ప్రాణంపోయిన చెరువుకు జీవం పోసి..ఓ అడ‌వినే సృష్టించిన గ్రామ‌స్తులు.!!

దేశ అభివృద్ధిలో పారిశ్రామిక రంగానికి కూడా కీల‌క‌పాత్రే. అయితే దాని వ‌ల్ల ప‌ర్యావ‌ర‌ణానికి మాత్రం తీవ్రంగా నష్టం జ‌రుగుతోంది. ఈ క్ర‌మంలో ఎంతో విలువైన స‌హ‌జ వన‌రులైన అట‌వీ సంప‌ద‌, భూగ‌ర్భ జ‌లాలు క‌నుమ‌రుగవుతున్నాయి. మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లోని ఆ రెండు జిల్లాలు కూడా ఇలాంటి ప‌రిస్థితుల‌ను ఎదుర్కొన్న‌వే. అయితే గ‌త ద‌శాబ్ద కాలంగా అక్క‌డి గ్రామాల ప్ర‌జ‌లు చేప‌డుతున్న ప‌లు వినూత్న కార్య‌క్ర‌మాల వ‌ల్ల ఇప్పుడ‌క్క‌డ చూడ‌చక్క‌ని వృక్ష సంప‌ద పెర‌గ‌డ‌మే కాదు, అంత‌రించి పోతున్న జ‌లాల‌కు మ‌ళ్లీ కళ వ‌చ్చింది.

అవి మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లోని ఝాబువా, అలిరాజ్‌పూర్ జిల్లాలు. అక్క‌డ ప‌రిశ్ర‌మ‌ల వ‌ల్ల గ‌త 10 ఏళ్ల కింద‌ట ఎన్నో వృక్షాలు క‌నుమ‌రుగ‌య్యాయి. దీంతో నీటి వ‌న‌రులు కూడా అంత‌రించిపోయాయి. అయితే వాట‌ని తిరిగి పున‌రుద్ద‌రించ‌డం కోసం ఆ జిల్లాల్లో ఉండే గ్రామాల ప్ర‌జ‌లు న‌డుం బిగించారు. అందుకోసం ఒక‌ప్పుడు భిల్ తెగ‌కు చెందిన ప్ర‌జ‌లు అనుస‌రించిన విధానాల‌ను వారు చేప‌ట్ట‌డం మొదలు పెట్టారు. ఇందుకోసం వారు పెద్ద సంఖ్య‌లో గుమి గూడి ఓ స‌మావేశం పెట్టుకుని చేయాల్సిన కార్య‌క్ర‌మాల గురించి చ‌ర్చించే వారు. వారికి శివ్‌గంగా అభియాన్ అనే కార్య‌క్ర‌మం పేరిట ప‌లువురు స్వ‌చ్ఛంద సేవ‌కులు స‌హాయం అందించేవారు. ఒక‌ప్పుడు భిల్ తెగ‌కు చెందిన ప్ర‌జ‌లు అనుస‌రించిన నీటి సంరక్ష‌ణ ప‌ద్ధ‌తుల‌ను ఆ గ్రామాల‌కు చెందిన ప్ర‌జ‌ల‌కు నేర్పించారు. దీంతో ఆ జిల్లాల్లో ఉన్న దాదాపు 800 గ్రామాల‌కు చెందిన ప్ర‌జ‌లు ఆ విధానాల ద్వారా గ‌త 10 సంవ‌త్స‌రాలుగా ఎంతో విలువైన నీటిని సంర‌క్షించ‌డం మొద‌లు పెట్టారు.

దీంతో ఇప్పుడ‌క్క‌డ జ‌ల క‌ళ ఉట్టిపడుతోంది. భూగ‌ర్భ జ‌ల వ‌న‌రులు కూడా పెరిగాయి. కొండ ప్రాంతాల నుంచి దిగువ‌కు చిన్న పాటి కాలువ‌ల ద్వారా నీటిని మ‌ళ్లించి ఆ నీటిని ఒడిసి ప‌ట్టేందుకు మ‌ళ్లీ కింద పెద్ద చెరువుల‌ను నిర్మించారు. ఇందుకోసం ఏకంగా ఒకేసారి 10 నుంచి 20వేల మంది దాకా గ్రామ‌స్తులు ప‌నిచేసేవారు. ప్ర‌భుత్వం నుంచి ఎలాంటి స‌హాయం పొంద‌కుండానే అలా వారు త‌మంత తాముగా క‌ష్ట‌ప‌డి ఆ ప‌నుల‌ను చేశారు. ఈ క్ర‌మంలో ఆయా గ్రామాల‌కు చెందిన ప్ర‌జ‌లు త‌మ ప్రాంతాల్లో ఉండే 250 చేతి పంపుల‌ను స్వ‌యంగా బాగు చేసుకున్నారు. అంతేకాదు, ఈ ద‌శాబ్ద కాలంలో వారు 11వేల మొక్క‌ల‌ను నాట‌గా అవి వృక్షాలై ప‌చ్చ‌గా పెరుగుతున్నాయి. అదీ… ఆ గ్రామ‌ల ప్ర‌జ‌లు సొంతంగా సాధించిన అభివృద్ధి. దీంతో వారి విధానాల‌ను అనుస‌రించేందుకు దేశంలో ఇత‌ర గ్రామాల‌కు చెందిన ప్ర‌జ‌లు కూడా ఆస‌క్తి చూపుతున్నారు. వారు నిర్వ‌హించుకునే స‌మావేశాల‌కు వెళ్లి, నీటి సంర‌క్ష‌ణ ప‌ద్ధ‌తుల‌ను గురించి తెలుసుకుంటున్నారు. ఇదంతా… ఝాబువా, అలిరాజ్‌పూర్ జిల్లాల‌కు చెందిన గ్రామాల ప్ర‌జ‌ల చ‌ల‌వే అంటే న‌మ్మ‌గ‌ల‌రా..! ఈ విష‌యంలో వారిని అభినందించ‌కుండా ఉండలేం క‌దా..!

Comments

comments

Share this post

scroll to top