నీ రెటెంత‌..? అని ఓ వ్య‌క్తి అడిగిన ప్ర‌శ్న‌కు ఆ యువ‌తి చెప్పిన స‌మాధానం ఏంటో తెలుసా..?

నేడు మ‌న దేశంలో మ‌హిళ‌లు అన్ని చోట్లా మృగాళ్ల నుంచి ఎలాంటి వేధింపులు ఎదుర్కొంటున్నారో అంద‌రికీ తెలిసిందే. దీని వ‌ల్ల మ‌హిళ‌లు ఎన్నో ఇబ్బందుల‌కు గుర‌వుతున్నారు. కొంద‌రైతే అలాంటి వేధింపులు భ‌రించ‌లేక ఉద్యోగాలు కూడా మానేసిన సంద‌ర్భాలు ఉంటున్నాయి. చాలా మంది లైంగిక వేధింపులను ఎదుర్కొన‌డ‌మే కాదు, మృగాళ్ల చూపులు, అస‌భ్య‌క‌ర సైగ‌లు, చేష్ట‌లు వంటి వాటి బారిన కూడా ప‌డుతున్నారు. ఇక సోష‌ల్ మీడియాలో ఉన్న మ‌హిళ‌ల‌కు వ‌చ్చే వేధింపులు అన్నీ ఇన్నీ కావు. నిత్యం చాలా మంది మృగాళ్లు మ‌హిళ‌ల‌కు అస‌భ్య‌క‌ర ప‌దజాలంతో కూడిన మెసేజ్‌ల‌ను పంపుతూనే ఉంటారు. అది ఇప్పటికీ కొన‌సాగుతూనే ఉంది. అయితే బెంగుళూరుకు చెందిన ఓ మ‌హిళ‌కు కూడా తాజాగా ఇలా సోష‌ల్ మీడియాలో అసభ్య ప‌ద‌జాలంతో కూడిన వేధింపులు ఎక్కువ‌య్యాయి. అయితే ఆమె వాటికి బెద‌ర‌లేదు. పైగా ధైర్యంగా ముందుకు వ‌చ్చింది. అలాంటి మెసేజ్‌లు పెడుతున్న వ్య‌క్తికి గ‌ట్టిగా బుద్ధి చెప్పింది.

ఆమె పేరు రిచా చంద్ర‌వంశీ. బెంగుళూరులో ఉంటోంది. ఐబీఎం కంపెనీలో ప‌నిచేస్తోంది. అయితే ఈ మ‌ధ్య కాలంలో ఆమెకు వివేక్ తివారీ అనే ఓ వ్య‌క్తి నుంచి ఫేస్‌బుక్‌లో మెసేజ్‌లు ఎక్కువ‌య్యాయి. అవ‌న్నీ అస‌భ్య‌ప‌ద‌జాలంతో కూడిన‌వే. ”నీ రేటెంత‌..? నీ శ‌రీరం బాగుంది. సైజ్ బాగుంది. నా ద‌గ్గ‌ర చాలా డ‌బ్బుంది. ఒక్క రాత్రికి ఎంత తీసుకుంటావు..?” ఇదిగో ఈ త‌ర‌హాలో ఆ మెసేజ్‌లు ఉండేవి. అయితే మొదట్లో రిచా వాటి ప‌ట్ల స్పందించ‌లేదు. కానీ ఆ వ్య‌క్తి ప‌దే ప‌దే అలాంటి మెసేజ్‌లు పంపుతుండే స‌రికి ఇక ఆమెకు ఓపిక న‌శించింది. ఎలాగైనా అత‌నికి బుద్ధి చెప్పాల‌ని అనుకుంది. వెంట‌నే ఏం చేసిందంటే… అత‌ను పెట్టిన మెసేజ్‌ల‌లో కొన్నింటిని తీసుకుని వాటిని త‌న ఫేస్‌బుక్ వాల్‌పై పోస్టు చేసింది. అంతేకాదు, ఆ వ్య‌క్తికి ఓ మెసేజ్ కూడా పెట్టింది. అందులో ఏముందంటే… ”నీ ద‌గ్గ‌ర డ‌బ్బుంటే దాన్ని తీసుకుని ఎక్క‌డైనా పెట్టుకో, తృప్తిగా ఉంటుంది. అంతేకానీ నా జోలికి రాకు, సైబ‌ర్ క్రైం పోలీసుల‌కు ప‌ట్టిస్తా. అస‌లు అలాంటి మెసేజ్‌లు ఎందుకు పెడుతున్నావ్‌..? వాటినే నీ ఇంట్లో నీ త‌ల్లికి పెట్టు, అప్పుడు ఎలా అనిపిస్తుందో వ‌చ్చి చెప్పు..!” అంటూ రిచా అత‌నికి మెసేజ్ చేసింది. దీంతో ఒక్క‌సారిగా ఆ విషయం ఆమె స్నేహితులంద‌రికీ తెలిసింది.

అయితే కొంద‌రు ఆమె ధైర్యాన్ని ప్ర‌శంసించారు. కానీ కొంద‌రు మాత్రం వ్య‌తిరేకించారు. అలా చేస్తే ఏమొస్తుంది అని ప్ర‌శ్నించారు. అయిన‌ప్ప‌టికీ రిచా ధైర్యంగా ముందుకు సాగింది. అంతేకాదు, ఇంకా అలాంటి మెసేజ్‌లు పంపితే సైబ‌ర్ క్రైం పోలీసుల‌కు ప‌ట్టిస్తాన‌ని బెదిరించింది. దీంతో ఆ వ్య‌క్తి ఏకంగా త‌న ఫేస్‌బుక్ అకౌంట్‌నే డిలీట్ చేశాడు. అదీ… అలా ఆమె ఆ వ్యక్తికి బుద్ధి చెప్పింది. దీంతో ఆమె ధైర్యానికి మెచ్చి చాలా మంది ఆమెను అభినందించారు. అలాంటి మెసేజ్‌లు వ‌స్తున్నాయ‌ని బాధ‌పడే క‌న్నా అలాంటి మెసేజ్‌లు ఇక‌పై రాకుండా వాటిని పంపే వ్య‌క్తుల‌కు గ‌ట్టిగా బుద్ధి చెప్పాల‌ని ఆమె తెలియ‌జేసింది. ఆమె ధైర్యానికి, చేసిన ప‌నికి నిజంగా హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే..!

Comments

comments

Share this post

scroll to top