కూతుర్ని కాపాడుకోవ‌డం కోసం….. ప్రాణాల‌కు తెగించి మ‌రీ మొస‌లితో పోరాడిన క‌న్న‌త‌ల్లి.!!

మొసలిని తల్చుకుంటేనే ఒళ్లు గగుర్పొడుస్తుంది..అలాంటిది మొసలితో ఫైట్ అంటే కలలో కూడా ఊహించలేం..అలాంటి ఫైట్స్ మనం సినిమాల్లోనే చూస్తాం..అదే నిజంగా జరిగితే ఔరా అని అనుకుంటాం…కళ్లముందే కూతురు ప్రాణం పోతుంటే ఏ తల్లైనా ఎలా ఊరుకుంటుంది.. అమ్మ తల్చుకుంటే తన పిల్లలకోసం ఎంతటి సాహసమైనా చేయగలదు అనడానికి ఉదాహరణ దివాలినేన్ వాంకర్.!!!

దివాలినేన్ వాంకర్ తన కూతురు కాంత తో పాటు ఎప్పటిలానే విశ్వామిత్రి నదికి బట్టలుతకడానికి వెళ్లింది.తల్లి కూతుళ్లు నీళ్లలోకి దిగి బట్టలుతుకుతున్న సమయంలో ,నీళ్లలో నీడలా కనపడ్తున్న దానిని సరిగా గమనించక తమ పని తాము చేసుకుంటున్నారు..హఠాత్తుగా కళ్లు మూసి తెరిచేంతలో ఒక ముసలి కాంత కాలుని కరిచి పట్టుకుంది..తల్లికి రెండే ఆప్షన్స్ ఉన్నాయి తనకూతుర్ని వదిలేసి తనప్రాణం  రక్షించుకోవడం..లేదా ప్రాణాలకు తెగించి మొసలితో పోరాటం చేయడం..క్షణకాలం పాటు ఏం జరుగుతుందో అర్దం కాని దివాలినేన్ ఒక్కసారిగా తేరుకుని.. తన కూతురు ప్రాణాలు కాపాడాలని నిశ్చయించుకుని మొసలితో పోరాటానికి సిధ్దపడింది… ధృడసంకల్పం ఉంటే చాలు ఆ యమున్నైనా ఎదురించొచ్చు…ఆ తల్లి చేసింది కూడా అదే తన ఒంట్లో ఉన్న శక్తినంతా కూడదీసుకుని ఒక చేత్తో మొసలి నోట్లో కరిచి పట్టుకున్న తన కూతురు కాలు లాగడానికి ప్రయత్నిస్తుంది….మరోవైపు బట్టలుతికే కర్ర మరో చేతిలోకి తీసుకుని మొసలి తలపై  బలంగా బాదుతుంది…కొట్టింది…కొట్టింది…మొసలి తన కూతుర్ని వదిలే వరకు కొడ్తూనే ఉంది..మరో చేతితో తన కూతురుని వదిలిపెట్టకుండా పట్టుకునే ఉంది..ఆఖరుకి మొసలి కాంతని వదిలేసింది..ఈ లోపు ఊరిజనం అంతా వచ్చారు…తల్లిని ,కూతురుని హాస్పిటల్ కి తీసుకెళ్లారు.

దివాలి ఫైట్ చేసింది చిన్నా చితక ముసలితో కాదు 13అడుగుల పొడవైన మొసలి..ఎంతో క్రూరమైన మొసలి..గత ఐదేళ్లలో ఆ మొసలి వలన ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారని అక్కడి వైల్డ్ లైఫ్ ఆఫీసర్ చెప్పడంతో తన సాహసాన్ని తనే నమ్మలేకపోయింది..

Comments

comments

Share this post

scroll to top