ఆ సాఫ్ట్‌వేర్ కంపెనీలో ఉద్యోగులు కూరగాయ‌లు పండించి వాడుకుంటున్నారు తెలుసా..?

సాఫ్ట్‌వేర్ కంపెనీ అన‌గానే మ‌న‌కు కంప్యూట‌ర్లు, వాటిపై గంట‌ల త‌ర‌బ‌డి బిజీగా ప‌నిచేసే ఉద్యోగులు గుర్తుకు వ‌స్తారు. ఇక వారి ఆఫీస్ ప్రాంగ‌ణాల్లో అయితే ఎప్పుడూ క్ష‌ణం తీరిక లేకుండా ఉద్యోగులు క‌నిపిస్తారు. అయితే బెంగుళూరుకు చెందిన ఆ సాఫ్ట్‌వేర్ కంపెనీలో ఇంకో ప్ర‌త్యేక‌మైన దృశ్యం కూడా మ‌న‌కు క‌నిపిస్తుంది. అక్క‌డి ఉద్యోగులు త‌మ ఆఫీసు ప్రాంగ‌ణంలో కూర‌గాయ‌లు కొంటూ క‌నిపిస్తారు. అంతేనా..! అన‌కండి, ఎందుకంటే… వారు కొనే కూర‌గాయ‌లు ఎవ‌రో రైతులు తెచ్చిన‌వి కావు, వారే స్వ‌యంగా పండించుకున్న‌వి. అవును, మీరు విన్న‌ది నిజ‌మే..!

బెంగుళూరులోని స‌స్కేన్ టెక్నాల‌జీస్ సంస్థ‌లో ఆఫీసుకు పోను 4 ఎక‌రాల ఖాళీ స్థ‌లం ఉండేది. అందులో 3 ఎక‌రాల వ‌ర‌కు క్రీడ‌ల‌కు గాను వివిధ ర‌కాల కోర్టులు ఏర్పాటు చేశారు. బాస్కెట్ బాల్‌, వాలీబాల్‌, టెన్నిస్‌, బ్యాడ్మింట‌న్ వంటి క్రీడ‌ల‌ను ఆడుకునేందుకు ఆ కంపెనీ యాజ‌మాన్యం త‌న ఉద్యోగులకు ఆ కోర్టులు ఏర్పాటు చేసింది. అయితే మొత్తం 4 ఎక‌రాల్లో 3 ఎక‌రాలు వాటికి పోను ఇంకా 1 ఎక‌రం ఖాళీ స్థ‌లం మిగిలింది. దీంతో ఆ కంపెనీ యాజ‌మాన్యం ఓ వినూత్న‌మైన ఆలోచ‌న చేసింది. ఆ స్థలంలో కూర‌గాయ‌లు పండించ‌డం మొద‌లు పెట్టారు.

అలా స‌స్కేన్ టెక్నాల‌జీస్ ప్రాంగ‌ణంలో గ‌త 4 నెల‌ల నుంచి కూర‌గాయ‌ల‌ను పండిస్తున్నారు. ఎలాంటి కృత్రిమ ఎరువులు వాడ‌కుండా పూర్తిగా సేంద్రీయ ప‌ద్ధ‌తిలో ఆర్గానిక్ పంట‌ల‌ను వారు పండిస్తున్నారు. క్యాబేజీ, పాల‌కూర, ట‌మాటో, స్వీట్ కార్న్‌, బెండ కాయ‌లు, బీన్స్‌, క్యారెట్లు, బీట్‌రూట్‌, ముల్లంగి, కాక‌ర‌కాయ‌, కొత్తిమీర త‌దిత‌ర కూర‌గాయ‌లు, ఆకుకూర‌ల‌ను వారు పండిస్తున్నారు. అలా పండించిన వాటిని ఆఫీసు ప్రాంగ‌ణంలో పెట్టి అమ్ముతున్నారు. వాటి ధ‌ర మార్కెట్ ధ‌ర క‌న్నా 20 శాతం త‌క్కువే. పైగా స‌హ‌జ సిద్ధ‌మైన ప‌ద్ధ‌తిలో పండించిన తాజా కూర‌గాయ‌లు కావ‌డంతో ఆ కంపెనీ ఉద్యోగులు వాటినే కొనుగోలు చేస్తున్నారు. దీంతో అలా వ‌చ్చిన డ‌బ్బుల‌తో మ‌ళ్లీ పంట‌ల‌ను వేయ‌డం మొద‌లు పెట్టారు. అయితే వారు అలా కూర‌గాయ‌ల‌ను పండించ‌డం ఏమో గానీ… ఓ ఐదుగురు రైతుల‌కు మాత్రం పని దొరికింది. వారికి నెల‌కు ఇంత మొత్తం అని జీతం ఇచ్చి వారిచే పంట‌ల‌ను పండిస్తున్నారు. ఏది ఏమైనా… ఆ సాఫ్ట్‌వేర్ కంపెనీ ఐడియా చాలా బాగుంది క‌దా..!

Comments

comments

Share this post

scroll to top