వేల‌కోట్ల ఆస్తులు అతని సొంతం…అయినా సొంత కొడుకుని నిరుపేదగా బతికిచూపించాలని కండీషన్ పెట్టాడు.!

అత‌ను పేరుగాంచిన ఓ వ్యాపారవేత్త‌. అనేక దేశాల్లో కంపెనీలున్నాయి. వేల కోట్ల రూపాయ‌ల ఆస్తులు ఉన్నాయి. త‌ర‌తరాలు కూర్చుని తిన్నా త‌ర‌గ‌ని ఆస్తి అత‌నిది. ఉన్న‌ది ఒక్క‌గానొక్క కొడుకు. అయితే ఆ కొడుకు మాత్రం నిరుపేద జీవితాన్ని గ‌డిపాడు. అవును, మీరు విన్నది నిజ‌మే. కాగా, అన్ని వేల కోట్ల ఆస్తులు ఉన్న‌ప్పటికీ ఆ వ్యాపార వేత్త కొడుకు నిరుపేద జీవితాన్ని ఎందుకు గ‌డిపాడో తెలుసా..? ఆ తండ్రి వ‌ల్లే. ఇది వింటేనే మీకు ఆశ్చ‌ర్యం క‌లుగుతుండ‌వ‌చ్చు. అయినా ఇది నిజంగా జరిగిన సంఘ‌ట‌నే. ఇంత‌కీ ఆ వ్యాపార వేత్త కొడుకు అలాంటి జీవితాన్ని ఎందుకు గ‌డ‌పాల్సి వచ్చిందో మీరే చూడండి..!

savji-dholakia

గుజ‌రాత్‌లోని సూర‌త్ ప్రాంతానికి చెందిన సావ్‌జీ ఢొలాకియా పెద్ద వ్యాపార వేత్త‌. డైమండ్ బిజినెస్‌లో ఆరితేరాడు. మ‌న దేశంలోనే కాదు 71 దేశాల్లో ఇత‌ని బిజినెస్‌కు బ్రాంచ్‌లు ఉన్నాయి. అనేక వేల్ల కోట్ల రూపాయ‌ల ఆస్తులు ఉన్నాయి. అత‌ని ఒక్క‌గానొక్క కొడుకే డ్రావ్యా ఢొలాకియా. ఇటీవ‌లే అమెరికాలో ఎంబీఏ విద్య‌ను పూర్తి చేసుకుని హాలిడే కోసం ఇండియాకు వ‌చ్చాడు. కాగా సావ్‌జీ ఢొలాకియా మాత్రం త‌న కొడుక్కి అస‌లైన జీవితం ఎలా ఉంటుందో నేర్పాల‌నుకున్నాడు. కొద్ది రోజుల పాటు త‌న‌తో సంబంధం లేకుండా, త‌న పేరు వాడుకోకుండా నిరుపేద జీవితం గ‌డపాల‌ని కొడుక్కి చెప్పాడు. అప్పుడే జీవితం విలువ ఏంటో తెలుస్తుంద‌ని, క‌ష్టాలు, స‌మ‌స్య‌లు అనుభవం అవుతాయ‌ని, అలాంటి నిరుపేద జీవితంలోనే అస‌లైన జీవిత ప‌రమార్థం అర్థం అవుతుంద‌ని, ఆ జీవితంలో ఉంటేనే ఉద్యోగం సంపాదించ‌డం, తృప్తిగా భోజ‌నం చేయ‌డం వంటివి ఎంత క‌ష్ట‌మో అవ‌గ‌త‌మ‌వుతుంద‌ని సావ్‌జీ ఢొలాకియా భావించాడు. అదే విష‌యాన్ని కొడుక్కి చెప్పి నెల రోజుల పాటు ఆ జీవితం గ‌డ‌పాల‌ని అన్నాడు. అందుకు డ్రావ్యా ఢొలాకియా కూడా స‌వాల్‌గా స్వీక‌రించాడు. ఈ క్ర‌మంలో సావ్‌జీ అత‌నికి 3 జ‌త‌ల బ‌ట్ట‌లను, రూ.7వేల న‌గ‌దును ఇచ్చాడు. అయితే అత్యంత అవ‌స‌ర‌మైన స్థితిలో మాత్ర‌మే ఆ డ‌బ్బును వాడాల‌ని, ఆ నెల రోజుల పాటు తాను ఎవ‌రో, ఏంటో ఏ విష‌యం కూడా బ‌య‌ట పెట్ట‌కుండా సాధార‌ణ నిరుపేద జీవితం గ‌డ‌పాల‌ని, జాబ్ చేస్తూ జీవితం గ‌డ‌పాల‌ని, ఏ జాబ్‌లోనూ వారం పాటు ఉండ‌కూడ‌ద‌ని డ్రావ్యాకు చెప్పాడు. అంతేకాకుండా ఎట్టి ప‌రిస్థితిలోనూ మొబైల్ ఫోన్ వాడ‌కూడ‌ద‌ని కండిష‌న్ విధించాడు. దీంతో ఆ ఛాలెంజ్‌ను స్వీక‌రించిన డ్రావ్యా త‌నకు భాష కూడా రాని, ప‌రిచ‌యం లేని న‌గ‌ర‌మైన కొచ్చికి ఇటీవ‌ల వెళ్లాడు. అయితే ఛాలెంజ్ స్వీక‌రించినంత సులువుగా డ్రావ్యా దాన్ని ఎదుర్కోలేక‌పోయాడు.

