ఆ బామ్మ 72 ఏళ్ల వ‌య‌స్సులో బాలుడికి జ‌న్మ‌నిచ్చింది. ఎలాగో తెలుసా..?

మెనోపాజ్‌. 45 ఏళ్లు దాటిన మ‌హిళ‌లకు వ‌స్తుంది. అది వ‌చ్చిందంటే ఇక పిల్లలు క‌ల‌గ‌డం అసాధ్యం. ఈ క్రమంలో మ‌హిళ‌ల‌కు మెనోపాజ్ అనేది ఇత‌ర అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను కూడా తెచ్చి పెడుతుంది. అయితే దీని గురించి ప‌క్క‌న పెడితే… అస‌లు మెనోపాజ్ వ‌య‌స్సు కూడా దాటి చాలా ఏళ్లు అయితే పిల్ల‌ల‌ను క‌నేందుకు అవ‌కాశం ఉంటుందా..? అస‌లే ఉండ‌దు. కానీ.. ఆ వృద్ధురాలు 72 ఏళ్ల వ‌య‌స్సులో పండంటి బాలుడికి జ‌న్మ‌నిచ్చింది. మెనోపాజ్ దాటి ఎన్నో ఏళ్లు అవుతున్నా ఆమె బాలుడికి జ‌న్మ‌నివ్వ‌డం విశేషం. దీంతో ఇప్పుడీ బామ్మ అత్యంత ఎక్కువ ఏజ్‌లో బాలుడికి జ‌న్మ‌నిచ్చిన త‌ల్లిగా రికార్డు సృష్టించింది.

వారి పేర్లు మోహింద‌ర్ సింగ్‌, ద‌ల్జీంద‌ర్ కౌర్‌. మోహింద‌ర్ వ‌య‌స్సు 79 ఏళ్లు. ద‌ల్జీంద‌ర్ వ‌య‌స్సు 72 సంవ‌త్స‌రాలు. వీరికి 46 ఏళ్ల క్రితం వివాహం అయింది. అయితే వీరికి పిల్ల‌లు లేరు. దీంతో చాలా మంది అనాథ పిల్ల‌ల‌ను ద‌త్త‌త తీసుకోమ‌ని స‌ల‌హాలు ఇచ్చారు. అయితే వాటిని వీరు విన‌లేదు. ఈ క్ర‌మంలోనే తాజాగా వీరికి పిల్ల‌లు కావాల‌నే కోరిక ఎక్కువైంది. దీంతో వారు త‌మ హ‌ర్యానా రాష్ట్రంలోని ఓ ప్రాంతంలో ఉన్న ఫెర్టిలిటీ సెంట‌ర్‌కు వెళ్లారు. వారు ఐవీఎఫ్ (IVF) ట్రీట్‌మెంట్ ను మొద‌లు పెట్టారు. దీంతో గ‌ర్భం దాల్చిన ద‌ల్జీంద‌ర్ ఈ మ‌ధ్యే ఓ బాలుడికి జ‌న్మ‌నిచ్చింది.

ద‌ల్జీంద‌ర్ కౌర్ అలా 72 ఏళ్ల వ‌య‌స్సులో బాలుడికి జన్మ‌నివ్వ‌డంతో ఇప్పుడీ విష‌యం వైర‌ల్ అయింది. అంత ఎక్కువ వ‌య‌స్సులో అదీ ఐవీఎఫ్ ట్రీట్‌మెంట్ ద్వారా బాలుడికి జ‌న్మ‌నివ్వ‌డంతో ఆమె వ‌ర‌ల్డ్ రికార్డు సృష్టించింది. అత్యంత ఎక్కువ వ‌య‌స్సులో ఐవీఎఫ్ ద్వారా బాలున్ని క‌న్న మ‌హిళ‌గా ఆమె రికార్డు సాధించింది. అయితే త‌మ‌కు ఇప్ప‌టికే 70 ఏళ్ల‌కు పైగా వ‌య‌స్సు ఉన్న‌ప్ప‌టికీ పుట్టిన బాలున్ని మాత్రం జాగ్ర‌త్త‌గా చూసుకుంటామ‌ని, చ‌క్క‌గా చ‌దివించి పెద్ద‌వాన్ని చేస్తామ‌ని వారు చెబుతున్నారు. వారి క‌ల నెర‌వేరాల‌ని ఆశిద్దాం.

Comments

comments

Share this post

scroll to top