ప్ర‌ధాని మోదీకి ఆ మాజీ సైనికుడి భార్య ఏం పంపిందో తెలిస్తే షాక్ అవుతారు..?

పాక్ సైనికులు మ‌న భార‌త సైనికుల‌పై ఎలాంటి పైశాచిక చ‌ర్య‌లకు పాల్ప‌డుతున్నారో అంద‌రికీ తెలిసిందే. మొన్నా మ‌ధ్యే మ‌న సైనికుల త‌ల‌ల‌ను తెగ న‌రికారు పాక్ ఆర్మీ జ‌వాన్లు. ఇదే కాదు, ఈ మ‌ధ్య కాలంలో ఇలాంటి క‌వ్వింపు చ‌ర్య‌ల‌కు, దాడుల‌కు పాక్ ఆర్మీ తెగించింది. అయిన‌ప్ప‌టికీ కేంద్ర ప్ర‌భుత్వం పాక్ ఆట క‌ట్టించేందుకు ఇప్ప‌టికింకా ఎలాంటి చ‌ర్యా తీసుకోలేదు. ఓ వైపు మ‌న సైనికులు అలా పిట్ట‌ల్లా రాలుతున్న‌ప్ప‌టికీ ఎలాంటి చ‌ర్య‌లు తీసుకోకుండా నిర్ల‌క్ష్యం వ‌హిస్తున్నారెందుక‌ని ఓ సైనికుడి భార్య ప్ర‌శ్నిస్తూ వినూత్న రీతిలో త‌న నిర‌స‌న తెలిపింది. ఇంత‌కీ ఆమె ఎవ‌రంటే..?

ఆమె పేరు సుమ‌న్ సింగ్‌. ఆమె భ‌ర్త పేరు ధ‌ర‌మ్ వీర్‌. అత‌ను మాజీ సైనిక అధికారి. 1991 నుంచి 2007 వ‌ర‌కు ఆర్మీలో అత‌ను సేవ‌లందించాడు. ఆ త‌రువాత ఆమ్ ఆద్మీ పార్టీలో ప‌నిచేశారు. అయితే ఇటీవ‌లి కాలంలో మ‌న దేశ సైనికులు ప‌డుతున్న వేద‌నను, పాక్ సైనికులు మ‌న సైనికులను పెడుతున్న చిత్ర హింస‌లు, గురి చేస్తున్న దాడులు చూసి సుమ‌న్ సింగ్ చ‌లించిపోయింది. దీంతో ఆమె ప్ర‌ధాని మోడీకి ఓ లేఖ రాసింది. ‘‘ధైర్యానికి ప్రతీక అయిన మీ 56 అంగుళాల ఛాతి ఏమైంది? మన సైన్యంపై పాకిస్థాన్‌ జరుపుతున్న దాడులను నివారించలేక పోతున్నారెందుకు? ఎన్నికల ప్రచారంలో మీరేమ‌న్నారు..? అధికారంలోకి వస్తే భారత్ వైపు పాక్‌ కన్నెత్తి చూసే సాహసం కూడా చేయలేదంటూ బీరాలు పలికారు కదా? మరి.. ఇప్పుడేం జరుగుతోంది? పరిస్థితులు గతంలోకన్నా దారుణంగా ఉన్నాయి’’ అంటూ ఆమె లేఖ రాసింది.

మన సైనికులను చిత్రహింసలు చేసి చంపుతున్నారు. తుపాకులతో చంపి కత్తులతో శరీరాలను ఛిద్రం చేస్తున్నారు. తలలను నరుకుతున్న విషయాలను పేపర్లు, టీవీల ద్వారా తెలుసుకుంటున్నాం. మహిళలు తమ పిల్లలు, సోదరులు, భర్తలను దేశ సరిహద్దులకు పంపుతున్నది వేర్పాటువాదుల చేతుల్లో దెబ్బలు తినటానికి, వాళ్ల రాళ్ల దాడిలో చనిపోవటానికి కాదు. పాక్ ఉగ్రవాదుల చేతుల్లో తలలు నరికించుకోవటానికి కాదు. అంటూ ఆమె ఆ లేఖ‌లో త‌న వేద‌న‌ను తెలియ‌జేసింది. అంతేకాదు, ఆ లేఖ‌తోపాటు 56 అంగుళాల సైజ్ ఉన్న బ్రాను ఆ లేఖ‌తో పంపింది. పాక్ సైనికులు, ఉగ్రవాదుల దాడులతో ఎంతో మంది భారత సైనికులు చనిపోతున్నందున తాను తట్టుకోలేకపోయానని, అందుకే ఆ లేఖ‌ను పంపుతున్నాన‌ని ఆమె చెప్పింది. అవును మ‌రి, పాక్ కు గట్టిగా బుద్ధి చెప్పాల్సిన స‌మ‌యం త్వ‌ర‌గా రావాల‌ని మ‌న‌మూ కోరుకుందాం..!

Comments

comments

Share this post

scroll to top