కలెక్టర్ ఆ గ్రామస్థుల కళ్ళు తెరిపించాడు.! వింతంతువు కు అండగా నిలబడ్డాడు.

బీహార్ లో గోపాల్ గంజ్ జిల్లాలోని కళ్యాణ్ పూర్ అనే గ్రామంలో ఓ వితంతువు స్కూల్లో  మధ్యాహ్న భోజనం వండుతుందని, ఆమె వండిన భోజనం తమ పిల్లలు తినరని, వెంటనే ఆమెను విధుల నుండి బహిష్కరించాలని అడ్డుకున్నారు గ్రామస్థులు. అంతటితో ఆగక ఆమె వంట చేసినన్ని రోజులు తమ పిల్లలను స్కూల్ కు పంపేదే లేదంటూ చెప్పి, స్కూల్ ను బలవంతంగా మూసేయించారు. దీంతో మనస్థాపం చెందిన ఆ వింతంతు మహిళ సరాసరి కలెక్టర్ దగ్గిరికి వెళ్లి తన పరిస్థితి గురించి వివరించింది.  కొన్ని నెలల క్రితమే భర్త చనిపోయాడని, ఇద్దరి పిల్లలను వంట చేస్తే తనకు నెలకు వచ్చే  1000 రూపాయలతో పోషించుకుంటున్నానని తెలిపింది.

ఆమె మాటలు విన్న కలెక్టర రాహుల్ కుమార్ చలించిపోయారు, హుటాహుటిన జిల్లా విద్యాశాఖాదికారులతో కలిసి కళ్యాణ్ పూర్ గ్రామానికి బయలుదేరి,  పాఠశాలను తెరిపించి, ఆ వితంతువును వంట చేయాల్సిందిగా కోరాడు. ఆ ఊరి ప్రజల సమక్షంలోనే  ఆ వితంతువు వండిన  భోజనాన్ని, విద్యార్ధులతో కలిసి తిన్నాడు.  ఆపదలో ఉన్న సాటి మనిషి ఆదుకోవడం, ఎదుటి వ్యక్తిని గౌరవించడమే మన అందరి అభిమతం కావాలని, అది అన్ని మతాలకంటే కూడా గొప్పదని చెప్పాడు.

1450513877enhanced-buzz-30179-1450508846-5

 

కలెక్టర్ చేసిన ఆ పనికి గ్రామస్థులంతా తలలు దించుకున్నారు.. తమ తప్పు తెలుసుకున్నారు. ఇక మీదట అలా చేయం అంటూ ప్రాశ్చాత్తప పడ్డారు. గతంలో కూడా కర్నాటకలో ఓ దళిత మహిళ మద్యాహ్న భోజనం వండుతోందని …తల్లీదండ్రులు తమ పిల్లలను స్కూల్ కు పంపిచడమే మానేశారు…. అంతరిక్షంలోకి దూసుకెళుతున్నా…. ఇంకా మత మౌఢ్యాలు మాత్రం మన ప్రజలను వీడకపోవడం బాధాకరం.

ఈ విషయంలో వేగంగా విభిన్నంగా, స్పందించిన కలెక్టర్ గారికి అభినందనలు

 

 

Comments

comments

Share this post

scroll to top