దూకుడు మీదున్న భారత వైస్ కెప్టెన్ “స్మ్రితి మందాన” అతని ప్రపోజల్ కు YES చెప్పిందా.? ఎలా రియాక్ట్ అయ్యిందంటే.?

స్మృతి మంధ‌న‌.. భార‌త మ‌హిళా క్రికెట్ జ‌ట్టులో ఇప్పుడీమె ఓ యువ కెర‌టం. 2013 నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు అనేక మ్యాచ్‌ల‌లో ఈమె త‌న స‌త్తా చాటుతూనే వ‌స్తోంది. 2013వ సంవ‌త్స‌రంలో వ‌న్డే ఇంట‌ర్నేష‌న‌ల్ మ్యాచ్‌ను తొలిసారిగా ఆడిన మంధ‌న 2014లో టెస్ట్ డెబ్యూ చేసింది. ప్ర‌స్తుతం భార‌త మ‌హిళా క్రికెట్ జ‌ట్టులో ఈమె ఒక సంచ‌ల‌నం. తన తండ్రి, సోద‌రులు జిల్లా స్థాయిలో పేరుగాంచిన క్రికెట్ ఆట‌గాళ్లు కావ‌డంతో వారి నుంచి ప్రేర‌ణ పొందిన మంధ‌న క్రికెట‌ర్ కావాల‌ని అనుకుంది. త‌న క‌ల‌ను సాకారం చేసుకుంది.

2013, అక్టోబ‌ర్‌లో జ‌రిగిన ఓ వ‌న్డేలో మంధ‌న డ‌బుల్ సెంచ‌రీ చేసి ఆ ఘన‌త సాధించిన తొలి భార‌తీయ మ‌హిళా క్రికెట‌ర్‌గా రికార్డు సృష్టించింది. 2016లో జ‌రిగిన చాలెంజ‌ర్ ట్రోఫీలో మంధ‌న ఇండియా రెడ్ జ‌ట్టు త‌ర‌ఫున ఆడి అన్ని మ్యాచుల్లో క‌లిపి 3 అర్ధ సెంచ‌రీలు చేసింది. దీంతో ఆ జ‌ట్టు ఇండియా బ్లూ జ‌ట్ట‌పై ఘ‌న విజ‌యం సాధించింది. బ్లూ జ‌ట్టుపై మంధ‌న 82 బంతుల్లో 62 పరుగులు సాధించి అజేయంగా నిల‌వ‌డంతో రెడ్ జ‌ట్టు గెలిచింది.

ఇక సెప్టెంబ‌ర్ 2016లో మంధ‌న వుమెన్స్ బిగ్ బ్యాష్ లీగ్ (డ‌బ్ల్యూబీబీఎల్‌) లో బ్రిస్బేన్ హీట్ జ‌ట్టు త‌ర‌ఫున ఆడేందుకు ఏడాది పాటు ఒప్పందం కుదుర్చుకుంది. ఆమెతోపాటు మ‌రో భార‌తీయ మ‌హిళా క్రికెట‌ర్ అయిన హ‌ర్మ‌న్‌ప్రీత్ కౌర్ కూడా ఈ లీగ్‌లో పాల్గొంది. ఈ లీగ్‌లో ఆడిన మొద‌టి ఇద్ద‌రు భార‌తీయ మ‌హిళా క్రికెట‌ర్లుగా వీరు గుర్తింపు పొందారు. ఇక మంధ‌న 2016లో ప్ర‌క‌టించిన ఐసీసీ వుమెన్స్ టీమ్ ఆఫ్ ది ఇయ‌ర్‌లో స్థానం ద‌క్కించుకున్న ఒకే ఒక భార‌తీయ మ‌హిళా క్రికెట‌ర్‌గా గుర్తింపు పొందింది. ఇక గ‌తేడాది జ‌రిగిన వుమెన్స్ క్రికెట్ వ‌ర‌ల్డ్ క‌ప్‌లో భార‌త మ‌హిళ‌ల జ‌ట్టు ఫైన‌ల్‌కు చేర‌గా అందులో మంధ‌న కూడా ఉంది. ఇక తాజాగా కింబ‌ర్లీలో సౌతాఫ్రికాతో జ‌రిగిన మ్యాచ్‌లో మంధ‌న 84 ప‌రుగులు చేసింది. దీంతో భార‌త్ ఆ జ‌ట్టుపై గెలుపొందింది.

అయితే క్రికెట్ రంగంలో రాణిస్తున్న స్మృతి మంధ‌న నిజానికి చూసేందుకు చ‌క్క‌ని ముఖ వర్చ‌స్సును క‌లిగి ఉంటుంది. ఈ క్ర‌మంలోనే ఈ విష‌యంపై ఆమెకు చాలా మంది నుంచి ప్ర‌శంస‌లు ద‌క్కాయి కూడా. అయితే దీన్ని దృష్టిలో ఉంచుకునే తాజాగా ఓ ప్ర‌ముఖ సౌతిండియా యాక్ట‌ర్ త‌న సినిమాలో న‌టించాల్సిందిగా మంధ‌న‌ను కోరాడ‌ట‌. కానీ దానిపై ఆమె ఇప్ప‌టి వ‌ర‌కు స్పందించ‌లేదు. గ‌తంలో సానియా మీర్జాను కూడా ఇదే న‌టుడు త‌న సినిమాలో చేయ‌మ‌ని కోర‌గా అప్పుడు ఆమె నిరాక‌రించింద‌ట‌. దీంతో ఈసారి ఎలాగైనా మంధ‌న‌ను త‌న సినిమాలో న‌టింప‌జేయాల‌ని ఆయ‌న అనుకుంటున్నాడ‌ట‌. అయితే గ‌తంలో ఓ సంద‌ర్భంలో మంధ‌న సినిమాల్లో తాను న‌టించ‌బోన‌ని చెప్పిన దృష్ట్యా ఇప్పుడు ఈ న‌టుడి ఆఫ‌ర్ ప‌ట్ల ఆమె ఎలా స్పందింస్తుందో చూడాలి. అయినా ఆమె సినిమాల క‌న్నా క్రికెట్‌లో అయితేనే బెట‌ర్ క‌దా. అంత మంచి నైపుణ్యం ఉన్న క్రీడాకారిణులు తాము ఆడే ఆట‌ల‌కు వీడ్కోలు ప‌ల‌క‌డం అంత బాగుండ‌దేమో..!

Comments

comments

Share this post

scroll to top