అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ‌ల్ల 3వ ప్ర‌పంచ యుద్ధం ప్రారంభ‌మై అంతా నాశ‌న‌మ‌వుతుంద‌ట తెలుసా..?

అప్పుడెప్పుడో.. అంటే.. 2012వ సంవ‌త్స‌రానికి చాలా కాలం ముందు నుంచే ఓ పుకారు జోరుగా ప్రచారంలో ఉండేది తెలుసు క‌దా. అదేనండీ… 2012 డిసెంబ‌ర్ 21వ తేదీన భూమిపై ప్ర‌ళ‌యం వ‌స్తుంద‌ని, అంతా నాశ‌న‌మ‌వుతుంద‌ని, మ‌య‌న్లు అన‌బ‌డే ఓ తెగ‌కు చెందిన వారి క్యాలెండ‌ర్ ఆ తేదీ వ‌ర‌కే ఉంద‌ని, అందుకే క‌చ్చితంగా ప్ర‌ళ‌యం వ‌చ్చే తీరుతుంద‌ని అంతటా ప్ర‌చారం జ‌రిగింది. కానీ అలాంటిదేదీ జ‌ర‌గ‌క‌పోవ‌డంతో జ‌నాలు ఊపిరి పీల్చుకున్నారు. అయితే ఆ త‌రువాత ఇప్పుడు తాజాగా ఇలాంటిదే మ‌రో వార్త జోరుగా ప్ర‌చార‌మ‌వుతోంది. కానీ… ఇప్పుడు రానున్న‌ది స‌హ‌జంగా వ‌చ్చే ప్ర‌కృతి విప‌త్తు కాద‌ట‌. మాన‌వ జాతి త‌మంత‌ట తామే వినాశ‌నం కొని తెచ్చుకోనుంద‌ట‌. అవును, మీరు వింటున్న‌ది క‌రెక్టే. ఇది మేం చెబుతోంది కాదు, ఓ జ్యోతిష్యుడు చెబుతున్నాడు.

అత‌ని పేరు ప్ర‌మోద్ గౌత‌మ్‌. ఉత్త‌ర‌ప్ర‌దేశ్ వాసి. జ్యోతిష్యుడు. అదే అత‌ని వృత్తి, వ్యాప‌కం. వేదిక్ సూత్రం అనే సంస్థ‌ను అత‌ను న‌డుపుతున్నాడు. అయితే ఇత‌ను గ‌తంలో మ‌న దేశంలో ఎన్నిక‌ల‌ప్పుడు మోదీ ప్ర‌ధాని అవుతార‌ని చెప్ప‌గా అలాగే జ‌రిగింది. తాజాగా ట్రంప్ అమెరికా అధ్య‌క్షుడు అవుతాడ‌ని ఈయ‌న జోస్యం చెప్ప‌గా అలాగే జ‌రిగింది. అయితే ఇప్పుడు ఈయ‌నే మ‌రో విష‌యం చెబుతున్నారు. అదేమిటంటే… ట్రంప్ కుజ‌గ్ర‌హ పీడితుడ‌ట‌. అందుక‌ని ఆయ‌న వ‌ల్ల అమెరికా హింస‌ను ఎదుర్కొన‌బోతుంద‌ట‌. అంతేకాదు, 2017 మే 13 నుంచి సెప్టెంబర్‌ మాసాంతం వరకు డొనాల్డ్‌ ట్రంప్‌పై కుజుడు తీవ్ర ప్రభావం చూపుతాడు కాబ‌ట్టి ఆయ‌న వ‌ల్ల 3వ ప్ర‌పంచ యుద్ధం వ‌స్తుంద‌ట‌. దీంతో ప్ర‌పంచం అంతా నాశ‌నం అవుతుంద‌ని ఈయ‌న అంటున్నాడు.

అందుకే ప్ర‌మోద్ గౌత‌మ్ తాజాగా య‌మునా న‌ది తీరంలో ఓ య‌జ్ఞం కూడా చేశారు. ఈయ‌న ఒక‌ప్పుడు ట్రంప్ అమెరికా అధ్య‌క్షుడిగా గెల‌వాల‌ని య‌జ్ఞం చేయ‌గా, ఇప్పుడు ఆయ‌న వ‌ల్ల రానున్న వినాశ‌నాన్ని తప్పించాల‌ని య‌జ్ఞం చేశాడు. య‌మునా న‌దికి సోద‌రుడు అయిన య‌మ ధ‌ర్మ‌రాజు (మృత్యువుకు అధిప‌తి) ను ఉద్దేశించి ఈ య‌జ్ఞం చేశామ‌ని, ప్ర‌పంచ వినాశనం కాకుండా శాంతి క‌ల‌గాల‌ని ప్రార్థించామ‌ని ఆయ‌న తెలిపారు. అందుకే ఇప్పుడీ వార్త అంత‌ర్జాతీయ మీడియా దృష్టిన కూడా ప‌డింది. దీంతో ఇప్పుడీ విష‌యం హాట్ టాపిక్‌గా మారింది. ఇక భార‌త్‌, పాక్‌లు కూడా జ‌మ్మూ కాశ్మీర్ విష‌యంలో ర‌గిలిపోతాయ‌ని, వాటి మ‌ధ్య ఉద్రిక్త‌త‌లు నెల‌కొంటాయ‌ని కూడా ఈయ‌న చెప్పారు. అయినా… ఇవ‌న్నీ జ‌రుగుతాయా..? మ‌ంచి అయితే జ‌రుగుతుంద‌ని కాంక్షించ‌వ‌చ్చు, కానీ చెడు జ‌ర‌గాల‌ని ఎవ‌రూ కోరుకోరు క‌దా. ఏమో… ఒక వేళ జ‌రిగినా మ‌న‌మేం చేయ‌లేం..! సాధార‌ణ ప్ర‌జ‌ల‌మే క‌దా..!

Comments

comments

Share this post

scroll to top