సిగ‌రెట్ పీక‌ల‌తో కోట్ల రూపాయ‌ల‌ను గ‌డిస్తున్నారు ఆ ఇద్ద‌రు యువ‌కులు..!

సిగ‌రెట్ తాగితే ఏం వ‌స్తుంది..? ఏం వ‌స్తుంది… మొద‌ట పొగ, ఆ త‌రువాత అనారోగ్యం… ఒక‌దాని వెంట ఒక‌టి వ‌చ్చేస్తాయి. మ‌రి సిగ‌రెట్ తాగాక చివ‌ర‌కు ఏం మిగులుతుంది..? ఏముంటుంది… దాని పీక ఉంటుంది… ఎలాగూ ధూమ‌పాన ప్రియులు దాన్ని కాలి కిందేసి న‌ల్లిని న‌లిపిన‌ట్టు న‌లుపుతారు క‌దా..! ఇంకేం స‌మ‌స్య‌..! అంటారా..! అయితే… నిజంగా చెప్పాలంటే వాటితోనే స‌మ‌స్య‌. అవును, మీరు విన్న‌ది క‌రెక్టే. ఎందుకంటే సిగ‌రెట్ పీక‌ల్లో సెల్యులోజ్ ఎసిటేట్ అనే నాన్ బయోడీగ్రేడబుల్‌ ప్లాస్టిక్‌ ఫిల్టర్ ఉంటుంది. ఈ క్ర‌మంలో సిగరెట్ తాగాక కింద ప‌డేసే ఆ పీక‌లో ఉండే ఆ ర‌సాయనం వ‌ల్ల ప‌ర్యావ‌ర‌ణానికి పెద్ద హాని క‌లుగుతుంద‌ట‌. అవును, మేం చెబుతోంది నిజ‌మే..! దీన్ని ఇద్ద‌రు విద్యార్థులు గుర్తించారు కూడా..! మ‌రి గుర్తిస్తే… ఆ సిగ‌రెట్ పీక‌ల‌ను వారు ఏం చేస్తున్నారో తెలుసా..? వాటితో కోట్లు గ‌డిస్తున్నారు..! షాకింగ్‌గా ఉన్నా ఇది నిజ‌మే..!

cigarette-recyle-1

వారి పేర్లు విషాల్‌కాంత్, నమన్ గుప్త. ఉంటోంది గుర్గావ్‌లో. వీరిద్ద‌రూ బెంగుళూరులో జ‌రిగిన ఓ పార్టీకి వెళ్లారు. అక్క‌డ గెస్ట్‌లు తాగి ప‌డేసిన కొన్ని వంద‌ల సిగ‌రెట్ పీక‌ల‌ను చూశారు. దీంతో వారు షాక్‌కు గురయ్యారు. ఒక పార్టీలోనే అలా ఉంటే ఇక మొత్తం బెంగుళూరు సిటీలో..? మ‌రి దేశంలో..? రోజూ అలాంటివి ఎన్ని సిగ‌రెట్ పీక‌లు భూమిలో క‌లుస్తాయి..? స‌రిగ్గా ఇదే ఆలోచించారు వారిద్ద‌రూ. ఈ క్ర‌మంలోనే ఆ సిగ‌రెట్ పీక‌లను రీసైకిల్ చేసే కొత్త విధానాన్ని క‌నుగొన్నారు. అందుకు గాను వారు త‌మ విధానాన్ని ఒక స్టార్ట‌ప్ రూపంలో అందుబాటులోకి తెచ్చారు. దానికి కోడ్ అనే పేరు పెట్టారు. దీని స‌హాయంతో సిగ‌రెట్ పీక‌ల‌ను రీసైకిల్ చేసే కంపెనీ ప్రారంభించారు. అయితే మ‌రి వారి వ‌ద్ద‌కు సిగ‌రెట్ పీక‌లు ఎలా వ‌స్తాయి..? అనే దాని గురించి కూడా వారు ఆలోచించారు. అందుకు వారు కార్య రూపం ఇచ్చారు. పాన్ షాపులు, బ‌హిరంగ ప్రదేశాలు, ఇత‌ర ప్రాంతాల‌లో నిత్యం పేరుకుపోయే సిగ‌రెట్ పీక‌ల‌ను సేక‌రించి త‌మ‌కు అప్ప‌గించిన వారికి డ‌బ్బులు ఇవ్వ‌డం మొద‌లు పెట్టారు. కేజీ సిగ‌రెట్ పీక‌ల‌కు రూ.700 వ‌ర‌కు ఇవ్వ‌డం మొద‌లు పెట్టారు. దీంతో ఈ విష‌యం తెలుసుకున్న‌వారు పెద్ద ఎత్తున సిగ‌రెట్ పీక‌ల‌ను వారికి తెచ్చి ఇవ్వ‌డం మొద‌లు పెట్టారు.

code-enterprises

అయితే అలా సేక‌రించే వారే కాదు, పాన్ షాపులు, ఇత‌ర దుకాణాల య‌జ‌మానులు కూడా త‌మ షాప్‌ల ఎదుట విబిన్‌ల పేరిట  డ‌బ్బాలు పెట్టి మ‌రీ అలా సిగ‌రెట్ పీక‌ల‌ను సేక‌రించి విషాల్‌కాంత్, నమన్ గుప్త లకు చెందిన కోడ్ కంపెనీకి ఇస్తున్నారు. దీంతో వారికి అలా ఆదాయం కూడా వ‌స్తోంది. ఈ క్ర‌మంలో సిగ‌రెట్‌ల‌ను స్వ‌యంగా కాల్చేవారు కూడా వాటిని ఎక్క‌డ ప‌డితే అక్క‌డ ప‌డేయ‌కుండా వాటిని సేక‌రించి మ‌రీ అలా వాటిని ఇచ్చి డ‌బ్బులు తీసుకుంటున్నారు. దీంతో సిగ‌రెట్లు భూమిలో క‌లిసే అవ‌కాశం లేనందున విషాల్‌కాంత్, నమన్ గుప్త ల ప్రయోగం సక్సెస్ అయింది. అయితే అలా వీరిద్ద‌రు త‌మ వ‌ద్ద‌కు వ‌చ్చిన సిగ‌రెట్ల‌ను రీసైకిల్ చేస్తుండ‌డంతో వారికి ఇప్పుడు కోట్ల‌లో ఆదాయం వ‌స్తోంది..! అవును మ‌రి… ఆలోచించాలే గానీ… ప్ర‌తి ఆలోచ‌న‌కు అలా కోట్ల రూపాయ‌ల‌ను ఆర్జించ‌వ‌చ్చు..!

Comments

comments

Share this post

scroll to top