సిగ్గు పడాల్సిన విష‌యం. కుష్టుతో చేతి వేళ్ల‌ను కోల్పోయింది ఆమె. ఆధార్ ఇవ్వ‌రు. పెన్ష‌న్ ఆపారు..!

బ్యాంక్ అకౌంట్‌కు ఆధార్‌.. పాన్ కార్డుకు ఆధార్‌.. వంట గ్యాస్‌, మొబైల్ క‌నెక్ష‌న్‌, ఎల్ఐసీ పాల‌సీ.. ఇలా చెప్పుకుంటూ పోతుంటే ఇప్పుడు ఆధారే అంద‌రికీ ఆధారం అయింది. అది లేక‌పోతే మ‌న దేశంలో ఒక పౌరుడు బ‌త‌క‌లేని ప‌రిస్థితి వ‌చ్చింది. ఆధార్‌తో ప్ర‌జ‌ల జీవితం సుల‌భ‌త‌ర‌మ‌వుతుంద‌ని కేంద్ర ప్ర‌భుత్వం చెబుతున్న‌ప్ప‌టికీ క్షేత్ర‌స్థాయిలో మాత్రం వాస్త‌వాలు వేరేగా ఉంటున్నాయి. అవును, క‌రెక్టే. ఆధార్ లేక‌పోవ‌డం వ‌ల్ల ఓ వృద్ధురాలికి నెల నెలా వ‌స్తున్న రూ.1000 పెన్ష‌న్ ఆగిపోనుంది. అదేంటీ.. మ‌రి ఆధార్ తీసుకోవ‌చ్చుగా.. అని మీకు సందేహం రావ‌చ్చు. కానీ అక్క‌డ ఆధార్ తీసుకోలేక కాదు, ఆధార్ ఆమెకు రాదు. ఎందుకంటే ఆమెకు చేతి వేళ్లు లేవు. అదొక ట్రాజెడీ స్టోరీ..!

ఆమె పేరు సాజిదా బేగం. వ‌య‌స్సు 65 సంవ‌త్స‌రాలు. బెంగుళూరు వాసి. అయితే సాజిదాకు ఇప్ప‌టి వ‌ర‌కు నెల నెలా రూ.1000 వృద్ధాప్య‌ ఫించ‌న్ వ‌చ్చేది. కానీ అది ఇప్పుడు ఆగిపోనుంది. ఎందుకంటే ఆమెకు ఆధార్ లేదు. ఆధార్ తీసుకుందామ‌న్నా రాదు. ఎందుకంటే ఆమెకు రెండు చేతి వేళ్లు లేవు. ఆమెకు ఉన్న కుష్టు వ్యాధి వ‌ల్ల రెండు చేతుల వేళ్లను ఆమె కోల్పోయింది. దీంతో ఆధార్ లేక ఆమెకు వ‌చ్చే పెన్ష‌న్ ఆగిపోనుంది.


అయితే సాజిదా పరిస్థితి తెలుసుకున్న కొంద‌రు ఆమె గురించిన విష‌యాన్ని సోష‌ల్ మీడియాలో పెద్ద ఎత్తున షేర్ చేశారు. షేమ్‌.. షేమ్‌.. అంటూ కామెంట్లు పెట్టారు. ఇది ఒక్క‌సారిగా వైర‌ల్ అవ‌డంతో స్పందించిన సంబంధిత అధికారులు ఈ నెల మాత్రం ఆమెకు పెన్ష‌న్ ఇచ్చారు. ఇక మ‌రి రానున్న నెల‌ల్లో ఆమె ప‌రిస్థితి ఏంటో.. అర్థం కావ‌డం లేదు. త‌న‌కు వ‌చ్చే రూ.1000 పెన్ష‌న్ మీద ఆధార ప‌డే ఆమె జీవిస్తోంది. మ‌రో వైపు కుష్టు వ్యాధి కార‌ణంగా క‌ళ్లు కూడా పోయాయి. ప‌ని చేయ‌లేని దుస్థితిలో ఆమె ఉంది. ఇక ఆమెను ప్రభుత్వాలే ఆదుకోవాలి. అయితే ఇది సాజిదా స‌మ‌స్య మాత్ర‌మే కాదు, దేశ వ్యాప్తంగా కుష్టు వ్యాధితో బాధ‌ప‌డుతున్న అంద‌రి ప‌రిస్థితి దాదాపుగా ఇలాగే ఉంది. మ‌రి వారికి త‌గిన‌ట్టుగా ఆధార్ కాకుండా మ‌రేదైనా కొత్త నిబంధ‌న అందుబాటులోకి తెస్తే బాగుంటుంది. అయినా ఇది మ‌న నాయ‌కుల‌కు ప‌డుతుందా.. వారికి ఎంత సేపు ఎన్నిక‌లు, డ‌బ్బు సంపాద‌న ధ్యాసే కదా.. ఏం చేస్తాం.. వారు మార‌రు..!

Comments

comments

Share this post

scroll to top