8 ఏళ్ల వ‌య‌స్సుకే రెండు సార్లు గిన్నిస్ రికార్డులోకి ఎక్కాడు ఈ బాలుడు. ఎందుకో తెలుసా..?

భూమ్మీద ఉన్న మ‌నుషులంద‌రూ ఒకే ఎత్తు ఉండ‌రు. వేర్వేరుగా ఉంటారు. అందుకు అనేక కార‌ణాలు ఉంటాయి. కొంద‌రు ఎత్తు త‌క్కువ‌గా ఉంటే కొంద‌రు బాగా ఎత్తు పెరుగుతారు. ఇది ఓకే. కానీ… ఇప్పుడు మేం చెప్ప‌బోయే ఓ బాలుడు మాత్రం చిన్న వ‌య‌స్సులోనే బాగా ఎత్తు పెరిగిపోయాడు. ఎంత‌లా అంటే అత‌ని వ‌య‌స్సు ఇప్పుడు 8 ఏళ్లు. కానీ ఎత్తు మాత్రం 6 అడుగుల 6 ఇంచులు ఉంటాడు. ఈ క్ర‌మంలోనే ఈ బాలుడు ఇప్ప‌టికే ఎత్తు విష‌యంలో రెండు సార్లు గిన్నిస్ రికార్డు సాధించాడు కూడా. ఇంత‌కీ అస‌లు ఈ బాలుడు ఎవ‌రు, ఎక్క‌డున్నాడో తెలుసా..?

అత‌ని పేరు క‌ర‌ణ్ సింగ్‌. ఉత్త‌రప్ర‌దేశ్‌లోని మీరట్‌లో త‌ల్లిదండ్రుల‌తో క‌ల‌సి జీవిస్తున్నాడు. వారి పేర్లు ష్వెత్లానా, సంజ‌య్ సింగ్‌. త‌ల్లి ష్వెత్లానా మాజీ బాస్కెట్ బాల్ ప్లేయ‌ర్‌. భార‌త్ త‌ర‌ఫున ప‌లు అంత‌ర్జాతీయ బాస్కెట్ బాల్ మ్యాచ్‌లలో ఆడింది. అయితే ఆమె ఎత్తు 7 అడుగుల 2 ఇంచులు. దీంతో ఆమె పోలికలే క‌రణ్ సింగ్‌కు కూడా వ‌చ్చాయి. కానీ… క‌ర‌ణ్ తండ్రి సంజయ్ కూడా పొడ‌గ‌రే. 6 అడుగుల 6 ఇంచులకు కొంచెం ఎక్కువ ఎత్తు ఉంటాడు అంతే. కాగా క‌ర‌ణ్ సింగ్ పుట్టిన‌ప్పుడే ఆరున్న‌ర కిలోల బ‌రువు ఉన్నాడ‌ట‌. ఎత్తు 2 అడుగులు ఉన్నాడ‌ట‌. దీంతో పుట్టీ పుట్ట‌గానే క‌ర‌ణ్ సింగ్ గిన్నిస్ బుక్‌లోకి ఎక్కేశాడు.

ఆ త‌రువాత మ‌ళ్లీ 5 సంవ‌త్స‌రాల వ‌య‌స్సు ఉన్నప్పుడు అత‌ను మ‌రోసారి అత్యంత ఎక్కువ ఎత్తు ఉన్న చిన్న పిల్లాడిగా రెండో సారి గిన్నిస్ బుక్‌లోకి ఎక్కాడు. ఇక ఇప్పుడు క‌ర‌ణ్ సింగ్ వ‌య‌స్సు 8 సంవ‌త్స‌రాలు. ఇప్పుడు అత‌ని ఎత్తు 6 అడుగుల 6 ఇంచులు. దీంతో మ‌రోసారి క‌ర‌ణ్ పేరు గిన్నిస్ బుక్‌లోకి ఎక్క‌నుంది. అయితే క‌ర‌ణ్ త‌ల్లిదండ్రుల‌తో క‌లిసి బ‌య‌ట‌కు వెళ్లిన‌ప్పుడు వారు ముగ్గురినీ జ‌నాలు ఆశ్చ‌ర్యంగా చూస్తార‌ట‌. దీంతో వారికి ఇబ్బంది ఏమీ అనిపించ‌ద‌ట‌. కానీ వారికి ఉన్న ఇబ్బంద‌ల్లా ఒక్క‌టే. అది… క‌ర‌ణ్‌కు ఇప్పుడు స‌రైన సైజ్‌లో బ‌ట్ట‌లు, షూస్‌, చెప్పులు తీసుకోవ‌డం క‌ష్టంగా ఉంద‌ట‌. ఇప్ప‌టికే క‌ర‌ణ్ 12వ నంబ‌ర్ షూస్‌ను వేసుకుంటున్నాడ‌ట‌. ఇక స్కూల్‌లోనైతే అంద‌రు పిల్ల‌ల క‌న్నా క‌ర‌ణ్ ఎప్పుడూ వెనుకే. దూరం నుంచి చూస్తే స్కూల్ టీచ‌ర్ లా పిల్ల‌ల్లో అత‌ను ఉంటాడు.

అయితే క‌ర‌ణ్ ఆరోగ్యం మాత్రం బాగానే ఉంద‌ట‌. అతనికి ఎలాంటి ఆరోగ్య స‌మ‌స్య‌లు లేవ‌ట‌. గ్రోత్ హార్మోన్ ఎక్కువ‌గా ప‌నిచేయ‌డం వ‌ల్లే ఇలా అత‌ను ఎత్తు పెరుగుతున్నాడ‌ని వైద్యులు చెబుతున్నారు. ఈ క్ర‌మంలో క‌ర‌ణ్ ఇంకా ఎంత ఎత్తు పెరుగుతాడో చూడాలి. అన్న‌ట్టు క‌ర‌ణ్ ఏమ‌వుదామ‌నుకుంటున్నాడో తెలుసా..? బాస్కెట్ బాల్ ప్లేయ‌ర్. త‌ల్లిలా అత‌ను భార‌త్ త‌ర‌ఫున అంత‌ర్జాతీయ మ్యాచ్‌లు ఆడాల‌ని క‌ల‌లు కంటున్నాడు. ఇందులో భాగంగానే స్వ‌యానా బాస్కెట్ బాల్ ప్లేయ‌ర్ అయిన త‌ల్లి ష్వెత్లానా క‌ర‌ణ్‌కు కోచింగ్ ఇస్తోంది. అత‌ని క‌ల, ఆశ‌యం నెర‌వేరాల‌ని మ‌న‌మూ కోరుకుందాం..!

 

Comments

comments

Share this post

scroll to top