక్‌లో ట్రెండింగ్‌గా మారింది. అందుకే క‌దా, పైన ముందే చెప్పింది. పిల్ల‌ల మ‌న‌స్సుల్లో ఏ క‌ల్మ‌షం ఉండ‌ద‌ని, అదంతా పెద్ద‌ల్లోనే ఉంటుంద‌ని..! పెద్ద‌లు కూడా పిల్ల‌లుగా మారితే, వారి మ‌న‌స్త‌త్వం అలా మారితే బాగుంటుంది క‌దా..!

Comments

comments

Share this post

scroll to top