ఆ బాలుడు 5 నెల‌లుగా దాచుకున్న పాకెట్ మ‌నీతో ఏం చేశాడో తెలుసా..?

త‌ల్లిదండ్రులు చిన్న పిల్ల‌ల‌కు డ‌బ్బులు ఇస్తే వారు వాటితో ఏం చేస్తారో తెలుసు క‌దా..? ఎవ‌రైనా త‌మ‌కిష్ట‌మైన చాక్లెటో, బిస్కెటో కొనుక్కుంటారు. లేదంటే ఇంకో చిరుతిండి కొని తిని ఆనందిస్తారు. ఇంకా కొంద‌రు డ‌బ్బులు అలాగే దాచుకుని, దాన్ని ఏదైనా పెద్ద మొత్తంలా చేసి దాంతో త‌మ‌కు కావ‌ల్సిన ప‌ని చేసుకుంటారు. అయితే ఇది అంద‌రు పిల్ల‌లు చేసేదే. కానీ ఆ పిల్లాడు మాత్రం అలా కాదు. దాచుకోమ‌ని త‌న త‌ల్లిదండ్రులు ఇచ్చిన డ‌బ్బుతో ఏం చేశాడో తెలుసా..? అది తెలిస్తే మీరే ఆశ్చ‌ర్య‌పోతారు..!

william

అమెరికాలోని న్యూజెర్సీకి చెందిన విలియం ఎవ‌ర్ట్‌జ్ అనే 5 ఏళ్ల బాలుడు త‌న త‌ల్లిదండ్రులు గ‌త 5 నెల‌లుగా ఇస్తూ వ‌స్తున్న పాకెట్ మ‌నీని ఖర్చు చేయ‌కుండా జాగ్ర‌త్త‌గా దాచి పెట్టుకున్నాడు. చివ‌రిగా ఓ రోజు తాను ఆ డ‌బ్బుతో ఏం చేయాల‌నుకుంటున్నాడో త‌న తల్లిదండ్రుల‌కు చెప్పాడు. అయితే ముందుగా వారు ఆశ్చ‌ర్య‌పోయినా, త‌మ పిల్లాడిలో ఉన్న సెన్స్ చూసి అత‌ను చెప్పిందానికి ఒప్పుకున్నారు. వెంట‌నే ఆ ప‌నిని చేయ‌డం కోసం వారు కూడా సిద్ధ‌మ‌య్యారు. ఇంత‌కీ ఆ పిల్లాడు ఏం చెప్పాడంటే…

5 నెల‌లుగా దాచుకున్న పాకెట్ మ‌నీతో విలియం ఎవ‌ర్ట్‌జ్‌కు ఓ ఆలోచ‌న వ‌చ్చింది. దాంతో ఎవరూ చేయ‌నంత భిన్నంగా ఓ ప‌ని చేయాల‌నుకున్నాడు. త‌మ ప్రాంతంలో ఉండే పోలీసుల‌కు స్నాక్స్‌, కూల్ డ్రింక్స్‌తో పార్టీ ఇవ్వాల‌ని నిర్ణ‌యించుకున్నాడు. మొద‌ట త‌ల్లిదండ్రుల‌కు చెప్ప‌గానే వారు ఆశ్చ‌ర్య‌పోయినా, చివ‌ర‌కు త‌మ పిల్లాడు చెప్పిందాన్ని చేసేందుకు వారు సిద్ధ‌మ‌య్యారు. స్థానిక పోలీసుల‌కు ఈ విష‌యం చెప్ప‌గానే వారు విలియం తెలివిని మెచ్చుకుని సంతోషంగా అత‌న్ని త‌మ స్టేష‌న్‌లోకి ఆహ్వానించారు. అనంత‌రం ఆ బాలుడు ఇచ్చిన పార్టీలో ఎంజాయ్ చేశారు.

william

అయితే విలియంకి ఎందుకు ఆలోచ‌న వ‌చ్చింది అని ఎవ‌రూ ఆలోచించ‌లేదు. కానీ నిజంగా మ‌నం ఆలోచిస్తే, పోలీసులంటే అత‌నికి ఎంతో ఇష్టం ఉండే ఉంటుంది. ఎక్క‌డో ఒక చోట వారు చేసే సాహసాల‌ను అత‌ను చూసే ఉంటాడు. ఈ క్ర‌మంలోనే వారికి పార్టీ ఇవ్వాల‌ని విలియంకు అనిపించి ఉంటుంది. అలాగే ఇచ్చాడు. దీని వెనుక ఇంత‌కంటే వేరే కార‌ణం ఇంకోటి ఉంటుంద‌ని అయితే మేం భావించ‌డం లేదు. ఇంత‌కీ మీరేమంటారు..?

Comments

comments

Share this post

scroll to top