వీరు ఒక‌ప్పుడు ప‌లు క్రీడ‌ల్లో చాంపియ‌న్స్… ఆద‌ర‌ణ లేక ఇప్పుడు అత్యంత పేద‌రికంలో కొట్టుమిట్టాడుతున్నారు..!

మ‌న దేశంలో క్రికెట్ ఆట‌కు ఎంత ఆద‌ర‌ణ ఉందో అంద‌రికీ తెలిసిందే. క‌ళ్లు చెదిరే ఆదాయం ల‌భిస్తుండ‌డంతో చాలా మంది ఆ క్రీడ వైపే మొగ్గు చూపుతున్నారు. దీనికితోడు స్పాన్స‌ర్లు కూడా క్రికెటర్ల‌కే ప్రాధాన్య‌త‌నిస్తున్నారు. మ్యాచ్‌లు, ప్లేయ‌ర్ల‌కు వారు స్పాన్స‌ర్‌షిప్‌లు ఇస్తున్నారు. ఈ క్ర‌మంలో పెద్ద ఎత్తున జ‌నాలు ఆ క్రీడ‌ను చూస్తుండ‌డంతో ఆ ఆట ఆడేవారికే కాదు, దానికి స్పాన్స‌ర్‌షిప్ ఇచ్చే కంపెనీల‌కు కూడా చాలా లాభమే క‌లుగుతోంది. అయితే క్రికెట్ సంగ‌తి ప‌క్క‌న పెడితే మిగిలిన క్రీడ‌ల‌కు అంత‌గా ఆద‌ర‌ణ లేద‌నే చెప్ప‌వ‌చ్చు. దీంతో గ‌తంలో ఆయా క్రీడ‌ల్లో అంత‌ర్జాతీయ స్థాయిలో మెడ‌ల్స్ సాధించిన వారు స‌రైన ఆద‌ర‌ణ లేక ఇప్పుడు చాలా దుర్భర జీవితం గ‌డుపుతున్నారు. ఆట‌కు దూర‌మై, స్పాన్స‌ర్‌షిప్ లేక‌, పూట గ‌డ‌వ‌డ‌మే క‌ష్ట‌మైన స్థితిలో వారు కాలం వెళ్లదీస్తున్నారు. అలాంటి క్రీడాకారుల గురించే కింద తెలుసుకుందాం.

ఆషా రాయ్‌…
ఈమె ఒక‌ప్పుడు 100, 200 మీట‌ర్ల ప‌రుగు పందెంలో జాతీయ స్థాయిలో గోల్డ్ మెడ‌ల్స్ సాధించింది. కానీ ఇప్పుడు పూట‌కు తిండి నోచుకోవ‌డం లేదు. కుటుంబ పోష‌ణ కోసం ఈమె కూర‌గాయ‌ల‌ను అమ్ముకుని జీవిస్తోంది.

సీతా సాహు…
ఈమె ఒలంపిక్స్‌లో ప‌రుగు పందెంలో బ్రాంజ్‌ మెడ‌ల్ సాధించింది. అయితే ఇప్పుడు పూట‌కు తిండికి లేక‌పోవ‌డంతో పానీపూరీ అమ్ముకుని జీవ‌నం సాగిస్తోంది.

రష్మిత పాత్రా…
ప‌లు అంత‌ర్జాతీయ ఫుట్‌బాల్ మ్యాచ్‌ల‌లో ఈమె భార‌త్ త‌ర‌ఫున ప్రాతినిధ్యం వ‌హించింది. ఇప్పుడు చాలా దుర్భ‌రమైన జీవితం గ‌డుపుతోంది. త‌మ గ్రామంలో ఓ పాన్ డ‌బ్బా పెట్టుకుని పాన్‌ల‌ను విక్రయించి జీవ‌నం సాగిస్తోంది.

భ‌ర‌త్ కుమార్‌…
భ‌ర‌త్ కుమార్ ఓ పారాలంపిక్ స్విమ్మ‌ర్‌. భార‌త్ త‌ర‌ఫున అనేక మ్యాచ్‌ల‌ను అంత‌ర్జాతీయ స్థాయిలో ఆడాడు. అన్నీ క‌లిపి 50 మెడ‌ల్స్ వ‌ర‌కు సంపాదించాడు. అయితే ఇప్పుడు రెక్కాడితే గానీ డొక్కాడ‌ని స్టేజిలో ఉన్నాడు. కార్ల‌ను వాష్ చేస్తూ జీవ‌నం సాగిస్తున్నాడు.

