ప్ర‌మాద‌క‌ర‌మైన సాహ‌స కృత్యాలు చేశారు వీళ్లు. ఆపై తిరిగిరాని లోకాల‌కు వెళ్లారు. రియ‌ల్ వీడియోలు..!

ఎల్ల‌ప్పుడూ ఏదో ఒక అడ్వెంచ‌ర్ చేయ‌డం, సాహ‌స కృత్యాల్లో మునిగి తేల‌డం అంటే కొంద‌రికి చాలా ఇష్టం. వాటిలోనే కొంద‌రు ఎంజాయ్‌మెంట్ వెతుక్కుంటారు. అయితే ఇంత వ‌ర‌కు ఓకే. కానీ వాటిని చేయ‌డంలో జాగ్ర‌త్త‌లు త‌ప్ప‌నిస‌రిగా తీసుకోవాలి. నిపుణులైన పర్య‌వేక్ష‌ణ‌లోనే అలాంటి సాహ‌స‌వంత‌మైన ప‌నులు చేయాలి. లేదంటే మొద‌టికే మోసం వ‌స్తుంది. అలాంటి ప‌నులు తేడా కొడితే ప్రాణాలే ప్ర‌మాదంలో ప‌డ‌తాయి. ఈ క్ర‌మంలో కొంద‌రు ప్రాణాల‌ను పోగొట్టుకున్న‌వారు ఉన్నారు కూడా. ఇంత‌కీ ఇప్పుడీ విష‌యమంతా ఎందుకంటే…

పైన ఇచ్చిన నాలుగు వీడియోల‌ను చూశారు క‌దా. అవును, అవే. అయితే అవి ఏదైనా షూటింగ్ కోస‌మో తీసిన‌వి కావు. నిజంగా జ‌రిగిన‌వే. ఆ వీడియోల్లో ఉన్న సాహ‌స కృత్యాలు చేసిన వారు మృతి చెందారు. అవును, అంత‌టి డేంజ‌ర‌స్ ప‌నులు చేశారు, అందులోనూ ఎలాంటి జాగ్ర‌త్త‌లు తీసుకోలేదు. క‌నుక మృత్యువు ఒడికి చేరారు. ప్ర‌స్తుతం ఈ వీడియోలు నెట్‌లో హ‌ల్ చ‌ల్ చేస్తున్నాయి. ట్రెయిన్‌కు ఎదురు వెళ్లిన కొంద‌రు యువ‌కుల్లో ఒక యువ‌కుడు ట్రెయిన్ ప‌క్క‌గా నిలుచున్నాడు. దీంతో ఆ ట్రెయిన్‌కు త‌గులుకుని అత‌ను కొంత దూరం లాక్కెళ్లిపోయాడు. అలా అత‌ను మృతి చెందాడు. ఇక రెండో వీడియోలో త‌ల‌కిందులుగా బీర్ తాగుదామ‌నుకుని ఓ వ్య‌క్తి ట్రై చేసి, అక్క‌డిక‌క్క‌డే స్పృహ కోల్పోవ‌డం చూడ‌వ‌చ్చు. మూడో వీడియోలో ఎత్త‌యిన ఓ ప్ర‌దేశం అంచున న‌డిచి ఓ వ్య‌క్తి కింద‌కు లోయలోకి ప‌డిపోయాడు. నాలుగ‌వ వీడియోలో కొండ‌పైకి ఎక్కుతున్న వ్య‌క్తి స్లిప్ అయి ప‌డిపోవ‌డాన్ని చూడ‌వ‌చ్చు.

ఇవే కాదు, ఇంకా ఇలాంటి సాహ‌స కృత్యాల‌ను చేసేవారు చాలా మందే ఉంటారు. క‌నుక వారు కూడా ఇలాంటి ప‌నులు చేసేట‌ప్పుడు ఒక‌సారి పున‌రాలోచించుకోవ‌డం మంచిది. చుట్టూ ఉన్న‌వారు ఉత్సాహ ప‌రిచార‌నో, ఎవ‌రైనా ఏదైనా అన్నారనో, దుందుడుకుత‌నంతోనే ఇలాంటి ప‌నులు చేస్తే ఇక ఆపై అది బెడిసి కొడితే ప‌ర‌లోకానికి ప‌లాయం చిత్త‌గించాల్సిందే. ఆ త‌రువాత క‌న్న‌వారికి, కుటుంబ స‌భ్యుల‌కు శోకం త‌ప్ప‌దు. క‌నుక మీరు గానీ, మీకు తెలిసిన వారు గానీ అలా ఎవ‌రైనా ఉంటే ఈ వీడియోల‌ను వారికి షేర్ చేయండి. అలా అయినా అలాంటి ప‌నులు మానుకుంటారు..!

Comments

comments

Share this post

scroll to top