ఇండియన్ ఆర్మీలో విశేష సేవలు అందించిన ఈ 14 మంది మహిళా అధికారులు గురించి ఈ విషయాలు తెలుసా?

అవ‌కాశం ఇవ్వాలే గానీ తామూ త‌క్కువేం కాద‌ని నిరూపిస్తున్నారు నేటి త‌రం మ‌హిళ‌లు. అన్ని రంగాల్లోనూ వారు రాణిస్తున్నారు. ఈ క్ర‌మంలోనే ఆర్మీలో కూడా వారు త‌మ‌దైన శైలిలో స‌త్తా చాటుతున్నారు. ఆర్మీలో అన్ని విభాగాల్లో ప‌నిచేసే మ‌హిళా ఉద్యోగులు తామూ యుద్ధం వ‌స్తే శ‌త్రువుల‌తో పోరాడ‌గ‌ల‌మ‌ని నిరూపించుకుంటున్నారు. అలాంటి ప‌లువురు ఆర్మీ మ‌హిళా అధికారుల గురించే ఇప్పుడు తెలుసుకుందాం. వీరంతా త‌మ ప‌నికి గాను ఆర్మీలో విశేష గుర్తింపు పొందారు.

1. పునీతా అరోరా
ఉత్త‌రప్ర‌దేశ్‌లోని స‌హారాన్‌పూర్ వాసి ఈమె. ఈమె భార‌త ఆర్మీలో లెఫ్టినెంట్ జ‌న‌ర‌ల్ స్థాయి పొందిన మొద‌టి మ‌హిళా ఆర్మీ అధికారి. 2004లో ఆర్మ్‌డ్ ఫోర్సెస్ మెడిక‌ల్ కాలేజ్ క‌మాండెంట్‌గా చేసింది. త‌రువాత ఇండియ‌న్ నావీలో వైస్ అడ్మిర‌ల్ అయింది. Armed Forces Medical Services (AFMS) అడిష‌న‌ల్ డైరెక్ట‌ర్ జ‌న‌ర‌ల్‌గా ప‌నిచేసింది.

2. ప‌ద్మావ‌తీ బంధోపాధ్యాయ‌
ఈమె ఇండియ‌న్ ఎయిర్‌ఫోర్స్‌లో మొద‌టి మ‌హిళా ఎయిర్ మార్ష‌ల్‌గా గుర్తింపు పొందింది. 1978లో డిఫెన్స్ స‌ర్వీస్ స్టాఫ్ కాలేజ్ కోర్సు పూర్తి చేసింది. ఏవియేష‌న్ మెడిసిన్ స్పెష‌లిస్ట్‌గా, ఎయిర్ వైస్ మార్ష‌ల్‌గా ప‌నిచేసింది. 1971 ఇండో పాక్ ఉద్రిక్త‌తల్లో సేవ‌లందించినందుకు విశిష్ట్ సేవా మెడ‌ల్ అందుకుంది.

3. మిథాలీ మ‌ధుమిత‌
సేనా మెడ‌ల్ ఫ‌ర్ గ్యాలంట్రీ అందుకున్న మొద‌టి మ‌హిళా ఆర్మీ అధికారి ఈమె. లెఫ్టినెంట్ క‌ల్న‌ల్‌గా ప‌నిచేసింది. 2010లో సూసైడ్ బాంబ‌ర్ల అటాక్ నుంచి 19 మంది ఆర్మీ సిబ్బందిని ఈమె కాపాడింది. అప్ప‌ట్లో ఒక టీం మొత్తాన్ని ఈమె ప‌ర్య‌వేక్షించింది.

4. ప్రియా జింగాన్
1992లో ఇండియ‌న్ ఆర్మీలో చేరేందుకు రిజిస్ట‌ర్ చేసుకున్న మొద‌టి మ‌హిళ ఈమే. త‌రువాత ఆర్మీలో చేరి ఈమె అనేక సేవ‌లు చేశారు.

5. దివ్య అజిత్ కుమార్
ట్రెయినింగ్ అకాడ‌మీలో ఈమె 244 మంది ఫెలో క్యాడెట్ల‌ను ఓడించి మెడ‌ల్ పొందారు. దీంతో Sword of Honour అవార్డు ఈమెకు ల‌భించింది. దీంతో ఆమె ఆర్మీలో సేవ‌లందించారు. 2015 రిప‌బ్లిక్ డే ప‌రేడ్‌లో 154 మంది ఆర్మీ టీంను ఈమె లీడ్ చేశారు.

6. నివేత చౌద‌రి
ఎంటీ ఎవ‌రెస్ట్‌లో పాల్గొన్న మొద‌టి ఇండియ‌న్ మ‌హిళా పైల‌ట్‌గా ఈమె పేరుగాంచారు. ఈమె ఫ్లైట్ లెఫ్టినెంట్‌గా ప‌నిచేశారు. ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో సేవ‌లందించారు.