శాంతీ దేవి…
బ‌హుశా ఈమె పేరు ఇప్పుడు చాలా మందికి తెలిసి ఉండ‌దు. కానీ ఒక‌ప్పుడు ఈమె క‌బ‌డ్డీ చాంపియ‌న్‌. బీహార్ వాసి. ప‌లు జాతీయ స్థాయి మ్యాచ్‌ల‌లో ఆడి త‌న స‌త్తా చాటింది. ఇప్పుడు త‌మ గ్రామంలో కూర‌గాయ‌లు అమ్ముతూ పిల్ల‌ల్ని పోషిస్తోంది.

నిషా రాణీ ద‌త్తా…
ఈమె ఒక‌ప్పుడు ఆర్చ‌రీ చాంపియ‌న్‌. అనేక మెడ‌ల్స్ సాధించింది. అయితే ఇప్పుడు ఆమె ఫ్యామిలీ చాలా దీనస్థితిలో ఉంది. రోజుకు క‌నీసం రెండు పూట‌లా కాదు క‌దా ఒక పూట భోజ‌నానికి కూడా ఈమె కుటుంబం నోచుకోలేదు. దీంతో ఈమె ఏం చేయాలో తెలియ‌ని దీన స్థితిలో ఉంది.

రాజ్ కుమార్ తివారీ…
ఒక‌ప్పుడు రాజ్ కుమార్ స్కేటింగ్‌లో చాంపియ‌న్‌. వింట‌ర్ ఒలంపిక్స్‌లో పాల్గొని భార‌త్‌కు గోల్డ్ మెడ‌ల్‌ను సాధించి పెట్టాడు. ఇప్పుడు పూట‌కు గ‌తి లేక వీధుల్లో చిరు వ్యాపారిగా మారాడు.

 

శాంతి సౌంద‌రాజ‌న్‌…
ఈమె ఒక‌ప్పుడు ట్రాక్‌ఫీల్డ్ అథ్లెటిక్స్‌లో చాంపియ‌న్‌. 2006వ సంవ‌త్స‌రంలో 800 మీట‌ర్ల ట్రాక్ ఫీల్డ్‌లో సిల్వ‌ర్ మెడ‌ల్ సాధించింది. అయితే ఇప్పుడు చాలా దీన‌స్థితిలో జీవ‌నం గ‌డుపుతోంది.

నారి ముండు…
ఈమె జార్ఖండ్ వాసి. హాకీ చాంపియ‌న్‌. భార‌త్ త‌ర‌ఫున ప‌లు అంత‌ర్జాతీయ మ్యాచ్‌ల‌లో ఈమె పాల్గొంది. 19 మ్యాచ్‌లు ఆడింది. స‌రైన ఆద‌ర‌ణ లేక‌పోవ‌డంతో ఆమె హాకీ ఆడ‌డం మానేసింది. దీంతో వ్య‌వ‌సాయ కూలీగా ఆమె ప్ర‌స్తుతం ప‌నిచేస్తోంది.

బిర్ బ‌హాదూర్‌…
ఒక‌ప్పుడు ఈయన ప్ర‌ముఖ ఫుట్‌బాల్ ప్లేయ‌ర్‌. భార‌త ఫుట్‌బాల్ టీంలో స‌భ్యుడు. అనేక అంత‌ర్జాతీయ మ్యాచ్‌లు ఆడాడు. ఇప్పుడు స‌రైన ఆద‌ర‌ణ లేక‌పోవ‌డంతో పానీపూరీ అమ్ముకుని జీవ‌నం సాగిస్తున్నాడు.

సంధ్యా రాణి సింఘా…
ఒక‌ప్పుడు ఈమె ఫెన్సింగ్ చాంపియ‌న్‌. జాతీయ స్థాయి టోర్న‌మెంట్‌ల‌లో బ్రాంజ్ మెడ‌ల్స్ సాధించింది. ఇప్పుడు క‌డు దీనావ‌స్థ‌లో పేద‌రికంలో మ‌గ్గుతోంది. ఏం చేద్దామ‌న్నా ఆమెకు ఇప్పుడు ఏ ప‌నీ దొర‌క‌డం లేదు. దీంతో పూట గ‌డ‌వ‌డ‌మే క‌ష్టంగా మారింది.

 

స‌ర్వాన్ సింగ్‌…
1954 ఏషియ‌న్ గేమ్స్‌లో ఈయ‌న అథ్లెటిక్స్ లో గోల్డ్ మెడ‌ల్ సాధించాడు. ప్ర‌స్తుతం అత్యంత పేద జీవితాన్ని గ‌డుపుతున్నాడు. పూట గ‌డ‌వ‌డ‌మే క‌ష్టంగా మారింది. ఆద‌రించే వారి కోసం ఈయ‌న ఎదురు చూస్తున్నాడు.

Comments

comments

Share this post

scroll to top