ఈ మొక్కలు మీ ఇంట్లో ఉన్నాయా..? అయితే జాగ్రత్త..!

ఇండ్లలో మొక్కలు పెంచుకోవడం మనలో అధిక శాతం మందికి ఉన్న అలవాటు. కొన్ని రకాల మొక్కలు మనకు ఆహ్లాదాన్ని కలిగిస్తే ఇంకొన్నింటిని అదృష్టం కోసం పెంచుకుంటారు. అయితే మొక్కలను పెంచుకునే అలవాటు ఎలా ఉన్నా, ఏదైనా మొక్కను తెచ్చుకునే సమయంలో మాత్రం తప్పనిసరిగా జాగ్రత్తలు పాటించాల్సిందే. అది జాతికి చెందిన మొక్క, దాని వల్ల ఏం జరుగుతుంది, మన ఆరోగ్యానికి అదేమన్నా కీడు చేస్తుందా? అనే విషయాలను తెలుసుకుని మరీ మొక్కలను ఇంట్లోకి తెచ్చుకోవాలి. లేదంటే తీవ్రమైన అనారోగ్య సమస్యలు కలిగేందుకు అవకాశం ఉంటుంది. ఈ క్రమంలోనే పలు రకాల మొక్కల వల్ల మనకు ఎలాంటి అస్వస్థతలు, అనారోగ్యాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.

1. హెమ్లాక్‌
ఉత్తర అమెరికాలో ఈ మొక్క ఎక్కువగా పెరుగుతుంది. అయితే దీన్ని ఇండ్లలో మాత్రం పెంచుకోకూడదు. ఎందుకంటే దీని వల్ల కండరాలు పట్టేయడం, కడుపు నొప్పి, వికారం వంటి సమస్యలు ఉత్పన్నమవుతాయి. ఒక్కో సారి ఇది ప్రాణాంతకంగా కూడా మారుతుంది. అయితే పైన చెప్పిన సమస్యలు కలిగితే మాత్రం కొన్ని సందర్భాల్లో జ్ఞాపకశక్తిని కోల్పోయేందుకు కూడా అవకాశం ఉంటుందట. ఈ మొక్క అత్యంత విషపూరితమైన స్వభావం కలిగి ఉంటుందట.

2. డెడ్లీ నైట్‌ షేడ్‌ (అట్రోపా బెల్లడోనా)
ఈ మొక్కలో ఉండే కాండం, ఆకులు, పండ్లు అన్నీ ప్రమాదకరమైనవేనట. వీటి వల్ల పక్షవాతం, గుండె జబ్బులు వచ్చేందుకు అవకాశం ఉంటుందట.

deadly-plants

3. అజిరాటినా అల్టిస్సిమా
ఈ మొక్కకు చెందిన పూవుల్లో ట్రెమటాల్‌ అనబడే ఓ విషపూరితమైన పదార్థం ఉంటుందట. అంతేకాదు ఈ మొక్క కాండం ద్వారా వచ్చే పాలు కూడా విషపూరితమైనవేనట. వీటి వల్ల ఆకలి తగ్గిపోవడం, వికారం, నరాల బలహీనత, కడుపు నొప్పి, నాలుక ఎర్రబడడం వంటి పరిస్థితులు సంభవిస్తాయట. ఒక్కోసారి మరణం కూడా సంభవించేందుకు అవకాశం ఉంటుందట.

4. రిసినస్‌ కమ్యూనిస్‌
ఈ మొక్కకు చెందిన విత్తనాలు అత్యంత విషపూరితమైనవట. కేవలం రెండు విత్తనాలు తింటే పిల్లలు, 8 విత్తనాలు తింటే పెద్దలు చనిపోతారట. అంతేకాదు దానికి ముందు వాంతులు, వికారం, డయేరియా వంటి లక్షణాలు కనిపిస్తాయట.

5. ది రోజరీ పీ
ఈ మొక్కలో అబ్రిన్‌ అనబడే విష పదార్థం ఉంటుంది. ఇది మరణాన్ని కలిగించే స్వభావం కలిగి ఉంటుంది. దీని వల్ల ఎలాంటి లక్షణాలు కనబడకపోయినా అకస్మాత్తుగా వ్యక్తులు మృతి చెందేందుకు అవకాశం ఉంటుంది.

Comments

comments

Share this post

scroll to top