ఆ బాలుడి వ‌య‌స్సు 6 సంవ‌త్స‌రాలు.. అయినా ఏడాదికి రూ.70 కోట్లు సంపాదిస్తున్నాడు. ఎలాగో తెలుసా..?

సాధార‌ణంగా 6 సంవ‌త్స‌రాల వ‌య‌స్సు అంటే.. ఆ వ‌య‌స్సులో ఉండే పిల్లలు స‌ర‌దాగా ఆడుతారు. పాడుతారు. ఎంజాయ్ చేస్తారు.. రోజూ స్కూల్‌కు వెళ్ల‌డం, రావ‌డం.. హోం వ‌ర్క్ చేయ‌డం.. అనంత‌రం ఆట‌ల్లో మునిగి తేలుతారు. ఇక చిరు తిండి స‌రే సరి. వారికిష్ట‌మైనవి కొనిస్తే ఎంతో సంతోషిస్తారు. ఇలా ఆ వ‌య‌స్సులో ఉండే పిల్ల‌లు ఎవ‌రైనా ఇలాగే చేస్తారు. అయితే ఇప్పుడు మేం చెప్ప‌బోయే ఈ బాలుడు మాత్రం అలా కాదు. ఏకంగా ఏడాదికి రూ.70 కోట్ల‌ను సంపాదిస్తున్నాడు తెలుసా..! అవును, మీరు విన్న‌ది నిజమే. ఇంత‌కీ ఆ బాలుడు ఎవ‌రంటే…

అత‌ని పేరు ర్యాన్‌. వ‌య‌స్సు 6 సంవ‌త్స‌రాలు (ఉండే ప్ర‌దేశం, ఇత‌ర వివ‌రాల‌ను గోప్యంగా ఉంచారు). అయినా ఈ బాలుడు అంద‌రు పిల్ల‌ల్లా కాదు. ఏకంగా సంవత్సరానికి 11 మిలియ‌న్ డాల‌ర్ల‌ను సంపాదిస్తున్నాడు. అంటే మ‌న క‌రెన్సీలో దాదాపుగా రూ.70 కోట్లు అన్న‌మాట‌. అయితే ఇత‌ను ఏం చేసి అంత డ‌బ్బును సంపాదిస్తాడో తెలుసా..? తాను ఆడుకునే బొమ్మ‌లు ఎలా ఉన్నాయో రివ్యూ చేసి చెబుతాడు.. అంతే.. అందుకే ఇత‌నికి అంత మొత్తం డ‌బ్బు ల‌భిస్తోంది. అది కూడా ఈ బాలుడు కేవలం యూట్యూబ్ ద్వారానే సంపాదిస్తున్నాడు.


యూట్యూబ్‌లో ర్యాన్‌కు సొంతంగా ఓ చాన‌ల్ ఉంది. దాని పేరు Ryan Toys Review. అందులో తాను రివ్యూ చేసే బొమ్మల వీడియోలు పెడ‌తాడు. దీంతో వాటి వ‌ల్ల ర్యాన్‌కు డ‌బ్బులు వ‌స్తున్నాయి. ఇక ర్యాన్ అంత మొత్తంలో డ‌బ్బు సంపాదించడం వ‌ల్ల ఇప్పుడు వార్త‌ల్లో ప్ర‌ముఖంగా నిలిచాడు. అంతేకాదు అత‌ని పేరు 2017వ సంవత్స‌రంలో యూట్యూబ్ ద్వారా అత్య‌ధిక డ‌బ్బులు సంపాదించిన వ్య‌క్తుల జాబితాలో చేరింది. ఆ జాబితాలో ర్యాన్‌కు 8వ స్థానం ద‌క్క‌డం విశేషం. దీంతో ఇప్పుడు ర్యాన్ సెల‌బ్రిటీ అయిపోయాడు. అయితే కేవ‌లం ఆడుకునే బొమ్మ‌ల రివ్యూలు మాత్ర‌మే కాదు, ర్యాన్ సొంతంగా పిల్ల‌ల కోసం కొన్ని సైన్స్ ప్రాజెక్ట్‌లు చేసి వాటిని యూట్యూబ్‌లో పెట్టాడు. దీంతో వాటికి కూడా పాపులారిటీ ల‌భిస్తోంది. ఇక ర్యాన్ చేసిన Giant Egg Surprise అనే వీడియోను ఏకంగా 800 మిలియ‌న్ల మంది చూశారంటేనే ఇత‌నికి ఎంత పాపులారిటీ ఉందో ఇట్టే అర్థం చేసుకోవ‌చ్చు. చివ‌రిగా.. ర్యాన్ యూట్యూబ్‌కు చాన‌ల్‌కు ఉన్న స‌బ్‌స్క్రైబర్ల సంఖ్య విష‌యానికి వస్తే.. వారు మొత్తం 10 మిలియ‌న్ల మంది ఉన్నారు. ఆ.. అని ఆశ్చ‌ర్య‌పోకండి. ఇది నిజ‌మే. ఏది ఏమైనా 6 సంవ‌త్స‌రాల వ‌య‌స్సులోనే ఏటా రూ.70 కోట్ల‌ను సంపాదిస్తున్నాడంటే.. ర్యాన్ తెలివికి నిజంగా హ్యాట్సాఫ్..!

 

Comments

comments

Share this post

scroll to top