మేథ‌స్సులోనే కాదు, అందంలోనూ ఆ ప్ర‌భుత్వ మ‌హిళా అధికారుల‌కు ఇత‌రులెవ‌రూ సాటి రారు..!

పండిత పుత్రః ప‌ర‌మ శుంఠః అనే సామెత‌ను ఎప్పుడైనా విన్నారా?  వినే ఉంటారు లెండి. మేధావులైన తండ్రుల క‌డుపున పుట్టిన పిల్ల‌లు ఉత్త వెధ‌వ‌లైతే ఆ మాట వాడ‌తారు. ఈ క్ర‌మంలో మ‌రో సామెత కూడా ప్ర‌చారంలో ఉంది. అయితే అది స్త్రీల‌కు సంబంధించిన‌ది. అందం ఉన్న‌వారికి తెలివి, తెలివి ఉన్న వారికి అందం, ఇవి రెండూ ఉన్న‌వారికి అణ‌కువ ఉండ‌వ‌ని చెబుతారు. ఇదే సామెత‌. దీని ప్ర‌కారం అందం, తెలివి, అణ‌కువ వంటి గుణ గ‌ణాల‌న్నీ ఉన్న అమ్మాయిల‌ను పెళ్లి చేసుకోవాల‌ని పెద్ద‌లు చెబుతుంటారు. కానీ అలాంటి వారు చాలా అరుదుగానే ఉంటారు. ఎక్కడో త‌ప్ప అలాంటి వారు మ‌న‌కు అంత‌గా క‌నిపించ‌రు. ఈ క్ర‌మంలో దేశంలో ప‌లు ఉన్న‌త స్థానాల్లో ఉద్యోగం చేస్తున్న ప్ర‌భుత్వ మ‌హిళా అధికారులు కూడా స‌రిగ్గా ఇదే కోవ‌కు చెందుతారు. వారు కేవ‌లం మేథ‌స్సులోనే కాదు అందానికి మారు పేరుగా కూడా నిలుస్తున్నారు. అలాంటి ప్ర‌భుత్వ అధికారిణుల గురించిన వివ‌రాలు ఇప్పుడు తెలుసుకుందాం.

women-officers

1. స్మితా స‌బ‌ర్వాల్‌…
డైన‌మిక్ ఐఏఎస్ ఆఫీస‌ర్‌గా గుర్తింపు పొందిన స్మితా స‌బ‌ర్వాల్‌ది ప‌శ్చిమ‌బెంగాల్‌లోని డార్జిలింగ్‌. ఈమె 2001 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్ ఆఫీస‌ర్‌. ఈమె త‌న 23వ ఏట సివిల్స్ ప‌రీక్ష‌లో దేశవ్యాప్తంగా సత్తా చాటి 4వ ర్యాంక్‌ను సాధించింది. తెలంగాణ క్యాడ‌ర్‌కు చెందిన అకుమ్ స‌బ‌ర్వాల్‌ను వివాహం చేసుకుంది. వీరికి ఇద్ద‌రు పిల్ల‌లు.

2. మెరిన్ జోసెఫ్‌…
2012లో యూపీఎస్‌సీ ప‌రీక్ష పాసైన మెరిన్ జోసెఫ్ కేరళ క్యాడ‌ర్‌కు చెందిన యంగ్ ఆఫీస‌ర్‌గా గుర్తింపు తెచ్చుకుంది. ఆమె త‌న 25వ ఏట మొద‌టి అటెంప్ట్‌లోనే సివిల్స్ ప‌రీక్ష పాస‌వ‌డం గ‌మ‌నార్హం.

3. బి.చంద్ర‌క‌ళ‌…
2008 ఐఏఎస్ బ్యాచ్‌లోని యూపీ క్యాడ‌ర్‌కు చెందిన చంద్ర‌క‌ళ ప్ర‌స్తుతం ఉత్త‌ర ప్ర‌దేశ్ బులంద్‌షార్ జిల్లా క‌లెక్ట‌ర్‌గా విధులు నిర్వ‌హిస్తోంది. ఈమె హైద‌రాబాద్ కోఠి వుమెన్స్ కాలేజీలో బీఏ విద్య‌ను అభ్య‌సించింది.

4. సంయుక్త ప‌రాశ‌ర్‌…
2006 ఐపీఎస్ బ్యాచ్‌కు చెందిన సంయుక్త ప‌రాశ‌ర్ ప్ర‌స్తుతం సోనిత్‌పూర్ పోలీస్ ఎస్‌పీగా విధులు నిర్వ‌హిస్తోంది. ఈమె 1979 అక్టోబ‌ర్ 3న జ‌న్మించింది. కాగా అస్సాంకు చెందిన తొలి ఐపీఎస్ ఆఫీస‌ర్‌గా ఈమె గుర్తింపు పొందింది. అంతేకాదు అస్సాంలోని బోడో తీవ్ర వాదుల‌కు వ్య‌తిరేకంగా పోరాడిన వీర వనిత ఈమె.

