“ప్రియా ప్రకాష్” లాగే రాత్రికి రాత్రే సోషల్ మీడియా ద్వారా స్టార్స్ అయిన 6 మంది ఎవరో తెలుసా.? మీరే చూడండి!

సినిమా వాళ్లు కాని ఇతరులెవరైనా కాని స్టార్స్ అవ్వాలంటే ఎంతో కష్టపడి పైకి రావాలి.కాని అదేంటో కొందరు రాత్రికి రాత్రే స్టార్స్ అయిపోతారు .అలా అవ్వడానికి హెల్ప్ చేయడంలో ముందుంటుంది సోషల్ మీడియాలో..ఇక్కడ ఒక టాపిక్ కాని,ఒక వ్యక్తి కాని నచ్చారంటే ఇబ్బడిముబ్బడిగా పబ్లిసిటి వచ్చేసి వారిని ఓవర్ నైట్ స్టార్స్ ని చేసేస్తుంది.ఈ మధ్య కాలంలో ఆ విధంగా ఓవర్ నైట్ స్టార్స్ అయిన కొందరున్నారు..వారెవరో తెలుసా..

డింఛక్ పూజ

డించక్ పూజ ఆ మధ్య సోషల్‌మీడియాలో హాట్ టాఫిక్ మారింది. డించక్ పూజ స్వాగ్ వాలా పేరుతో డించక్ పాడిన పాట సోషల్‌మీడియాలో వైరల్ అయ్యింది. రాత్రి రాత్రేమిలియన్ల వ్యూస్ వచ్చింది. అంతేకాదు ఎంతోమంది స్టార్స్ పూజని ప్రశంసించారు.

ప్రియా ప్రకాష్ వారియర్

తాజాగా సోషల్ మీడియాలో అందరికి పిచ్చి ఎక్కిస్తున్న పిల్ల పేరు ప్రియా ప్రకాశ్‌ వారియర్. కళ్లతోనే భావాలను పలకించి అందరి మదిని కొల్లగొట్టింది ఈ అమ్మడు ప్రియా ప్రకాశ్ వారియర్. మళయాలంలోని ‘ఓరు అదార్‌ లవ్‌’ పేరుతో తెరకెక్కుతున్న సినిమాలో నటిస్తున్న ప్రియా ప్రకాశ్ వారియర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో తన హవా నడిపిస్తుంది. సన్నిలియొన్ ని మించిన ఫాలోవర్స్ రావడం ఆమెకి ఉన్న క్రేజ్ ఏంటో తెలియచేస్తుంది.

అర్షద్ ఖాన్

పాకిస్థాన్ లో చాయ్‌ అమ్ముకునే నీలికళ్ల కుర్రాడు ఒక్క క్లిక్‌ తో ప్రపంచానికి పరిచయం అయ్యాడు. తర్వాత అతని జీవితమే మారిపోయింది. కొన్ని టీవీ షోలలో నటించాడు. సినిమా ఆఫర్లు కూడా వచ్చాయి.

సైమా హుస్సేన్ మీర్

సింబయాసిస్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ డిజైన్‌ (ఎస్‌ఐడీ) కు సినిమా ప్రమోషన్ లో భాగంగా వెళ్లిన షారుక్‌  అక్కడ స్టూడెంట్స్ తో సెల్ఫీ   దిగాడు. దాన్ని అతడి ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేయడంతో షారుక్ కంటే ఎక్కువగా ఆ ఫోటోలో ఉన్న మరో అమ్మాయికి నెటిజన్లు ఫిదా అయ్యారు.ఆమె సైమా హుస్సేన్ మీర్‌.. కేవలం ఆ ఒక్క ఫోటోతో ఆమె ఫేమస్ అయిపోయింది.

రూపచంద్ర మహాజన్

కూరగాయలు ఒక అమ్మాయి ఆ మధ్య సోషల్ మీడియాలో హాట్ టాఫిక్ అయ్యింది. నేపాల్‌కు చెందిన రూపచంద్ర మహాజన్‌ అనే ఫొటో గ్రాఫర్‌ ఆ అమ్మాయి ఫొటోను తీసి నేపాలీ తర్కారీవాలీ అంటూ ఫేస్‌బుక్‌ లో పోస్ట్‌ చేశాడు. ఇంకేముంది ఆ పిల్ల ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది.

మధుర హనీ

లండన్‌ ఒలిపింక్స్‌ ప్రారంభ ఉత్సవంలో భారత బృందంలో పాల్గొన్న ఒక మహిళ అప్పట్లో చాలా హాట్ టాఫిక్ అయ్యింది. బృందంలో పాల్గొన్న మిగతవారి  వేషధారణకు భిన్నంగా ఎరుపు ,నీలం రంగు దుస్తులు ధరించి,ఠీవిగా నడుస్తూ అందరినీ ఆకట్టుకుంది ఆమె.

Comments

comments

Share this post

scroll to top