dravya-dholakia

ఇంటి నుంచి అలా బ‌య‌టికి వ‌చ్చిన డ్రావ్యా నేరుగా కొచ్చికి వెళ్లాడు. అక్క‌డ మొద‌టి 5 రోజులు అత‌నికి జాబ్ దొర‌క‌లేదు. ఎన్నో కంపెనీల చుట్టూ తిరిగాడు. తాను గుజ‌రాత్‌లోని ఓ పేద కుటుంబం నుంచి వ‌చ్చాన‌ని చెప్పినా జాబ్ దొర‌క‌లేదు. ఎట్ట‌కేల‌కు ఓ బేక‌రీలో అత‌నికి జాబ్ దొరికింది. అనంత‌రం తండ్రి ష‌ర‌తు ప్ర‌కారం అత‌ను వారం ఆగాక ఓ కాల్‌సెంట‌ర్‌లో, అటు పిమ్మ‌ట చెప్పుల షాపు, మెక్ డొనాల్డ్స్ ఔట్‌లెట్ వంటి షాపుల్లో వారం పాటు ప‌నిచేశాడు. అలా నెల రోజుల్లో డ్రావ్యా రూ.4వేల‌ను సంపాదించ‌గ‌లిగాడు. ఈ క్ర‌మంలో అత‌నికి స‌రైన ఆహారం దొర‌క‌డం క‌ష్ట‌త‌ర‌మైంది. రూ.40ల భోజ‌నంతో అత‌ను రోజూ క‌డుపు నింపుకున్నాడు. నెల రోజుల త‌రువాత డ్రావ్యా ఎలాగో ఇంటికి చేరుకున్నాడు. అయితే అత‌ను ఇప్పుడు ఏమంటున్నాడంటే త‌న తండ్రి బ‌య‌టికి పంపినందువల్లే త‌న‌కు డ‌బ్బు, జీవితం విలువ తెలిసింద‌ని, నిరుపేద జీవితం గ‌డ‌ప‌డం చాలా క‌ష్ట‌మ‌ని తాను తెలుసుకున్నాన‌ని అంటున్నాడు. అంతేగా మ‌రి! ఏది ఏమైనా త‌న కొడుకు బలాదూర్‌గా తిరిగి ఎక్క‌డ చెడిపోతాడోన‌ని భావించిన ఆ తండ్రి అత‌నికి అలాంటి ప‌రీక్ష పెట్టడం, అత‌ను దాన్ని స‌వాల్‌గా తీసుకుని నెల రోజుల పాటు నిరుపేద జీవితం గ‌డ‌ప‌డం నిజంగా ఆశ్చ‌ర్య‌మే మ‌రి. తాతలు, తండ్రులు సంపాదించిన ఆస్తుల‌ను అడ్డం పెట్టుకుని తిరిగేవారికి సావ్‌జీ, డ్రావ్యా ఢొలాకియాల చ‌ర్య ఒక చెంప పెట్ట‌నే మ‌నం చెప్పుకోవ‌చ్చు. అంతేగా!

Comments

comments

Share this post

scroll to top