7. అంజ‌న బ‌డూరియా
ఇండియ‌న్ ఆర్మీలో గోల్డ్ మెడ‌ల్ పొందిన మొద‌టి మ‌హిళా అధికారి ఈమే. ఈమె ఆర్మీలో 10 ఏళ్లు ప‌నిచేశారు. ట్రెయినింగ్‌లో పురుష ఆఫీస‌ర్ల‌తో పోటీ ప‌డి ఈమె గోల్డ్ మెడ‌ల్ తెచ్చుకున్నారు.

8. ప్రియా సెమ్‌వాల్
ఈమె భ‌ర్త నాయ‌క్ అమిత శ‌ర్మ భార‌త ఆర్మీలో స‌రిహ‌ద్దుల్లో ప‌నిచేస్తుండ‌గా యుద్ధంలో మ‌ర‌ణించాడు. దీంతో ఆమె భ‌ర్త కోరిక మేర‌కు ఆర్మీలో చేరింది. 2012 నుంచి ఈమె ఆర్మీలో సేవ‌లందిస్తోంది.

9. దీపికా మిశ్రా
హెలికాప్ట‌ర్ ఎరోబాటిక్ టీంను ట్రెయిన్ చేసిన మొద‌టి మ‌హిళా ఎయిర్ ఫోర్స్ ఆఫీస‌ర్ గా ఈమె పేరుగాంచారు. త‌రువాత అనేక టీంల‌కు ఈమె సార‌థ్యం వ‌హించి ఇండియ‌న్ ఎయిర్‌ఫోర్స్‌లో సేవ‌లందించారు.

10. సోఫియా ఖురేషీ
2016లో ASEAN Plus multinational field training exercise లో ఈమె ఇండియ‌న్ ఆర్మీ టీంను లీడ్ చేశారు. అందుకు గాను ఈమె చ‌రిత్ర సృష్టించారు. ఈ ఘ‌న‌త సాధించిన ఏకైక మ‌హిళా ఆఫీస‌ర్ గా పేరు గాంచారు.

11. స్వాతి సింగ్
ఇండియ‌న్ ఆర్మీలో నాథు లా పాస్ వ‌ద్ద అత్యంత క్లిష్ట‌మైన ప్రాంతంలో 63వ బ్రిగేడ్ కెప్టెన్‌గా ఈమె సేవ‌లందించారు. అది చాలా క‌ఠిన‌మైన ప‌ని. ఆ టీంలో ఈమె ఒక్క‌రే లేడీ ఆఫీస‌ర్‌. అయినా ధైర్యంతో త‌న‌కు ఇచ్చిన బాధ్య‌త‌లను నిర్వ‌ర్తించారు.

12. శాంతి టిగ్గా
ఇండియ‌న్ ఆర్మీలో ఈమె మొద‌టి మ‌హిళా జ‌వాన్‌గా పేరుగాంచారు. ఈ ఘ‌న‌త‌ను ఆమె 35 సంవ‌త్స‌రాల వ‌య‌స్సులో సాధించ‌డం విశేషం. 12 సెకండ్ల‌లోనే 50 మీట‌ర్ల ర‌న్ పూర్తి చేశారు. అప్పటికి ఈమెకు ఇద్ద‌రు పిల్ల‌లు. అయినా ఆర్మీలో అన్ని టెస్ట్ లు పాసై జ‌వాన్ అయ్యారు. అందులో సేవ‌లందిస్తున్నారు.

13. గ‌నేవ్ లాల్జీ
ఆర్మీ క‌మాండ‌ర్ కీ ఎయిడ్‌గా నియ‌మింప‌బ‌డిన మొద‌టి మ‌హిళా ఆర్మీ ఆఫీస‌ర్ గా ఈమె పేరు గాంచారు. ట్రెయినింగ్‌లో ఉండ‌గానే ప‌లు రికార్డుల‌ను ఈమె తిర‌గ‌రాశారు.

14. గుంజ‌న్ స‌క్సేనా
కార్గిల్ యుద్ధంలో ఫ్లైట్ న‌డిపిన మొద‌టి మ‌హిళా ఎయిర్‌ఫోర్స్ ఆఫీస‌ర్ గా ఈమె పేరుగాంచారు. అంతేకాదు, ఆ స‌మ‌యంలో ఈమె లెక్క‌కు మించిన హెలికాప్ట‌ర్ల‌ను న‌డిపి రికార్డు సృష్టించారు. యుద్ధం స‌మ‌యంలో ఆర్మీలో విశిష్ట‌మైన సేవ‌లు అందించారు. శౌర్య వీర్ అవార్డును పొందారు. గ్యాలంట్రీ అవార్డు కూడా ఈమెకు ల‌భించింది.

Comments

comments

Share this post

scroll to top