ఆ వ‌ర్గానికి చెందిన మ‌హిళ‌లను వారి భ‌ర్త‌లే వేశ్యావృత్తిలోకి దింపుతున్నారు… అత్యంత జుగుప్స‌ను క‌లిగించే విష‌య‌మిది…

దేశంలో మ‌హిళ‌ల భ‌ద్ర‌త రోజు రోజుకీ ప్ర‌శ్నార్థ‌క‌మ‌వుతుంద‌నే విషయం అంద‌రికీ తెలిసిందే. నిత్యం ఎంద‌రో మ‌హిళలు ఎన్నో సంద‌ర్భాల్లో ఎక్క‌డో ఓ చోట లైంగిక దాడుల‌కు, అత్యాచారాల‌కు, అస‌భ్య వేధింపుల‌కు గుర‌వుతూనే ఉన్నారు. అయిన‌ప్ప‌టికీ వారిపై జ‌రుగుతున్న అఘాయిత్యాలు ఆగ‌డం లేదు. వీట‌న్నింటికి తోడు మ‌హిళ‌లు వృత్తి పరంగా, స‌మాజ ప‌రంగా, వ‌ర్గం ప‌రంగా అనేక వివ‌క్ష‌ల‌కు, తీవ్ర‌మైన అణ‌చివేత‌ల‌కు కూడా లోన‌వుతున్నారు. దీంతో అధిక శాతం మంది మ‌హిళ‌లు నేటికీ ఆర్థిక స్వావ‌లంబ‌న సాధించ‌లేక ఎవ‌రో ఒక పురుషుడిపై ఆధార‌ప‌డి జీవించాల్సి వ‌స్తోంది. కానీ ఢిల్లీ శివారు ప్రాంతాల్లో ఉండే ఆ వ‌ర్గం మ‌హిళ‌లు మాత్రం అలా కాదు. అలా అని చెప్పి వారేదో ఉన్న‌త స్థానాల్లో గొప్ప ఉద్యోగాలు చేస్తున్నారంటే అదీ కాదు. వారిదో ద‌య‌నీయ గాథ‌. ద‌శాబ్దాల త‌ర‌బ‌డి వ‌స్తున్న త‌మ ప‌ద్ధ‌తుల ప్ర‌కారం త‌ప్ప‌నిస‌రి ప‌రిస్థితుల్లో శ‌రీరాన్ని అమ్ముకుని పొట్ట పోసుకోవాల్సిన ప‌రిస్థితి ఏర్ప‌డింది. అందులో ఇంకా విచారించ ద‌గిన విష‌యం ఏమిటంటే క‌ట్టుకున్న భ‌ర్త‌లే త‌మ భార్య‌ల‌ను ప‌డుపు వృత్తిలోకి దింప‌డం. అవును, ఆ వ‌ర్గానికి చెందిన ప్ర‌జ‌లు ఇంకా అలాంటి జుగుప్స క‌లిగించే సాంఘిక దురాచారాన్ని పాటించ‌డ‌మే కాదు, త‌మ మ‌హిళ‌ల బంగారు భ‌విష్య‌త్తును ఎందుకూ ప‌నికిరాకుండా చేస్తున్నారు. వారే ‘పేర్న’ అని పిల‌వ‌బ‌డే సామాజిక వ‌ర్గం ప్ర‌జ‌లు…

