అందంగా లేద‌ని…సొంత కూతుర్నే ఇంటినుండి త‌రిమేసిన పేరెంట్స్.!

స‌మాజం అంటే అంతే. మ‌నుషుల లోప‌లి అందానికి అది విలువ‌నివ్వ‌దు. కేవ‌లం బాహ్య‌పుటందాలు మాత్ర‌మే దానికి కావాలి. ముఖం ఎంత అందంగా ఉంది, శ‌రీరం ఎంత బాగుంది అనే చూస్తుంది త‌ప్ప శ‌రీరంలో ఉన్న మ‌న‌స్సుకు అది విలువ‌నివ్వ‌దు. స‌రిగ్గా ఇలా ఆలోచించారు క‌నుక‌నే ఆ క‌సాయి త‌ల్లిదండ్రులు బాలిక అని చూడ‌కండా త‌మ 15 ఏళ్ల కూతుర్ని స్వ‌యంగా వారే త‌న్ని త‌రిమేశారు. అందుకు వారు చెప్పిన సాకు.. ఆ బాలిక అందంగా లేద‌ట‌. ఆమె ముఖంపై ట్యూమర్ ఉందని వారు త‌మ కూతుర్ని ఇంట్లో నుంచి బ‌య‌ట‌కు గెంటేశారు. హృద‌య విదార‌క‌మైన ఈ ఘ‌ట‌న జ‌రిగింది మ‌ధ్య‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో.

మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లోని సింగ్రోలి జిల్లా చిత్రంగి అనే గ్రామంలో నివాసం ఉండే ఓ బాలిక‌కు అరుదైన వ్యాధి వ‌చ్చింది. దీంతో ఆమె ముఖంపై పెద్ద లావుపాటి ట్యూమ‌ర్ ఏర్ప‌డింది. అయితే ట్యూమ‌ర్ కార‌ణంగా ఆమె ముఖం పూర్తిగా మారిపోయింది. దీంతో ఆమె అంద‌విహీనంగా మారింద‌ని ఆమె త‌ల్లిదండ్రులు ఆమెను గెంటేశారు. ఆ బాలిక వ‌య‌స్సు 15 సంవ‌త్స‌రాలు. అయిన‌ప్ప‌టికీ ఆమెపై క‌నిక‌రం చూప‌లేదు. త‌న్ని త‌రిమేస్తే ఆ బాలిక బ‌య‌ట‌కు వెళ్లి ఎలా బ‌తుకుతుంది అని ఆ త‌ల్లిదండ్రులు ఆలోచించ‌లేదు. వారు ఆమెను బ‌ల‌వంతంగా వ‌దిలించుకున్నారు.

ఆ బాలిక త‌న‌ను వెళ్ల‌గొట్ట‌వ‌ద్ద‌ని ఎంత‌గానో ప్రాధేయ‌ప‌డింది. అయినా వారు విన‌లేదు. ఆ త‌ల్లిదండ్రుల‌కు ఇంత కూడా క‌రుణ క‌ల‌గ‌లేదు. ఆమెను వెళ్ల‌గొట్టేశారు. దీంతో ఆ బాలిక ప‌డ్డ క‌ష్టాలు అన్నీ ఇన్నీ కావు. ఓ వైపు ఆక‌లి బాధ‌. మ‌రో వైపు ఉండ‌డానికి గూడు లేదు. దీంతో బ‌య‌ట రోడ్డుపై దొరికే ఆహారం తిన్నది. గుళ్లలో నిద్రించింది. అయితే అదృష్టం ఆమె వైపు ఉంది. చివ‌ర‌కు ఆమెను ర‌త‌గ‌డ్‌కు చెందిన ఖాండ్వా అనే అనాథాశ్ర‌మం వారు చేర‌దీశారు. ప్ర‌స్తుతం ఆమె అక్క‌డే నివాసం ఉంటోంది. అక్క‌డే నూత‌న జీవితం ప్రారంభించింది. ఏది ఏమైనా ఇలాంటి స్థితి ఎవ‌రికీ రాకూడ‌దు..!

Comments

comments

Share this post

scroll to top