ఈ ప్రేమ జంట వివాహానికి అయిన ఖ‌ర్చు ఎంతో తెలిస్తే షాక‌వుతారు..!

మ‌న దేశంలో వివాహం అంటేనే ఖ‌ర్చుతో కూడుకున్న ప‌ని. ఎలాంటి స్థాయిలో ఉన్న వ్య‌క్తులైనా త‌మ తాహ‌తుకు త‌గిన‌ట్టుగా డ‌బ్బు ఖ‌ర్చు పెట్టి అంగ‌రంగ వైభ‌వంగా పెళ్లి చేసుకోవాల‌ని చూస్తారు. అందుకు ఏ వ‌ర్గం వారు మిన‌హాయింపు కాదు. కానీ ఆ జంట మాత్రం ఇందుకు పూర్తిగా భిన్నం. చాలా సాదా సీదా వారు వివాహం చేసుకున్నారు. నిజానికి వారిది ల‌వ్ మ్యారేజ్‌. మొద‌ట త‌ల్లిదండ్రులు ఒప్పుకోరు కాబోలు అని దిగులు చెందారు. కానీ ఇరు ప‌క్షాల వారు ఎలాంటి అభ్యంత‌రం చెప్ప‌క‌పోవడంతో ఆ ప్రేమ జంట ఒక్క‌టైంది. అది కూడా చాలా చాలా త‌క్కువ ఖర్చుతోనే. ఇంత‌కీ ఆ జంట త‌మ పెళ్లికి ఖ‌ర్చు పెట్టిన డ‌బ్బు ఎంతో తెలుసా..? తెలిస్తే మీరు షాక‌వుతారు.

ఆమె పేరు న‌బిజాదా ఫ‌రీస్తా. ఆఫ్ఘ‌నిస్తాన్ దేశ‌ వాసి. అక్క‌డి కాబూల్‌లో నివాసం ఉంటోంది. ఆమె మ‌న దేశంలోని పంజాబ్ రాష్ట్రంలో ఉన్న నాభా అనే ప్రాంతానికి ప‌ని నిమిత్తం వ‌చ్చింది. అందులో భాగంగా నాభాలో నివాసం ఉండే జ‌హీద్ అలీ అనే వ్య‌క్తితో ప‌రిచ‌యం అయింది. అది కాస్తా స్నేహంగా మారి అనంత‌రం అది వారిద్ద‌రి మ‌ధ్య ప్రేమ‌కు దారి తీసింది. ఈ క్రమంలోనే ఫ‌రీస్తా, జ‌హీద్‌లు ఇద్ద‌రూ పెళ్లి చేసుకోవాల‌ని అనుకున్నారు.

అయితే ఇద్ద‌రూ ముస్లింలే అయిన‌ప్ప‌టికీ దేశాలు వేరు. దీంతో త‌ల్లిదండ్రులు ఒప్పుకుంటారా..? అన్న సందేహం ఇద్ద‌రికీ క‌లిగింది. ఈ క్ర‌మంలోనే ఫ‌రీస్తా తాను ప్రేమించిన జ‌హీద్‌ను పెళ్లి చేసుకుంటాన‌ని కోరుతూ త‌ల్లిదండ్రుల అనుమ‌తి కోసం ఆఫ్ఘ‌నిస్తాన్‌లో ఉన్న వారికి ఉత్త‌రం రాసింది. అయితే ఆశ్చ‌ర్యంగా పెళ్లికి వారు ఒప్పుకున్నారు. ఇక ఇటు జ‌హీద్ త‌ల్లిదండ్రులు కూడా పెళ్లికి అడ్డు చెప్ప‌లేదు. దీంతో ఇద్ద‌రి పెళ్లికి లైన్ క్లియ‌ర్ అయింది. ఈ క్ర‌మంలోనే వారు చాలా నిరాడంబ‌రంగా వివాహం చేసుకున్నారు. రిజిస్ట్రార్ ఆఫీస్‌లో వారి వివాహం జ‌రిగింది. అందుకు గాను వారికి కేవ‌లం రూ.11 మాత్ర‌మే ఖ‌ర్చ‌యింది. అది కూడా క్ల‌ర్క్ ఫీజు కోసం ఇచ్చారు. ఈ క్ర‌మంలోనే ఫ‌రీస్తా, జ‌హీద్ కుటుంబ స‌భ్యులు త‌మ పిల్ల‌లు అంత సాదా సీదాగా పెళ్లి చేసుకున్నందుకు చాలా ఆనందంగా ఫీల‌వుతున్నారు. అవును మ‌రి, ఇలాంటి వారే క‌దా అంద‌రికీ ఆద‌ర్శంగా నిలిచేది..!

Comments

comments

Share this post

scroll to top