perna-woman

దేశ రాజ‌ధాని న‌గ‌రం ఢిల్లీకి కూత‌వేటు దూరంలో ఉండే శివారు ప్రాంతంలో పేర్న అనే సామాజిక వ‌ర్గానికి చెందిన ప్ర‌జ‌లు ఎన్నో ఏళ్లుగా నివాసం ఉంటున్నారు. వారి కుటుంబాల్లోని మ‌హిళ‌లు ఇప్ప‌టికీ వేశ్య‌లుగా మారి భ‌ర్త‌ను, పిల్ల‌ల‌ను పోషిస్తున్నారు. అలా ఎందుకూ అని అడిగితే అది త‌మ వ‌ర్గంలో ఎప్ప‌టి నుంచో వ‌స్తుంద‌ని వారు మొండిగా స‌మాధానం చెబుతున్నారు. కాగా ఆ మ‌హిళ‌లు రాత్రి పూట అలా ప‌నిచేసే క్ర‌మంలో ఒక్కో సారి పోలీసుల‌కు దొరుకుతారు కూడా. కానీ పోలీసులేమైనా వారికి న్యాయం చేస్తారా అంటే వారు భ‌క్ష‌క భ‌టులే. ఆ మ‌హిళ‌లు శ‌రీరాన్ని అమ్ముకోగా వ‌చ్చిన డ‌బ్బుల‌ను మొత్తాన్ని లాక్కుని అవ‌స‌ర‌మైతే వారితో గ‌డిపి అప్పుడు వారిని విడిచిపెడ‌తారు. ఇదంతా అక్క‌డ ష‌రా మామూలే. అయినా ఆ వ‌ర్గం మ‌హిళ‌ల‌ను గురించి ప‌ట్టించుకున్న వారు లేరు.

రాణి అనే ఓ మ‌హిళ పైన చెప్పిన పేర్న వ‌ర్గానికే చెందుతుంది. ఈమె నిత్యం రాత్రి పూట 2 గంట‌ల‌కు ఆ ప‌నికి వెళ్తుంది. ఉద‌యాన్నే 7 గంట‌ల‌కు ఇంటికి వచ్చి భ‌ర్త‌కు, పిల్ల‌ల‌కు వండి పెట్టి కొంత నిద్రించి మ‌ళ్లీ డ్యూటీ ఎక్కాల్సి ఉంటుంది. లేదంటే పూట గ‌డ‌వ‌దుగా. హోర్బాయ్ అనే మ‌రో మ‌హిళ ప‌రిస్థితి కూడా ఇంతే. ఇంకా చెప్పాలంటే ఇంత‌కంటే దారుణ‌మైన స్థితిలోనే ఆమె ఉంది. త‌నది పుట్టుక‌తో పేర్న వర్గం కాదు. కానీ త‌ల్లిదండ్రులు చిన్న‌ప్పుడే పోయిన కార‌ణంగా త‌ప్ప‌నిస‌రి ప‌రిస్థితుల్లో పేర్న వ‌ర్గానికి చెందిన ఓ యువ‌కున్ని పెళ్లాడింది. అనంత‌రం ఆమెకు ఇష్టం లేకున్న వేశ్యా వృత్తిలోకి దిగాల్సి వ‌చ్చింది. ఈ క్ర‌మంలో ఒక రోజు ఆమె భ‌ర్త కూడా చ‌నిపోయాడు. దీంతో ఆమె ప‌రిస్థితి మ‌రింత దిగ‌జారింది. ఇప్పుడు పొట్ట‌కూటి కోసం క‌చ్చితంగా వేశ్యావృత్తి చేయాల్సి వ‌స్తోంది. ఇవి ఆ ఇరువురు మ‌హిళ‌ల క‌థ‌లు. ఇలాంటి వారు ఆ ప్రాంతంలో ఇంకా ఎంతో మంది ఉన్నారు. కానీ ఇప్పుడు వారు కోరుకుంటోంది ఒక‌టే. త‌మ‌లా త‌మ పిల్ల‌లు కాకూడ‌ద‌ని. అవును, త‌మ బ‌తుకులు ఎలాగో బుగ్గిపాల‌య్యాయి, వారైనా స‌మాజంలో గౌర‌వంగా బ‌త‌కాల‌ని అక్క‌డి మ‌హిళ‌లు కోరుకుంటున్నారు. మ‌రి ఆ ద‌య‌నీయ జీవితాల్లో మార్పు ఎప్పుడు వ‌స్తుందో, ఆ దేవుడికే తెలియాలి.

Comments

comments

Share this post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

scroll to top