నదికి ఇటువైపు ఇతను, అటువైపు అతను….రియల్ స్టోరి ఇన్ బోర్డర్.

చూడ చ‌క్క‌ని ప్ర‌కృతి అందాల మ‌ధ్య కొలువు దీరింది ఆ కొండ ప్రాంతం. సాయంత్రం అవుతుండ‌డంతో ఏట‌వాలుగా ప‌డుతున్న సూర్య‌కిర‌ణాలకు అక్క‌డి న‌దీ ప్ర‌వాహం మరింత ప్ర‌కృతి ర‌మ‌ణీయ‌త‌ను సంత‌రించుకుంది. కొండ వంపు నుంచి కింద‌కు ప్ర‌వ‌హిస్తూ న‌దిగా మారిన ఆ నీటి చ‌ప్పుళ్లు ఆహ్లాద‌క‌ర‌మైన వాతావ‌ర‌ణాన్ని ఇంకా ఎక్కువ ఉత్తేజంగా మార్చాయి. అప్పుడే ఓ బాలుడు ఆ న‌దికి ఓ వైపుగా ఉన్న‌ ఒడ్డుకు వ‌చ్చాడు. కొండ ప్రాంతం కావ‌డంతో న‌ది ఒడ్డుకు అంతా ఎక్క‌డ చూసినా కంక‌ర రాళ్లే కుప్ప‌లు కుప్ప‌లుగా ఉన్నాయి. అంత‌లోనే ఆ బాలుడికి ఏమ‌నిపించిందో కింద ఉన్న ఓ రాయిని తీసి నీటిలోకి విసిరాడు. అలా విరుసుతూ, తుళ్లుతూ అలాంటి వాతావ‌ర‌ణాన్ని పూర్తిగా ఆస్వాదిస్తున్నాడు.

kids-friendship

అప్ప‌టికి కొంత స‌మ‌యం గ‌డిచింది. ఇంత‌లో అదే న‌దికి మ‌రో ఒడ్డు వైపుకు ఇంకో బాలుడు వ‌చ్చాడు. అవ‌త‌ల ఉన్న బాలుడు న‌దిలోకి రాళ్లు విసురుతుండ‌డాన్ని చూసి తానూ వెంట‌నే ఓ రాయిని తీసుకుని బ‌లంగా నీటికి విసిరాడు. అది అవ‌త‌ల ఉన్న బాలుడు చూశాడు. తాను మాత్రం ఏం త‌క్కువ తిన్నానా అన్న‌ట్టుగా అత‌నూ ఇంకో రాయిని తీసుకుని అవ‌త‌లి బాలుడి క‌న్నా ఇంకా వేగంగా రాయిని నీటిలోకి విసిరాడు. అలా వారిద్ద‌రూ కొంత సేపు రాళ్ల‌ను పోటీ ప‌డి మ‌రీ విసురుతూ స‌మయం తెలియ‌కుండా ఆడుకున్నారు.

మ‌రునాడు సాయంత్రం స‌రిగ్గా అదే స‌మ‌యానికి ఇద్ద‌రూ న‌ది ఒడ్డుకు చేరుకున్నారు. కింద‌టి రోజు లాగే ఆట‌ను ప్రారంభించారు. ఒక‌రిని మించి ఒక‌రు పోటీ ప‌డుతూ న‌దిలోకి రాళ్ల‌ను విసురుతూ మ‌ళ్లీ ఆడుకున్నారు. అదిగో అలా మొద‌లైంది వారి ఆట‌. ఇప్ప‌టికీ అలా కొన‌సాగుతూనే ఉంది. కానీ వారిద్ద‌రికీ ఒక‌రి పేరు ఒక‌రికి తెలియ‌దు. ఇద్ద‌రూ చెరో దేశానికి చెందిన వారు. వారి మ‌ధ్య ఉన్న అడ్డంకి ఒక్క‌టే… న‌ది..! దానికి ఇరు వైపులా చెరొక‌రు నిల‌బ‌డి అలా ఆట ఆడుకోవ‌డం రోజూ వారికి ఒక దిన‌చ‌ర్య‌గా మారిపోయింది. ఈ క్ర‌మంలో ఆ రెండు దేశాల మ‌ధ్య ప‌చ్చ‌గ‌డ్డి వేస్తే భగ్గుమనేంత‌లా వాతావ‌ర‌ణం మారింది. దాడులు పెరిగిపోయాయి. అయినా రోజూ సాయంత్రం వారి ఆట మాత్రం ఆగలేదు. చివ‌రికి ఇద్ద‌రూ ఒకే ఒడ్డున క‌లుసుకున్నారు. స్నేహానికి ఎలాంటి హ‌ద్దులు ఉండ‌వ‌ని చాటారు. వారే భార‌త్‌, పాకిస్థాన్‌ల‌కు చెందిన ఆ చిన్నారులు. పైన మేం చెప్పిందంతా య‌దార్థంగా జ‌రిగిందే. ఇందులో ఎలాంటి క‌ల్పిత‌మూ లేదు. దేశాల మ‌ధ్య వైరం అనేది ఇద్ద‌రు వ్య‌క్తుల మ‌ధ్య స్నేహానికి ఎటువంటి ఆటంకం కాబోద‌ని వారు నిరూపించిన తీరుకు, వారి ఫ్రెండ్‌షిప్‌కు హ్యాట్సాఫ్‌..!

14285765_1228454377177150_1486519637_o

Comments

comments

Share this post

scroll to top