మీ అర‌చేతుల్లో ఉండే ‘హృద‌య రేఖ‌లు’ ఏం చెబుతున్నాయో తెలుసా..?

చేతి వేళ్ల రేఖ‌ల‌ను బ‌ట్టి ఆయా వ్య‌క్తుల జాత‌కాల‌ను చెప్పే హ‌స్త సాముద్రికం గురించి మీరు వినే ఉంటారు. అందులో వివ‌రించబడిన ప‌లు రేఖ‌ల ప్ర‌కారం మ‌నుషుల చేతుల్లో ఆ రేఖ‌లు ద‌ర్శ‌న‌మిస్తే వారి జీవితం ఎలా ఉండిందో, ఎలా ఉండ‌బోతుందో చెప్పే పండితులు ఉన్నారు. అయితే వారు ఎంతో జాగ్ర‌త్త‌గా ప‌రిశీలించి మ‌రీ చేతి రేఖ‌ల గురించిన అస‌లు విష‌యాల‌ను ఎవ‌రికీ వెల్ల‌డించ‌రు. కాక‌పోతే కొన్ని రేఖ‌లు దాదాపు అంద‌రిలోనూ ఉంటాయి కాబ‌ట్టి వాటికి సంబంధించిన వివ‌రాల‌ను హ‌స్త సాముద్రికంలో చూచాయ‌గా వివ‌రించారు. అంటే ప్ర‌త్యేక‌మైన రేఖ‌లు కాకుండా ఆ శాస్త్రంలో చెప్పే సాధార‌ణ రేఖ‌లు ఉన్న‌వారికి కామ‌న్‌గా ఏం జ‌రుగుతుందో చెప్తారు. అలాంటి సాధార‌ణ రేఖ‌ల్లో చిటికెన వేలు కింద వ‌చ్చే (చిత్రంలో చూపింది) ‘హృద‌య రేఖ’ కూడా ఒక‌టి. దీన్నే ‘లైన్ ఆఫ్ హార్ట్’ అని కూడా పిలుస్తారు. ఈ రేఖ వల్ల ఆయా వ్య‌క్తుల‌కు ఎలాంటి ఫ‌లితాలు క‌లుగుతాయో ఇప్పుడు చూద్దాం.

line-of-heart

మ‌న అర‌చేతుల్లో ఉండే హృద‌య రేఖ మ‌న‌కు ఉన్న భావాల‌ను, శారీర‌క, మాన‌సిక సంబంధ‌, బాంధ‌వ్యాల గురించి తెలియ‌జేస్తుంది. ఇది రెండు చేతుల్లోనూ ఉంటుంది. అయితే కొంద‌రిలో ఈ రేఖ‌లు మధ్య‌లో ఎలాంటి అడ్డు లేకుండా నిటారుగా ఉంటాయి. మ‌రి కొంద‌రిలో ఈ రేఖలు వంక‌ర టింక‌ర‌గా, ఒక‌టిగా ఎక్కువ‌గా, మ‌రొక‌టి త‌క్కువ‌గా, మ‌ధ్య‌లో ఆగుతూ ఉంటాయి. అయితే చిత్రంలో చూపిన విధంగా రెండు హృద‌య రేఖ‌లు క‌లిసి ఒక స్ట్రెయిట్ లైన్ (స‌ర‌ళ రేఖ‌)లా ఏర్ప‌డితే వారు బాగా ప్ర‌శాంత‌మైన మ‌న‌స్త‌త్వం క‌లిగి ఉంటార‌ట‌. చాలా మృదు స్వ‌భావులుగా ఉంటార‌ట‌. వారి జీవితం ఎల్ల‌ప్పుడూ ప్ర‌శాంతంగానే సాగుతుంద‌ట‌. కానీ కొంద‌రి వ‌ల్ల అనుకోని ఆటంకాలు క‌లుగుతాయ‌ట‌. ఇలాంటి వారు ఎక్కువ‌గా పెద్ద‌లు కుదిర్చిన వివాహాల‌నే చేసుకుంటార‌ట‌.

రెండు చేతులు క‌లిపిన‌ప్పుడు హృద‌య రేఖ‌లు స‌రిగా క‌ల‌వ‌క‌పోయినా, ఒక‌టి ఎక్కువ‌గా, మ‌రొక‌టి త‌క్కువ‌గా ఉన్నా, మ‌ధ్య‌లో ఆగిపోయినా అలాంటి వారు పెద్ద‌ల ప‌ట్ల గౌర‌వం క‌లిగి ఉంటార‌ట‌. వీరు తెలివిమంతులుగా స‌మాజంలో గుర్తించ‌బ‌డుతార‌ట‌. ఇలాంటి వారు వివాహం చేసుకుంటే త‌మ కంటే ఎక్కువ వ‌య‌స్సు ఉన్న‌వారికే ప్రాధాన్య‌త‌ను ఇస్తార‌ట‌.

హృద‌య రేఖ‌లు రెండూ సెమి స‌ర్కిల్ (అర్థ వృత్తం) లేదా సగం చంద‌మామ ఆకారంలో ఏర్ప‌డితే అలాంటి వారు దృఢ‌మైన చిత్తం క‌లిగి ఉంటార‌ట‌. వారి మ‌న‌స్సు బాగా దృఢంగా ఉంటుంద‌ట‌. స్వ‌తంత్ర భావాల‌ను క‌లిగి ఉంటార‌ట‌. ఇలాంటి వారు ప్రేమ వివాహాల వైపు మొగ్గు చూపుతార‌ట‌. త‌మ స‌హజ స్వ‌భావాన్ని చాటుకునేలా న‌లుగురితో ప్ర‌వ‌ర్తిస్తార‌ట‌.

Comments

comments

Share this post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

scroll to top