మంట‌లంటుకున్న విమానంలో ఉన్న 194 మందిని ర‌క్షించారు… ఆ ఇద్ద‌రు యువ‌కులు..!

ప్ర‌మాదాల‌నేవి మ‌న‌కు చెప్పి జ‌ర‌గ‌వు. అవి అనుకోకుండానే వ‌స్తాయి. అయితే… ప్రమాదం జ‌రిగిన‌ప్పుడు వెంట‌నే స్పందిస్తే దాంతో జ‌రిగే న‌ష్టం త‌క్కువ‌గా ఉంటుంది. ఒక్కోసారి అలాంటి ప‌రిస్థితుల్లో ఉంటే… ఒక‌వేళ వెంట‌నే స్పందిస్తే… భారీ న‌ష్టం క‌ల‌గ‌కుండా కూడా చూసుకోవ‌చ్చు. స‌రిగ్గా ఆ ఇద్ద‌రు యువ‌కులు కూడా ఇలాగే చేశారు. కాబ‌ట్టే 194 మంది ప్ర‌యాణికులు ర‌క్షింప‌బ‌డ్డారు. అదీ… మంట‌లంటుకున్న విమానం నుంచి. ఈ క్ర‌మంలో పెను ప్ర‌మాదం నుంచి ర‌క్షించినందుకు గాను ఆ ఇద్ద‌రు యువ‌కుల‌ను అంద‌రూ అభినందించారు. ప్ర‌శంసించారు కూడా. ఈ సంఘ‌ట‌న జ‌రిగింది ఢిల్లీలో..!

flight-rescue-fire

ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఎయిర్‌పోర్ట్ నుంచి ఈ మ‌ధ్య గోఎయిర్‌కు చెందిన జీ8-557 అనే విమానం బెంగుళూరుకు బ‌య‌ల్దేరింది. రాత్రి 7.28 గంట‌ల‌కు విమానం ఎయిర్‌పోర్ట్ నుంచి టేకాఫ్ అయింది. అయితే అప్ప‌టికే ఆ విమానానికి చెందిన తోక భాగంలో మంట‌లు అంటుకున్నాయి. కానీ ఆ విష‌యం విమానం లోప‌ల ఉన్న వారికి తెలియ‌దు. ఈ క్ర‌మంలో ఆ విమానం వెళ్తుండ‌గా అక్క‌డే ఎయిర్ పోర్టుకు స‌మీపంలో ఓ ఇంటి టెర్ర‌స్‌పై ఉన్న ఇద్ద‌రు యువ‌కులు రోహిత్‌, నితిన్‌లు ఆ విమానాన్ని చూశారు. దాని వెనుక భాగంలో ఉన్న మంట‌ల‌ను కూడా వారు గ‌మ‌నించారు. దీంతో వారు వెంట‌నే అల‌ర్ట్ అయ్యారు.

ఈ క్ర‌మంలో రోహిత్ త‌న తండ్రి న‌వ్‌నీత్ సింగ్‌కు స‌మాచారం అందించ‌గా, అత‌ను ఢిల్లీ పోలీసుల‌కు కాల్ చేసి స‌మాచారం చెప్పాడు. ఢిల్లీ పోలీసులు వెంట‌నే ఎయిర్‌పోర్ట్ సిబ్బందిని సంప్ర‌దించి విష‌యం చెప్పారు. దీంతో టేకాఫ్ అయిన కొద్ది నిమిషాల‌కే అంటే రాత్రి 7.53 గంట‌ల‌కు విమానం ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లోనే సేఫ్‌గా ల్యాండ్ అయింది. అందులో నుంచి ప్ర‌యాణికుల‌ను వెంట‌నే దించేసి వారిని ప్ర‌త్యామ్నాయ మార్గాల్లో గ‌మ్య‌స్థానాల‌కు పంపే ఏర్పాటు చేశారు. దీంతో పెద్ద ప్ర‌మాద‌మే త‌ప్పింది. అలా రోహిత్‌, నితిన్‌లు వెంట‌నే స్పందించి కాల్ చేయ‌డంతో విమానంలో ఉన్న మొత్తం 194 మంది ర‌క్షింప‌బ‌డ్డారు. లేదంటే ఎంతటి న‌ష్టం జ‌రిగి ఉండేదో మ‌నం ఇట్టే ఊహించుకోవ‌చ్చు. దీంతో ఆ ఇద్ద‌రినీ చాలా మంది అభినందించారు. వారి స‌మ‌య‌స్ఫూర్తికి, అల‌ర్ట్‌నెస్‌కు వారిని ప్ర‌శంసించారు. అవును మ‌రి. ప్ర‌మాదం జ‌రిగితే ఎవ‌రైనా చూస్తూ ఊరుకోకూడ‌దు. వెంట‌నే స్సందిస్తే అలా భారీ న‌ష్టం కాకుండా జాగ్ర‌త్త ప‌డ‌వ‌చ్చు..!

Comments

comments

Share this post

scroll to top