5. రిజు బ‌ఫ్నా…
చ‌త్తీస్‌గ‌డ్‌లో 1998 సెప్టెంబ‌ర్‌లో జ‌న్మించిన రిజు బ‌ఫ్నా 2014లో ఐఏఎస్ ఆఫీస‌ర్‌గా నియామ‌క‌మైంది. ఈమె త‌న ప‌ట్ల అస‌భ్యంగా ప్ర‌వ‌ర్తిస్తూ, అశ్లీల మెసేజ్‌ల‌ను పంపుతున్న సంతోష్ చాబే అనే ఓ వ్య‌క్తిపై కేసు పెట్టి వార్త‌ల్లో వ్య‌క్తిగా నిలిచింది.

women-officers

6. స్తుతి చ‌రణ్‌…
2012లో జ‌రిగిన సివిల్స్ ప‌రీక్ష‌లో స్తుతి చ‌ర‌ణ్ 3వ ర్యాంక్‌ను సాధించింది. ఈమె జోధ్‌పూర్ యూనివ‌ర్సిటీలో బీఎస్‌సీ విద్య‌ను పూర్తి చేసింది. అనంత‌రం ఐఐపీఎంలో మార్కెటింగ్ మేనేజ్‌మెంట్ విద్య‌ను అభ్య‌సించింది. ఐఏఎస్ కాకముందు ఈమె కొద్ది రోజులు యూకో బ్యాంక్‌లో పీవోగా కూడా ప‌నిచేసింది.

7. రోష‌న్ జాకోబ్…
ఉత్తర‌ప్ర‌దేశ్‌లోని గొండా జిల్లా క‌లెక్ట‌ర్‌గా ప్ర‌స్తుతం విధులు నిర్వ‌హిస్తున్న రోష‌న్ జాకోబ్ కేర‌ళ‌లో 1978 డిసెంబ‌ర్ 25న జ‌న్మించింది. 2004 సివిల్స్ ప‌రీక్ష‌లో ఉత్తీర్ణురాలైంది.

8. మీరా బోర్వంక‌ర్‌…
పంజాబ్ రాష్ట్రంలోని ఫ‌జికా ప్రాంతానికి చెందిన మీరా బోర్వంక‌ర్ జ‌లంధ‌ర్‌లో గ్రాడ్యుయేష‌న్ విద్య‌ను పూర్తి చేసుకుంది. మ‌హారాష్ట్రకు చెందిన తొలి మ‌హిళా ఐపీఎస్ ఆఫీస‌ర్‌గా ఈమె రికార్డు సృష్టించింది.

9. కంచ‌న్ చౌద‌రి భ‌ట్టాచార్య‌…
డీజీపీ (డైరెక్ట‌ర్ జ‌న‌రల్ ఆఫీస‌ర్‌)గా నియామ‌క‌మైన తొలి ఐపీఎస్ అధికారిణిగా కంచ‌న్ చౌద‌రి రికార్డు సృష్టించింది. ఈమె 1973 నుంచి 2007 వ‌ర‌కు ఐపీఎస్ ఆఫీస‌ర్‌గా విధులు నిర్వ‌హించింది. వృత్తిలో ఈమె చూపిన తెగువ‌, అంకిత భావానికి గాను ప్రెసిడెంట్ మెడ‌ల్‌తోపాటు రాజీవ్ గాంధీ అవార్డును కూడా ఈమె సాధించింది.

10. విమ్లా మెహ్రా…
అరుణాచ‌ల్ ప్ర‌దేశ్, గోవా, మిజోరాం క్యాడ‌ర్‌కు చెందిన 1978 ఐపీఎస్ బ్యాచ్‌లోని పోలీస్ ఆఫీస‌ర్ ఈమె. విమ్లా మెహ్రా స్పెష‌ల్ క‌మిష‌న‌ర్ ఆఫ్ పోలిస్ బాధ్య‌త‌లు చేప‌ట్టి గుర్తింపు పొందింది. కిర‌ణ్ బేడీ త‌రువాత తీహార్ జైల్‌కు డైరెక్ట‌ర్ జ‌న‌ర‌ల్‌గా 2012లో నియాక‌మైన రెండో ఆఫీస‌ర్‌గా ఈమె పేరుగాంచింది.

Comments

comments

Share this post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

scroll to top