అత‌ను 8వ త‌ర‌గ‌తి ఫెయిల్ అయ్యాడు… ఇప్పుడు హ్యాక‌ర్ గా కోట్లు సంపాదిస్తున్నాడు..!

హ్యాక‌ర్‌… ఎక్క‌డో దూరంలో ఉన్నా రిమోట్‌గా ఏదైనా కంప్యూట‌ర్ లేదా డివైస్‌ను త‌న స్కిల్స్‌తో త‌న ఆధీనంలోకి తెచ్చుకునే నైపుణ్యం. ఇది రావాలంటే ఎన్నో సాఫ్ట్‌వేర్ కోర్సులు చ‌ద‌వాల్సి ఉంటుంది. ఎంతో ప్రాక్టీస్ అవ‌స‌రం ఉంటుంది. అప్పుడు గానీ హ్యాకింగ్ కోర్సులో నిష్ణాతులు అవ‌లేరు. అయితే ఆ యువ‌కుడు మాత్రం అలా కాదు. చ‌దివింది 8వ త‌ర‌గ‌తే. అది కూడా ఫెయిల్ అయ్యాడు. అయినా… హ్యాకింగ్‌లో మాత్రం దిట్టే. పెద్ద పెద్ద సాఫ్ట్‌వేర్ కంపెనీల్లో ప‌నిచేసే హ్యాక‌ర్ల‌కు ఏమాత్రం తీసిపోడు. ఈ క్ర‌మంలోనే ఉత్త‌మ హ్యాక‌ర్‌గా అత‌ను రాణించ‌డ‌మే కాదు, ఏకంగా ఓ కంపెనీనే పెట్టి దాని ద్వారా పెద్ద పెద్ద కార్పొరేట్ సంస్థ‌ల‌కు త‌న సేవ‌లు అందిస్తూ ఏటా కోట్లాది రూపాయ‌ల‌ను ఆర్జిస్తున్నాడు. అత‌నే… లూథియానాకు చెందిన త్రిష్నీత్ అరోరా.

Trishneet-Arora-1

పంజాబ్‌కు చెందిన లూథియానాలో నివాసం ఉండే త్రిష్నీత్ అరోరాకు చిన్న‌ప్ప‌టి నుంచి కంప్యూట‌ర్లు అంటే ఎంత‌గానో ఇష్టం. ఎప్పుడూ కంప్యూట‌ర్‌తోనే కుస్తీ ప‌డుతూ ఉండేవాడు. రోజూ దాని గురించిన కొత్త కొత్త విష‌యాల‌ను, కొత్త కోర్సుల‌ను తెలుసుకుంటూ వాటిలో త‌న నైపుణ్యాన్ని పెంచుకోసాగాడు. అయితే 8వ త‌ర‌గ‌తిలో ఉండ‌గా అత‌ను రెండు స‌బ్జెక్టుల్లో ఫెయిల్ అయ్యాడు. దీంతో తోటి స్నేహితులు, ఇరుగు పొరుగు వారు అత‌నికి చ‌దువు రాద‌ని గేలి చేశారు. కానీ అందుకు త్రిష్నీత్ అరోరా దిగులు చెంద‌లేదు. స్కూల్ మానేసి ప‌ట్టుద‌ల‌గా కంప్యూట‌ర్ కోర్సులు చ‌దివాడు. ఈ క్ర‌మంలోనే మంచి నైపుణ్యం ఉన్న హ్యాక‌ర్‌గా పేరుగాంచాడు. దీంతో అనేక కంపెనీల నుంచి అత‌నికి ఆఫ‌ర్లు వ‌చ్చాయి. అయినా వాటిని అత‌ను తీసుకోలేదు. సొంతంగా టీఏసీ సెక్యూరిటీ అనే ఓ సాఫ్ట్‌వేర్ సైబ‌ర్ సెక్యూరిటీ సంస్థ‌ను ఏర్పాటు చేశాడు. అప్పుడు అతనికి 22 ఏళ్లు..!

Trishneet-Arora-2

అలా త్రిష్నీత్ అరోరా దిన దిన ప్ర‌వ‌ర్థ‌మానం ఎదిగాడు. ఇప్పుడు అతని కంపెనీకి ఎన్ని కంపెనీలు క్ల‌యింట్లుగా ఉన్నాయో తెలుసా..? 50కి పైనే. ఆయా కంపెనీల‌న్నీ ప్ర‌పంచంలోని టాప్ 500 కంపెనీల్లో ఉన్న‌వే. రిల‌యన్స్‌, అమూల్‌, అవాన్ సైకిల్స్ వంటి ప్రైవేటు సంస్థ‌ల‌తోపాటు సీబీఐ, పంజాబ్ పోలీస్‌, గుజ‌రాత్ పోలీస్ వంటి ప్ర‌భుత్వ రంగ సంస్థ‌లు కూడా ఇప్పుడు త్రిష్నీత్ అరోరా కంపెనీకి క్ల‌యింట్లుగా మారిపోయాయి. ఆయా సంస్థ‌ల‌కు చెందిన సాఫ్ట్‌వేర్ సెక్యూరిటీ బాధ్య‌త‌ల‌ను త్రిష్నీత్ అరోరా కంపెనీయే చూసుకుంటోంది. అవి హ్యాకింగ్‌కు గురి కాకుండా చూడ‌డం అత‌ని కంపెనీ బాధ్య‌త‌. దీంతో ఇప్పుడు అత‌ని లైఫే మారిపోయింది. అయితే అరోరా గురించిన ఇంకో విష‌యం తెలుసా..? అత‌ను హ్యాకింగ్‌పై ఏకంగా 3 పుస్త‌కాల‌నే రాశాడు. హ్యాకింగ్ టాక్ విత్ త్రిష్నీత్ అరోరా, ది హ్యాకింగ్ ఎరా, హ్యాకింగ్ విత్ స్మార్ట్‌ఫోన్స్‌..! ఇవి టెక్ ప్ర‌పంచంలో అతనికి ఎంత‌గానో పేరు సంపాదించి పెట్టాయి కూడా. ఒక‌ప్పుడు 8వ త‌ర‌గ‌తి ఫెయిల్ అయినా అనుకున్న ల‌క్ష్యాన్ని సాధించి ఇప్పుడు కోట్లు ఆర్జిస్తున్న త్రిష్నీత్ అరోరా ను మ‌నం నిజంగా అభినందించాల్సిందే క‌దా..!

Comments

comments

Share this post

scroll to top