న‌గ‌దు కోసం బారులు తీరిన వారి దాహార్తి, ఆక‌లి తీరుస్తున్న స్వ‌చ్ఛంద సేవ‌కులు..!

నోట్ల ర‌ద్దు ప్ర‌క‌ట‌న త‌రువాత గ‌త కొన్ని రోజుల నుంచి జనాలు బ్యాంకులు, పోస్టాఫీసులు, ఏటీఎంల వ‌ద్ద ఎలా బారులు తీరుతున్నారో మ‌నం చూస్తూనే ఉన్నాం. న‌గ‌దు డిపాజిట్‌, నోట్ల మార్పిడి, విత్ డ్రా వంటి ప‌నుల కోసం పెద్ద పెద్ద క్యూలైన్ల‌లో నిలుచుని మ‌రీ ఆయా ప‌నులు చేసుకుంటున్నారు. ఎన్ని ప‌నులు ఉన్నా మానుకుని ముందు న‌గ‌దు తీసుకోవాల‌ని చెప్పి ఏటీఎం ల వ‌ద్ద బారులు తీరుతున్నారు. ఈ క్ర‌మంలో చాలా సేపు లైన్ల‌లో నిలుచుంటూ ఉండ‌డం వ‌ల్ల అనేక మంది జ‌నాలు అస‌హ‌నానికి లోన‌వుతున్నారు. ఇంకొందరైతే అనారోగ్యాల కార‌ణంగా లైన్ల‌లో నిల‌బ‌డలేక అవ‌స్థ ప‌డుతున్నారు. అయితే అలాంటి జ‌నాల ఇబ్బందుల‌ను కొంత వ‌ర‌కు తీర్చ‌డం కోసం దేశ వ్యాప్తంగా ఆయా రాష్ట్రాల్లో ప‌లువురు ముందుకు వ‌చ్చి వాలంటీర్లుగా సేవ‌లందిస్తున్నారు.

service-to-people-1
బ్యాంకులు, ఏటీఎంల వ‌ద్ద పెద్ద ఎత్తున లైన్ల‌లో నిల‌బ‌డి వేచి చూస్తున్న ప్ర‌జ‌ల ఆక‌లి, దాహార్తిని తీర్చేందుకు సిఖ్ వ‌ర్గీయులు త‌మ వంతు ప్ర‌య‌త్నంగా టీ, తినుబండారాలు అందిస్తున్నారు. పంజాబ్‌లో ఇప్పుడు ఎక్క‌డ చూసినా బ్యాంకులు, ఏటీఎంల వ‌ద్ద బారులు తీరిన జ‌నాల‌కు సిఖ్ వ‌ర్గం వారు ఆహార పానీయాల‌ను అందిస్తూ సేవ చేస్తున్నారు. అక్క‌డ స్థానికంగా ఉండే యువ‌త ఇలాంటి సేవా కార్య‌క్ర‌మాల్లో ఎక్కువ‌గా పాలు పంచుకుంటున్నారు. ఇప్పుడు వారి ఫొటోలు సోష‌ల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇక గురుద్వారాల వ‌ద్దనైతే చిన్న నోట్లను విరాళాల రూపంలో సేక‌రిస్తూ వాటిని అవ‌స‌రం ఉన్న వారికి అందిస్తున్నారు.

service-to-people-2
కేవ‌లం పంజాబ్‌లోనే కాదు దేశ వ్యాప్తంగా ఉన్న ప‌లు రాష్ట్రాల్లో ఇలాంటి స్వ‌చ్ఛంద వాలంటీర్ల సేవ‌లు జ‌నాల‌కు అందుతున్నాయి. త‌మిళ‌నాడు, అస్సాంల‌లో రిటైరైన బ్యాంక్ ఉద్యోగులు జ‌నాల‌కు స‌హాయం చేస్తుండ‌గా, ప‌లు ప్రైవేటు కంపెనీల ఉద్యోగులు ముందుకు వ‌చ్చి టీ, బిస్క‌ట్ల‌ను, తాగునీటిని ఉచితంగా అందిస్తున్నారు. పెప్సీ కంపెనీ అయితే కొన్ని బ్యాంకులు, ఏటీఎంల వ‌ద్ద జ‌నాల దాహార్తిని తీర్చేందుకు 7 అప్, ఇత‌ర రిఫ్రెష్‌మెంట్ డ్రింక్స్‌ను ఉచితంగా స‌ర‌ఫ‌రా చేస్తోంది. హాస్పిట‌ల్స్‌, మందుల దుకాణాల్లో పాత నోట్లు తీసుకోవాల‌ని చెప్పినా చాలా మంది ప్ర‌భుత్వ ఆదేశాలను పాటించ‌డం లేదు. కానీ జార్ఖండ్‌లోని ప‌లు ప్రైవేటు హాస్పిట‌ల్స్‌కు చెందిన వైద్యులు పాత నోట్లు కాదు క‌దా, వైద్యం చేసినందుకు అస‌లు ఎలాంటి ఫీజును తీసుకోవ‌డం లేదు. అన్నీ ఉచితంగానే చేస్తున్నారు. యూపీ, గుజ‌రాత్‌ల‌లో పోలీసులు పెద్ద ఎత్తున ప్ర‌జ‌ల‌కు సేవ‌లనందిస్తున్నారు. తాగునీటిని, మిన‌ర‌ల్ వాట‌ర్ బాటిల్స్‌ను అందిస్తూ ప్ర‌జ‌ల దాహార్తిని తీరుస్తున్నారు. ఏది ఏమైనా ఆయా రాష్ట్ర ప్ర‌భుత్వాలు కూడా ఇలాంటి సేవా కార్య‌క్ర‌మాలను నిర్వ‌హిస్తే దాంతో ప్ర‌జ‌ల‌కు ఇంకా  సౌక‌ర్య‌వంతంగా ఉంటుంది క‌దా. దాని వ‌ల్ల కొంత‌లో కొంతైనా వారికి ఇబ్బందులు త‌ప్పి ఉసూరుమ‌నే ప్రాణాల‌కు కొంత ఉత్తేజం క‌లుగుతుంది..!

Comments

comments

Share this post

scroll to top