గ్రాండ్ గా చేయాలనుకున్న కూతురి పెళ్లిని మాములుగా చేసి, ఆ డబ్బులను రైతులకిచ్చాడు.

కన్న కూతురి పెళ్లి గ్రాండ్ గా చేయడం కంటే , అన్నం పెట్టే రైతన్న ఆకలితో అలమటించకుండా చూడడమే ఉత్తమం అనుకున్నాడు ఓ ఇంజనీర్.  అనుకున్నదే తడవుగా తన కూతరు పెళ్లికి ఖర్చు చేయాలనుకున్న డబ్బును రైతులకు పంచాడు వివేక్ వద్కే. మహారాష్ట్రలోని థానే కు చెందిన వివేక్ వద్కే కెమికల్ ఇంజనీర్. తన ఒక్కాగానొక్క కూతురి పెళ్లి గ్రాండ్ గా చేయాలనుకున్నాడు. కానీ ఒక్కసారిగా అతనికి వాళ్ల ప్రాంతంలోని రైతులు  బాధ గుర్తుకువచ్చింది. తన కూతురి పెళ్లి గ్రాండ్ గా చేయకపోయిన పర్వాలేదు. కానీ ఈ సంధర్భంగానైనా నేను కొంత మంది రైతులను ఆదుకోవాలని అనుకున్నాడు. అదే విషయాన్ని కూతురికి, కాబోయే అల్లుడికి చెప్పాడు. వాళ్లు కూడా ఓకే అన్నారు.

దీంతో కూతురి పెళ్లి ఖర్చులకు ఉంచిన డబ్బుల్లోంచి 6 లక్షల తీసి,  దానికి ఇంకొంత డబ్బును  ఫండ్ గా కలెక్ట్ చేసి, ఆ గ్రామంలోని పేద రైతులకు పంచాడు. మరీ ఆడంబరాలకు పోకుండా  పరిమితమైన ఖర్చుతో  తన కూతురి పెళ్లి చేశాడు వివేక్ వద్కే.

Family-750x500

 వివేక్ లాగా రైతుల కోసం నేను సైతం అని కదిలిన మరో వ్యక్తి బిమన్. రైతులు ఎదుర్కుంటున్న సమస్యలు చూసి తన నెల జీతంలో 40% రైతులకు అందిస్తున్నాడు రైల్వేలో సీనియర్ సెక్షన్ ఇంజినీర్ అయిన బిమన్ బిస్వాస్. రైతులు కరువు కాటకాలు వచ్చినప్పుడు, వారి పరిస్థితి చూసి చలించిన బిమన్, మొదట్లో ఇద్దరు రైతులను ఆదుకునేవాడు. ప్రస్తుతం తనకు వచ్చే జీతంలో 40% అమౌంట్ తో 10 మంది రైతులకు అండగా నిలబడుతున్నాడు.  రైతు మరణాలను ఆపడానికి మేము చేస్తున్నది చిన్న సాయమే అని చాలా పెద్ద  మనసుతో చెబుతున్నారు ఈ ఆదర్శమూర్తులు. ఇద్దరికీ అభినందనలు.

Comments

comments

Share this post

scroll to top