ప్రపంచంలోనే అత్యంత అందమైన బాలిక ఈమె….దానికి కారణం ఏంటో తెలుసా..?

చూపు తిప్పుకోనీయని అందం… ఆకర్షణీయమైన ముఖ వర్చస్సు.. కళ్లు.. ముక్కు.. పెదవులు… శిరోజాలు.. ఇలా ఒకటేమిటి.. ఆ బాలిక చూసేందుకు మొత్తం అచ్చం బొమ్మలాగే ఉంటుంది. చూస్తే నిజంగా ఎవరైనా బొమ్మే అనుకుంటారు. అంతటి అందం ఆ బాలిక సొంతం. ఇంతకీ ఎవరామె..? అంటే.. ఆమె పేరు.. అనస్టాషియా నైజెవా. వయస్సు 6 సంవత్సరాలు. అయినప్పటికీ ఇప్పుడు ఆమె టాప్‌ చైల్డ్‌ మోడల్ గా రాణిస్తోంది. అంతేకాదు, ప్రపంచంలోనే అత్యంత అందమైన బాలికగా ఈమె పేరుగాంచింది.

అనస్టాషియా చూసేందుకు అచ్చం బొమ్మలాగే ఉంటుంది. అందుకనే ఆమె ఇప్పుడు రష్యాలో బాగా పాపులర్‌ అయిన చైల్డ్‌ మోడల్‌ అయింది. ఇప్పటికే ఎన్నో కంపెనీల యాడ్స్‌లో ఈమె నటించింది. ఈ క్రమంలోనే అనస్టాషియాకు ఇప్పుడు సోషల్‌ మీడియాలోనూ విపరీతంగా ఫ్యాన్స్‌ పెరిగిపోయారు. ఇన్‌స్టాగ్రాంలో అయితే ఈమెను ఫాలో అవుతున్న వారి సంఖ్య 5 లక్షలకు పైగానే ఉండడం విశేషం.

అంతలా ఈ బాలిక రష్యాలో పాపులర్‌ అయింది. దీంతో ఇప్పుడామెను ప్రపంచంలోనే అత్యంత అందమైన బాలికగా గుర్తించారు. అయితే ఇదే ఘనతను మరో యువతి కూడా సొంతం చేసుకుంది. కాకపోతే ఆమెకు వయస్సు ఎక్కువ. ఫ్రెంచ్‌ మోడల్‌ థైలేన్‌ బ్లాండియో కూడా ప్రపంచంలోనే అత్యంత అందమైన బాలికగా ఇంతకు ముందు పేరు గాంచింది. కానీ ఈమె ఇప్పుడు యుక్త వయస్సు (16 సంవత్సరాలు)కు రావడంతో ఇప్పుడీమె పేరును అనస్టాషియా సొంతం చేసుకుంది. ఫొటోల్లో అనస్టాషియాను మీరే చూస్తున్నారు కదా. ఎంత అందంగా ఉందో..! ఏది ఏమైనా నిజంగా ఈమెను బాలిక అనడం కంటే బొమ్మ అంటేనే బాగుంటుంది కదా..!

Comments

comments

Share this post

scroll to top