నిద్ర ప‌ట్ట‌డం లేదా… అయితే ఈ మొక్క‌ల‌ను మీ బెడ్‌రూంలో పెట్టుకోండి..!

నిత్యం వివిధ సంద‌ర్భాల్లో మాన‌సిక ఒత్తిడి, ఆందోళ‌న వంటి స‌మ‌స్య‌ల‌తో నేడు అనేక మంది స‌త‌మ‌త‌మ‌వుతున్నారు. అందుకు కార‌ణాలు అనేకం ఉంటున్నాయి. విద్యార్థులు, ఉద్యోగులు, యువ‌తీ యువ‌కులు… ఇలా ఒక‌రేమిటి చాలా మంది ఒత్తిడికి గుర‌వుతున్నవారే. దీంతో రాత్రి పూట నిద్ర స‌రిగ్గా రాక నిద్ర‌లేమి స‌మ‌స్య‌ల‌కు గుర‌వుతున్నారు. ఈ క్ర‌మంలో అలాంటి వారు అనేక ర‌కాల అనారోగ్యాల బారిన ప‌డాల్సి వస్తుంది కూడా. అయితే అలాంటి వారు కింద ఇచ్చిన మొక్క‌ల‌ను ఇంట్లో బెడ్ రూంలో పెట్టుకుని చూస్తే చాలు. ఆ మొక్క‌ల్లో ఉండే ఔష‌ధ గుణాలు గాలిలోకి వ్యాప్తి చెంది తద్వారా వారికి చ‌క్క‌ని నిద్ర‌ను ఇస్తాయి. ఇది మేం చెబుతోంది కాదు, ప‌లువురు సైంటిస్టులు శోధించి తేల్చిన నిజం..! ఈ క్ర‌మంలో ఆ మొక్క‌లు ఏమిటో తెలుసుకుందామా..!

sleep-plants-1

1. అలోవెరా (క‌ల‌బంద‌)…
క‌ల‌బంద మొక్క మ‌న‌కు ఆరోగ్య ప‌రంగా ఎన్ని ప్ర‌యోజ‌నాల‌ను అందిస్తుందో మ‌నంద‌రికీ తెలిసిందే. అయితే ఈ మొక్క‌ను బెడ్ రూంలో పెట్టుకుంటే దాంతో రాత్రి పూట ఈ మొక్క నుంచి పెద్ద ఎత్తున ఆక్సిజ‌న్ విడుద‌ల‌వుతుంది. ఇది చాలా స్వ‌చ్ఛంగా ఉంటుంది. దీంతోపాటు మొక్క‌లో ఉండే ప‌లు ఔష‌ధ గుణాలు గాలి ద్వారా మ‌న శ‌రీరంలోకి చేర‌తాయి. ఈ క్ర‌మంలో మ‌న‌కు చ‌క్క‌ని నిద్ర వ‌స్తుంది. అంతేకాదు, స్వ‌చ్ఛ‌మైన గాలి కూడా ల‌భిస్తుంది. దీనికి నీళ్లు కూడా పెద్ద‌గా అవ‌స‌రం లేదు.

2. ల‌వంగం మొక్క‌…
ల‌వంగం మొక్క‌ను బెడ్ రూంలో పెట్టుకుంటే దాని నుంచే వ‌చ్చి సువాస‌న‌కు మంచి నిద్ర ప‌డుతుంది. అంతేకాదు, దాని వ‌ల్ల ఒత్తిడి గ‌ణ‌నీయంగా త‌గ్గుతుంది. గుండె సంబంధ స‌మ‌స్య‌లు దూర‌మ‌వుతాయి. చిన్న పిల్ల‌ల‌కు ఈ మొక్క నుంచి వ‌చ్చే గాలి ఎంతో మంచిద‌ట‌.

sleep-plants-2

3. మ‌ల్లె మొక్క‌…
మ‌ల్లె పూల నుంచి ప‌రిమ‌ళం ఎలా వ‌స్తుందో అంద‌రికీ తెలిసిందే. అయితే అదే మొక్క‌ను బెడ్ రూంలో పెట్టుకుంటే దాంతో రాత్రి పూట ఆ మొక్క నుంచి వ‌చ్చే సువాస‌న‌ను ఓసారి పీలిస్తే చాలు, మైమ‌రిచి నిద్ర‌పోతారు. మ‌ల్లె మొక్క నుంచి వ‌చ్చే గాలిలో ఒత్తిడిని త‌గ్గించే గుణాలు ఉంటాయి.

4. ఇంగ్లిష్ ఐవీ ప్లాంట్‌…
ఈ మొక్క‌ను బెడ్ రూంలో పెట్టుకుంటే ప‌రిస‌రాల్లో ఉన్న గాలి శుభ్ర‌మ‌వ‌డ‌మే కాదు, రాత్రి పూట ఆ గాలికి చ‌క్క‌గా నిద్ర ప‌డుతుంది కూడా. నాసా సైంటిస్టులు దీన్ని ధ్రువీక‌రించారు. ఈ మొక్క నుంచి విడుద‌ల‌య్యే గాలి వ‌ల్ల ప‌రిస‌రాల్లో ఉన్న గాలి 94 శాతం స్వ‌చ్ఛంగా మారుతుంద‌ట‌. ఆస్త‌మా వంటి శ్వాస‌కోశ స‌మ‌స్య‌లు ఉన్న‌వారికి, నిద్ర స‌రిగ్గా ప‌ట్ట‌ని వారికి ఈ మొక్క మంచి మందు.

sleep-plants-3

5. స్నేక్ ప్లాంట్‌…
ఈ మొక్క‌ను చాలా మంది ఇంటి ఆవ‌ర‌ణ‌లో అలంక‌ర‌ణ కోసం వాడుతారు. అయితే ఈ మొక్క‌ను బెడ్ రూంలో పెట్టుకుంటే దాంతో రాత్రి పూట ఆ మొక్క నుంచి విడుద‌ల‌య్యే గాలికి చ‌క్క‌ని నిద్ర ప‌డుతుంది. రాత్రి పూట ఆక్సిజ‌న్‌ను వ‌దిలే మొక్క‌ల్లో ఇది కూడా ఒక‌టి. ఈ క్ర‌మంలో స్నేక్ ప్లాంట్ ఇంట్లో ఉంటే ఆరోగ్యం కొని తెచ్చుకున్న‌ట్టే..! ప‌రిస‌రాల్లో ఉండే గాలిని ప్యూరిఫై చేయ‌డంలో ఈ మొక్క బాగా ఉప‌యోగ‌ప‌డుతుంది.

Comments

comments

Share this post

scroll to top