ప్ర‌ధాని మోడీ దెబ్బ‌కు…. బిచ్చగాళ్లైన మాఫియా డాన్లు.!

రూ.500, రూ.1000 నోట్ల‌ను ర‌ద్దు చేయాల‌నే నిర్ణయం తీసుకున్న మోడీకి దాదాపు అన్ని వ‌ర్గాల నుంచి పాజిటివ్ స్పంద‌నే వ‌స్తున్న‌ట్లు క‌నిపిస్తోంది. నోట్ల మార్పిడికి జ‌నాల‌కు లైన్లలో వేచి ఉండ‌డం తప్ప పెద్ద‌గా ఇబ్బందులు ఎదురు కాక‌పోతుండ‌డం, దీనికి తోడు ఏటీఎంలు కూడా అందుబాటులోకి రావ‌డంతో సామాన్య జ‌నాల‌కు కొంత ఊర‌ట క‌లిగింది. ఈ క్ర‌మంలో న‌ల్ల‌ధ‌నం దాచిన కుబేరులు మాత్రం అటు క‌క్కా లేక, ఇటు మింగ‌లేక అన్న‌ట్టుగా త‌యార‌య్యారు. ఇక వీరి ప‌రిస్థితి ఇలా ఉంటే మోడీ దెబ్బ‌కు ఆ ముగ్గురు మాత్రం బిచ్చ‌గాళ్లే అయ్యారు. ఇంత‌కీ ఎవ‌రా ముగ్గురు..? ఏమా క‌థ‌..? ఓ లుక్కేద్దామా..!

isi-hafeez-dawood

దావూద్ ఇబ్ర‌హీం తెలుసుగా. మాఫియా డాన్‌. ఐఎస్ఐ తీవ్ర‌వాద సంస్థ. హ‌ఫీజ్ స‌యీద్‌, ఉగ్ర‌వాద ముఠా నాయ‌కుడు. అయితే వీరు ముగ్గురు క‌లిసీ లాహోర్‌లో ఏకంగా ఓ ప్రింటింగ్ ప్రెస్‌నే తెరిచారు. అదీ మ‌న భార‌త క‌రెన్సీకి చెందిన దొంగ నోట్ల‌ను ముద్రించ‌డం కోసం. ఈ క్ర‌మంలో వారు రూ.500, రూ.1000 నోట్ల‌కు వాడే ప్ర‌తి ప‌రికరాన్ని తెప్పించుకున్నారు. మ‌న ద‌గ్గ‌ర ఆ నోట్ల ప్రింటింగ్ కోసం లండ‌న్‌లోని ఓ ప్ర‌ముఖ సంస్థ కాగితాన్ని స‌ప్లై చేస్తుంది. అదే సంస్థ నుంచి కొందరు అధికారుల‌తో లాలూచీ ప‌డి ఐఎస్ఐ అదే కాగితాన్ని తెప్పించుకుని మ‌రీ లాహోర్‌లో ఉన్న ప్రింటింగ్ ప్రెస్‌లో ఇన్ని రోజులు మ‌న భార‌త క‌రెన్సీని ముద్రిస్తూ వ‌చ్చారు. అలా ముద్ర‌ణ అయిన నోట్ల‌ను హ‌ఫీజ్ కాశ్మీర్ నుంచి భార‌త్‌లోకి ర‌వాణా చేస్తుంటే దావూద్ మిగిలిన ప్రాంతాల నుంచి ర‌వాణా చేసేవాడు. దీంతో మ‌న దేశంలోకి అలాంటి న‌కిలీ క‌రెన్సీ నోట్లు దాదాపు రూ.12 ల‌క్ష‌ల కోట్ల దాకా వ‌చ్చాయ‌ని అంచ‌నా.

ఆ నోట్ల‌ను మార్పించిన ఐఎస్ఐ ఎన్నో వేల కోట్ల‌ను గ‌డించింద‌ని తెలిసింది. ఆ డ‌బ్బుతోనే ఉగ్ర‌వాద కార్య‌క‌లాపాల‌కు పాల్ప‌డుతున్న‌ట్టు స‌మాచారం. ఈ క్ర‌మంలో ప్ర‌ధాని మోడీ తీసుకున్న క‌రెన్సీ ర‌ద్దు నిర్ణ‌యంతో వారి వ‌ద్ద ఉన్న ల‌క్ష‌ల కోట్ల రూపాయ‌లు చిత్తు కాగితాల్లా మారాయి. దీంతో ఐఎస్ఐ, హ‌ఫీజ్‌, దావూద్ ఇబ్ర‌హీంలు ముగ్గురూ బిచ్చ‌గాళ్లు అయ్యారు. అదీ మోడీ దెబ్బ‌. న‌కిలీ నోట్లు, న‌ల్ల‌ధ‌నంపై మోడీ చేసిన స‌ర్జిక‌ల్ స్ట్రైక్ ఎక్క‌డ త‌గలాలో అక్క‌డ త‌గిలింది క‌దా..!

Comments

comments

Share this post

scroll to top