12 యేళ్ళ అమ్మాయి..సృష్టిని రక్షించే పనిని భుజాన వేసుకొని సక్సెస్ అయ్యింది.!

మనం రోజు ఎన్నో రకాలుగా నీటిని ఉపయోగిస్తుంటాం,అందులో సగానికి పైగా నీటిని వృధా చేస్తుంటాం. మళ్ళీ నీటి కోసం ఎన్నో తిప్పలు పడుతుంటాం కానీ నీటి వృధా గురించి అసలు ఆలోచించం. కానీ ఆ చిన్నారి ఆలోచించింది. ప్రస్తుత పర్యావరణంలో అతి పెద్ద సమస్య అయిన నీటి వృధాను ఆపడానికి తన వయసుకు మించి కృషి చేసింది. అందులో విజయవంతమైంది.

అసలెందుకు వాటిని తయారుచేయాలనుకుంది?

నాసిక్ కు చెందిన 12 ఏళ్ళ సృష్టి నేర్కర్ రచన విద్యాలయ స్కూల్ లో ఆరవ తరగతి చదువుతోంది. ఒకరోజు ఉదయం సృష్టి వాళ్ళ నాన్న కారును నీళ్ళతో శుభ్రం చేస్తున్నాడు. నీరు ఎక్కువగా ఉపయోగిస్తున్న వాళ్ళ నాన్నను, తక్కువ నీటితోనే కారును క్లీన్ చేయవచ్చని ఆలోచించింది. అయితే కారును కేవలం 2 లీటర్లతోనే క్లీన్ చేయవచ్చని ఎవరో చెప్పగా తెలుసుకున్న ఆ అమ్మాయి, వాళ్ళ నాన్నతో కలిసి అది ఎలా సాధ్యమవుతుందో వెళ్లి చూసింది. నీటిని వృధా చేయకుండా ప్రత్యేకమైన నీటి స్పింకర్లు ఉపయోగించి నీరు వృధా కాకుండా చేయొచ్చని, తమ ఇంటిలోనూ అలాంటి స్పింకర్లనే ఉపయోగించింది. వీటిని ఎలక్ట్రిక్ వైర్ పైపులు మరియు పివిసి పైపులను ఉపయోగించి ఆ పరికరాలను తయారుచేసింది. అయితే వీటిని  తయారు చేసేటప్పుడు మొదటి నాలుగు ఫెయిల్ అయినా తర్వాత విజయం సాధించింది.
IMG_20151215_191100626-750x500
ఇవి ఎలా పనిచేస్తాయంటే..?
ఒక మనిషి మాములుగా షవర్ తో  స్నానం చేయడానికి దాదాపు 80 లీటర్లను ఉపయోగిస్తున్నాడు. అయితే ఈ పరికరాన్ని ఉపయోగించటం వల్ల కేవలం 15 లీటర్లనే ఉపయోగించేలా ఏర్పాటు చేసి, మిగతా 65 లీటర్లు సేవ్ చేస్తున్నారు. అలాగే తమ వాహనాలను క్లీన్ చేయడానికి ఈ స్పింకర్లను ఉపయోగించి వాటర్ ను సేవ్ చేయవచ్చు. ఈ పద్ధతిని ఉపయోగించి  17 లక్షల మంది జనాభాకు 34 రోజుల పాటు ఇలా నీటిని పంపిణీ చేయవచ్చు. సృష్టి కనుగొన్న ఈ పరికరాన్ని ఆమె ప్రతిభను గుర్తించిన జిల్లా కలెక్టర్ దిపేందర్ సింగ్, ఆ పరికర పేటెంట్ హక్కులను సృష్టికేనని తెలిపారు.
పర్యావరణ ప్రేమికురాలిగా, బుల్లి ఇన్వెంటర్ గా పేరు తెచ్చుకున్న సృష్టికి పెయింటింగ్ అనే చాలా ఇష్టమట. ఎప్పుడూ ఏవో బొమ్మలు గీస్తూనే ఉంటుందట. అలాగే బాస్కెట్ బాల్, మేజిక్ లు కూడా చేస్తుందట సృష్టి. 12 ఏళ్ళకే ఎంతో సాధించిన సృష్టిని ఇంకా నువ్వేం సాదించాలనుకుంటున్నావ్ అని మీడియా అడిగితే.. సెన్సార్ పరికరాలను ఉపయోగించి ఎంతవరకు నీరు అవసరమో అంతే వాడుకునేలా ఏర్పాటు చేస్తానని, ఇంకా నీటి వృధాను తగ్గించాలని చెబుతోంది ఈ బుల్లి ఇన్వెoటర్.

Comments

comments

Share this post

scroll to top