భార‌త ఉప‌రాష్ట్ర ప‌తిగా వెంక‌య్య‌నాయుడు పేరును వీరు ప్ర‌తిపాదించార‌ట‌. ఒకొక్కరు ఒకోటి రాస్తే..ఏది నమ్మాలి?

భార‌త‌దేశ నూతన రాష్ట్ర‌ప‌తిగా రామ్‌నాథ్ కోవింద్ ఎన్నికైన విష‌యం తెలిసిందే. ప్ర‌త్య‌ర్థి మీరాకుమార్‌పై ఆయ‌న గెలుపొందారు. ఈ క్ర‌మంలో త్వ‌ర‌లోనే ఆయ‌న రాష్ట్ర‌ప‌తిగా బాధ్య‌త‌లు చేప‌ట్ట‌నున్నారు. కాగా కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్‌డీఏ ప్ర‌భుత్వం త‌మ ఉప రాష్ట్ర‌ప‌తి అభ్య‌ర్థిగా కేంద్ర మాజీ మంత్రి వెంక‌య్య‌నాయుడు పేరును ఇప్ప‌టికే ప్ర‌క‌టించ‌గా ఆయ‌న నామినేష‌న్ వేసిన విష‌యం తెలిసిందే. దీంతో త్వ‌ర‌లో ఈ ఎన్నిక కూడా జ‌ర‌గ‌నుంది. అయితే వెంక‌య్య‌నాయుడును ఎన్‌డీఏ వ‌ర్గాలు ఎప్పుడైతే ఉప రాష్ట్ర‌ప‌తి అభ్య‌ర్థిగా ప్ర‌క‌టించాయో అదే రోజున ప‌లు పుకార్లు కూడా కొన్ని సైట్ల‌లో షికార్లు చేశాయి. ప్ర‌ధానంగా సోష‌ల్ మీడియా అవి వైర‌ల్ అయ్యాయి. అవేమిటంటే…

పై ఫొటోల్లో చూస్తున్నారుగా. ఒక‌రు తెలంగాణ ఐటీ, పంచాయ‌తీ రాజ్ శాఖ మంత్రి కేటీఆర్‌, మ‌రొక‌రు ఆంధ్ర‌ప్ర‌దేశ్ మంత్రి లోకేష్‌, ఇంకొక‌రు ఏపీ ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్‌. వీరి పేరిట వ‌చ్చిన ఈ మూడు వార్త‌ల‌ను చూశారు క‌దా. వెంక‌య్య‌నాయుడును ఉప రాష్ట్ర‌ప‌తిగా ప్ర‌తిపాదించింది నేనే.. అని ఈ మూడింటింలో కామ‌న్‌గా ఉంది. కానీ పేర్లే వేరేగా ఉన్నాయి. న‌మస్తే తెలంగాణ‌కు చెందిన వెబ్‌సైట్‌లో కేటీఆర్ పేరు ఉంటే, ఆంధ్ర‌జ్యోతి సైట్‌లో లోకేష్ పేరు ఉంది. ఇక సాక్షి సైట్‌లో జ‌గ‌న్ పేరు ఉంది. అయితే నిజానికి ఇవి పుకార్లే. వీటిల్లో ఏ మాత్రం వాస్త‌వం లేదు.

ఎవ‌రో కావాల‌ని వీటిని సృష్టించారు. అనంత‌రం నెట్‌లో, సోష‌ల్ మీడియాలో వైర‌ల్ చేశారు. దీంతో అవి ఒక్కసారిగా క‌ల‌క‌లం సృష్టించాయి. ఈ క్ర‌మంలోనే ఈ పుకారు వార్త‌ల‌పై ఆయా సైట్ల యాజ‌మాన్యాలు ఇప్ప‌టికే నెటిజ‌న్ల‌ను హెచ్చ‌రించాయి కూడా. ఆ వార్త త‌మ సైట్‌లో రాలేద‌ని, వాటికి త‌మ‌కు ఎలాంటి సంబంధం లేద‌ని స‌ద‌రు వెబ్‌సైట్ల‌లో వివ‌ర‌ణ ఇచ్చారు. చూశారుగా… నేటి త‌రుణంలో సోష‌ల్ మీడియాను ఆస‌రాగా చేసుకుని కొంద‌రు ఎలాంటి పుకార్లు సృష్టిస్తున్నారో. క‌నుక మీకు ఇలాంటి వార్త‌లు క‌న‌ప‌డితే వెంట‌నే స్పందించ‌కండి. నిజా నిజాలు తెలుసుకున్నాకే స్పందిస్తే బెట‌ర్‌. లేదంటే పుకారు వార్త‌ల‌కు న‌ష్ట ప‌రిహారం చెల్లించుకోవాల్సి వ‌స్తుంది జాగ్ర‌త్త‌..!

Comments

comments

Share this post

scroll to top