ల్యాండ్‌మైన్ల‌ను గుర్తించే డ్రోన్లను క‌నిపెట్టిన బాలుడు ఇత‌ను..!

ఆ బాలుడి వ‌య‌స్సు 14 సంవ‌త్స‌రాలు. చ‌దువుతోంది 10వ త‌ర‌గ‌తి. సాధార‌ణంగా ఈ త‌ర‌గ‌తిలో ఉండే ఏ విద్యార్థి అయినా రాబోయే బోర్డ్ ఎగ్జామ్స్ కోసం చ‌దువుతూ ఉంటాడు. ప‌రీక్ష పాస్ అయ్యాక ఏ కోర్సు తీసుకోవాలా అని ఇప్ప‌టి నుంచే ఆలోచిస్తుంటారు. అయితే ఆ బాలుడు మాత్రం అలా కాదు. ఓ వైపు విద్యాభ్యాసం కొన‌సాగిస్తూనే మ‌రోవైపు సొంత కంపెనీతో డ్రోన్లను త‌యారు చేస్తూ అద‌ర‌గొడుతున్నాడు. అవును, మీరు విన్న‌ది నిజ‌మే. అయితే ఆ డ్రోన్లు అలాంటి, ఇలాంటి డ్రోన్లు కావు. మ‌న దేశ సైనికుల‌కు ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డే ఆర్మీ డ్రోన్లు అవి. ఎక్క‌డ బాంబులు ఉన్నాయో, శ‌త్రువులు ఏయే ప్ర‌దేశాల్లో ఉన్నారో తెలియ‌జెప్పే అధునాత‌న డ్రోన్స్‌ను అత‌ను త‌యారు చేశాడు. దీంతో దేశ వ్యాప్తంగా ఇప్పుడు ఆ బాలుడి పేరు మారుమోగిపోతోంది. ఇంత‌కీ ఆ బాలుడు ఎవ‌రో తెలుసా..?

harshavardhan-zala-2

అత‌ని పేరు హ‌ర్ష‌వ‌ర్ధ‌న్ జాలా. గుజ‌రాత్‌లోని బాపు న‌గ‌ర్‌లో త‌ల్లిదండ్రులతో క‌లిసి నివ‌సిస్తున్నాడు. అత‌ని తండ్రి చార్ట‌ర్డ్ అకౌంటెంట్‌. త‌ల్లి గృహిణి. హ‌ర్ష‌వ‌ర్ద‌న్ స్థానికంగా ఉండే స‌ర్వోద‌య్ విద్యామందిర్‌లో 10వ త‌ర‌గ‌తి చ‌దువుతున్నాడు. అయితే ఒక‌సారి హ‌ర్ష‌వ‌ర్ద‌న్ టీవీలో ఓ షో చూశాడు. అందులో సైనికులు బాంబుల ధాటికి బ‌ల‌వుతూ మృతి చెంద‌డాన్ని గ‌మ‌నించాడు. దీంతో అత‌ని బుర్ర‌లో ఓ ఆలోచ‌న మెదిలింది. ఈ క్ర‌మంలో అలా సైనికులు చ‌నిపోకుండా ఉండేందుకు, బాంబులు, ల్యాండ్‌మైన్లు ఎక్క‌డ ఉన్నాయో సుల‌భంగా గుర్తించేందుకు గాను అత‌ను డ్రోన్స్‌ను త‌యారు చేయ‌డం మొద‌లు పెట్టాడు. అందుకు అత‌నికి రూ.5 ల‌క్ష‌ల దాకా ఖ‌ర్చ‌యింది. అయితే అత‌ని తండ్రి రూ.2 ల‌క్ష‌ల‌ను ఇవ్వ‌గా, గుజరాత్ ప్ర‌భుత్వం అత‌ని ప్ర‌తిభ‌ను గుర్తించి రూ.3 ల‌క్ష‌ల ఆర్థిక స‌హాయం చేసింది. దీంతో మొత్తం రూ.5 ల‌క్ష‌లను ఖ‌ర్చు పెట్టి హ‌ర్ష‌వ‌ర్ద‌న్ 3 డ్రోన్స్‌ను త‌యారు చేశాడు.

harshavardhan-zala-1

harshavardhan-zala-3

అవి ఎలా ప‌నిచేస్తాయంటే… చాలా దూరం వ‌ర‌కు వెళ్లి, భూమిపై 2 అడుగుల ఎత్తులో ప్ర‌యాణిస్తూ ఎక్క‌డెక్క‌డ ల్యాండ్‌మైన్లు, బాంబులు అమ‌ర్చ‌బ‌డి ఉన్నాయో ఇట్టే గుర్తిస్తాయి. అందుకు గాను డ్రోన్ల‌లో థ‌ర్మ‌ల్‌, ఇన్‌ఫ్రారెడ్ సెన్సార్లు ఉంటాయి. దీనికి తోడు ఆ లొకేష‌న్ వివ‌రాల‌ను ఆర్మీ బేస్ కు తెలియ‌జేసేందుకు వాటిలో జీపీఎస్ శాటిలైట్ వ్య‌వ‌స్థ‌, లొకేష‌న్ ఫొటోల‌ను తీసే 21 మెగాపిక్స‌ల్ సామ‌ర్థ్యం ఉన్న కెమెరా కూడా ఉంటాయి. దీంతో సైనికులు మాన్యువ‌ల్‌గా వెళ్లి త‌నిఖీ చేయ‌కుండానే ఆ డ్రోన్ల ద్వారా బాంబుల‌ను గుర్తించి వాటిని నిర్వీర్యం చేసేందుకు అవ‌కాశం ఉంటుంది. ఈ క్ర‌మంలో హ‌ర్ష‌వర్ధ‌న్ తాను త‌యారు చేసిన డ్రోన్స్‌ను ఇటీవ‌ల జ‌రిగిన వైబ్రంట్ గుజ‌రాత్ ఇన్వెస్ట‌ర్ స‌మ్మిట్‌లో ప్ర‌దర్శించ‌గా అత‌ని డ్రోన్స్‌కు గాను గుజ‌రాత్ ప్ర‌భుత్వం అత‌నితో రూ.5 కోట్ల కాంట్రాక్టును కుదుర్చుకుంది. ఆ త‌ర‌హా డ్రోన్ల‌ను హ‌ర్ష‌వ‌ర్ద‌న్ గుజ‌రాత్ ప్ర‌భుత్వానికి త‌యారు చేసి ఇవ్వ‌నున్నాడు. అయితే అందుకు గాను హ‌ర్ష‌వ‌ర్ద‌న్ సొంత కంపెనీ ఏర్పాటు చేసి దాన్ని రిజిస్ట‌ర్ చేసే ప‌నిలో ప్ర‌స్తుతం ఉన్నాడు. దీంతోపాటు అత‌ను త‌యారు చేసిన ఆ 3 ర‌కాల డ్రోన్స్‌ను ఇప్పుడు భార‌త ఆర్మీ అధికారులు ప‌రీక్షిస్తున్నారు. అవి గ‌న‌క విజ‌య‌వంత‌మైతే ఇక హ‌ర్ష‌వ‌ర్ద‌న్‌కు తిరుగే లేదు. జాతి గ‌ర్వించ‌ద‌గ్గ ఓ గొప్ప బాలుడిగా అత‌ని పేరు నిలిచిపోనుంది. అందుకు గాను హ‌ర్ష‌వ‌ర్ద‌న్‌కు మ‌నం కూడా కంగ్రాట్స్ చెబుదామా..!

Comments

comments

Share this post

scroll to top